అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ 'లవ్ స్టోరీ'. శ్రీవెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో శ్రీనారాయణదాస్ నారంగ్, రామ్ మోహన్ రావు నిర్మించారు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 16న థియేటర్ లో విడుదల కావాలి. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. దీంతో సినిమా విడుదలపై సస్పెన్స్ నెలకొంది. 


Also Read : Seetimaarr Movie Review : సీటీమార్ మూవీ రివ్యూ.. ఇది పక్కా మాస్ ఎంటర్టైనర్..


ప్రేక్షకులు కూడా ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఒకానొక దశలో ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందని వార్తలు ఊపందుకున్నాయి. కానీ మేకర్స్ మాత్రం థియేటర్లలోనే సినిమా విడుదలవుతుందని క్లారిటీ ఇచ్చారు. ఆ తరువాత వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 10న సినిమాను రిలీజ్ చేస్తామని మరోసారి ప్రకటించారు. కానీ ఈరోజు కూడా సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు. 


కానీ ఈరోజు సినిమా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. కొన్ని అనివార్యకారణాల వలన సినిమా రిలీజ్ ను వాయిదా వేయాల్సి వచ్చిందని.. ఈ కథను చెప్పాలని చాలా ఆతురతగా ఎదురుచూస్తున్నామని.. సెప్టెంబర్ 24న థియేటర్లో సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈసారైనా సినిమాను రిలీజ్ చేస్తారో లేదో చూడాలి!