'కాంతార చాప్టర్ ‌1' (Kantara Chapter 1)ను బాయ్ కాట్ చేయాలని టాలీవుడ్ ఆడియన్స్ కొందరు సోషల్ మీడియాలో పిలుపు ఇచ్చారు.‌‌ కర్ణాటకలో తెలుగు సినిమాలకు ఆటగాళ్లు కల్పిస్తున్న తరుణంలో అక్కడి చిత్రాలకు ఇక్కడ టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వం ముందు కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మనుషులను కళ కలిపే విధంగా ఉండాలి తప్ప విడదీయకూడదని తెలిపిన ఏపీ ప్రభుత్వం ఎప్పుడు టికెట్ రేట్లు పెంచుతూ జీవో జారీ చేసింది.

Continues below advertisement


ప్రీమియర్ షోలకు అనుమతి...
పది రోజులపాటు టికెట్ రేట్స్ పెంపు!
అక్టోబర్ 2వ తేదీన 'కాంతార చాప్టర్ ‌1' థియేటర్లలో విడుదలకు రెడీ అయ్యింది.‌ అయితే ముందు రోజు రాత్రి ప్రీమియర్ షోస్ వేయడానికి దర్శక నిర్మాతలు రెడీ అయ్యారు. అక్టోబర్ 1వ తేదీ రాత్రి 10 గంటల నుంచి ప్రీమియర్ షోలు ప్రదర్శనకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాంతోపాటు టికెట్ రేట్స్ పెంచుకోవడానికి వెసులుబాటు కల్పించింది. 


ప్రీమియర్ షోలతో పాటు అక్టోబర్ రెండవ తేదీ నుంచి 11వ తేదీ వరకు... సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ రేట్ మీద 75 రూపాయలతో పాటు జీఎస్టీ అలాగే మల్టీప్లెక్స్ స్క్రీన్‌లలో 100 రూపాయలతో పాటు జీఎస్టీ పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మరొక వైపు తెలంగాణ ప్రభుత్వం నుంచి డబ్బింగ్ సినిమా కనుక ఎటువంటి రాయితీలు ప్రత్యేక వెసులుబాటు రాలేదు.


Also Read: సినిమాలు ఆపట్లేదు... ఇండస్ట్రీకి దూరం కావడం లేదు... 'ఓజీ యూనివర్స్' కన్ఫర్మ్ చేసిన పవన్ కళ్యాణ్


టికెట్ రేట్ పెంచుతూ జీవో జారీ చేయడానికి ముందు ఈ సమస్య మీద ఏపీ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించారు. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ నుంచి కిచ్చా సుదీప్, ఉపేంద్ర, శివరాజ్ కుమార్, రిషబ్ శెట్టి వరకు తెలుగు ప్రేక్షకులు కన్నడ కథానాయకులు అందరిని ఆదరిస్తున్నారని, అయితే వ్యాపార పరంగా ఎదురవుతున్న ఇబ్బందులను రెండు భాషల ఫిలిం ఛాంబర్స్ కలసి చర్చించుకోవాలని సూచించారు. కర్ణాటకలో ఇటీవల తెలుగు చిత్రాలకు ఎదురైన ఆటంకాలను దృష్టిలో పెట్టుకుని అక్కడి చిత్రాలకు ఇక్కడ ప్రోత్సాహం ఆపవద్దని అనడం సరికాదని, మంచి మనసుతో జాతీయ భావనతో ముందుకు వెళ్లాలని ఆయన పేర్కొన్నారు. పవన్ నిర్ణయాన్ని గీతా ఆర్ట్స్ స్వాగతించింది. అదే సమయంలో కర్ణాటకలో తెలుగు సినిమాను సపోర్ట్ చేయాలని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి రిక్వెస్ట్ చేసింది.  


Also Read'కాంతార చాప్టర్ 1' సెన్సార్ రిపోర్ట్... రిషబ్ శెట్టి, రుక్మిణీ వసంత్ సినిమా టాక్ ఎలా ఉందంటే?



పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'ఓజీ'తో పాటు అంతకు ముందు 'హరిహర వీరమల్లు', రామ్ చరణ్ 'గేమ్ చేంజర్', 'ఆర్ఆర్ఆర్' సినిమాలకు కర్ణాటకలో ఆటంకాలు ఎదురయ్యాయి. దానికి తోడు ఇటీవల హైదరాబాద్ వేదికగా జరిగిన 'కాంతార' తెలుగు ప్రీ రిలీజ్ వేడుకలో రిషబ్ శెట్టి కన్నడలో మాట్లాడడం తెలుగు ప్రేక్షకులకు నచ్చలేదు. దాంతో ఆ సినిమాను బాయ్ కాట్ చేయాలని పిలుపు ఇచ్చారు.