Rishab Shetty's Kantara Chapter 1 Updates: కన్నడ కథానాయకుడు రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించడంతో పాటు దర్శకత్వం వహించిన సినిమా 'కాంతార చాప్టర్ 1'. అక్టోబర్ 2న థియేటర్లలోకి వస్తోంది. అంతకు ముందు రోజు పాన్ ఇండియా స్థాయిలో ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. ఈ సినిమా సెన్సార్ పూర్తి అయ్యింది. మరి, రిపోర్ట్ ఎలా ఉందో తెలుసుకోండి. 

Continues below advertisement

పెద్దలతో పాటు పిల్లలు కూడా వెళ్లొచ్చు!Kantara Chapter 1 Censor Certificate: 'కాంతార చాప్టర్ 1' చిత్రానికి సెన్సార్ బోర్డు 'యు/ఏ' (U/A) సర్టిఫికెట్ ఇచ్చింది. అంటే పెద్దలతో పాటు పిల్లలు కూడా ఈ చిత్రానికి వెళ్లొచ్చు. 

Kantara Chapter 1 Runtime: సెప్టెంబర్ 30, 2022... మూడేళ్ళ క్రితం 'కాంతార' థియేటర్లలో విడుదలైంది. తొలుత కన్నడలో, ఆ తర్వాత తెలుగు సహా తమిళ, హిందీ భాషల్లో విడుదల చేశారు. ఆ సినిమా రన్ టైమ్ 148 నిమిషాలు. అంటే రెండు గంటల ముప్ఫై నిమిషాలు. దానికి ప్రీక్వెల్‌గా వస్తున్న 'కాంతార చాఫ్టర్ 1' రన్ టైమ్ 168 నిమిషాలు. అంటే రెండు గంటల 48 నిమిషాలు. మొదటి పార్ట్ కంటే ప్రీక్వెల్ నిడివి 20 నిమిషాలు పెరిగింది.

Continues below advertisement

రాచరికం... దైవం... ఇది భారీ సినిమా...సెన్సార్ బోర్డు నుంచి రిపోర్ట్ ఎలా ఉంది?'కాంతార' పాన్ ఇండియా సక్సెస్ సాధించడంతో ప్రీక్వెల్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. పైగా, దసరా పండక్కి సినిమా వస్తోంది. మొదటి పార్టుతో కంపేర్ చేస్తే ప్రీక్వెల్ స్వరూపం మారిందని సెన్సార్ బోర్డు నుంచి రిపోర్ట్ అందింది. 

రాచరిక వ్యవస్థ మీద తిరగబడిన ఓ రెబల్ / వీరుడిగా 'కాంతార చాప్టర్ 1'లో హీరో రిషబ్ శెట్టి క్యారెక్టర్ ఉంటుందని తెలిసింది. రాచరికపు నేపథ్యంలో తెరకెక్కిన ప్రతి సన్నివేశంలో గ్రాండియర్ కనిపించిందట. విజువల్స్ నుంచి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వరకు ప్రతి అంశంలో గ్రాండియర్ స్పష్టంగా తెలుస్తుందట. స్క్రీన్ మీద ప్రేక్షకులు అందరికీ కనిపించే హీరో రిషబ్ శెట్టి అయితే... స్క్రీన్ వెనుక సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్, ఛాయాగ్రాహకుడు అరవింద్ కశ్యప్ ప్రాణం పోశారట. దర్శకుడిగా రిషబ్ శెట్టి ఊహను తెరపైకి తీసుకు రావడంలో వాళ్ళిద్దరి కృషి ఎంతో ఉందట. హోంబలే ఫిలిమ్స్ ప్రొడక్షన్ వేల్యూస్ సైతం భారీగా ఉన్నాయట.

Also Read: ఎన్టీఆర్ సినిమాలో శింబు... 'దేవర 2' కోసం అడిగారా?

'కాంతార' విజయం సాధించడానికి ప్రధాన కారణం సినిమాలో డివోషనల్ టచ్. అది ఈసారి కూడా ప్రేక్షకులు మనసులు తాకేలా ఉంటుందట. డివోషనల్ టచ్, కథ కంటే గ్రాండియర్ లుక్ & విజువల్స్ ఎక్కువ హైలైట్ అవుతాయట. రిషబ్ శెట్టి సరసన కనకవతి పాత్రలో రుక్మిణీ వసంత్ నటన ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం అంటున్నారు. జయరామ్, గుల్షన్ దేవయ్య పాత్రలు సైతం ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంటాయట. మైథాలజీతో పాటు గ్రాండియర్ రాయల్ టచ్ ఉన్న ఈ సినిమా విజయం సాధించడం గ్యారెంటీ అని ఫస్ట్ రిపోర్ట్. మరి ఆడియన్స్ నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.

Also Readమళ్ళీ మెగా పవర్ స్టారే... గ్లోబల్ స్టార్ ట్యాగ్ తీసేసిన రామ్ చరణ్!