ఎవరు? 'దేవర 2' (Devara 2 Movie Update)లో విలన్ ఎవరు? మొదటి పార్టులో కనిపించిన సైఫ్ అలీ ఖాన్ కాకుండా మరొకరు ఉన్నారా? తమిళ కథానాయకుడు శింబు (Simbu)ను 'దేవర' ప్రపంచంలోకి తీసుకు రావడానికి దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) ట్రై చేస్తున్నారా? అంటే... 'అవును' అని చెప్పాలి. ప్రస్తుతం ఇటు తెలుగు, అటు తమిళ చిత్రసీమల్లో ట్రెండింగ్ టాపిక్ ఇది. పూర్తి వివరాల్లోకి వెళితే...
'దేవర 2' ఆగలేదు... చెక్ పెట్టిన టీమ్!'దేవర' విడుదల తర్వాత నుంచి సీక్వెల్ తెరకెక్కే అవకాశాలు లేవని ఓ నెగిటివ్ ప్రచారం అయితే బలంగా జరిగింది. బాలీవుడ్ డెబ్యూ 'వార్ 2'తో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్'కు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రయారిటీ ఇవ్వడం వల్ల అటువంటి పుకార్లకు బలం చేకూరింది. అయితే... 'దేవర' విడుదలై ఏడాది గడిచిన సందర్భంగా పుకార్లకు చెక్ పెట్టింది టీమ్. 'దేవర 2' కోసం రెడీ అవ్వమని అప్డేట్ ఇచ్చింది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... సినిమాలో శింబు ఉన్నారట.
శింబు కోసం కొరటాల పవర్ ఫుల్ రోల్!'దేవర 2' కోసం తమిళ కథానాయకుడు, తెలుగు ప్రేక్షకులకు సైతం బాగా తెలిసిన శింబును దర్శక నిర్మాతలు అప్రోచ్ అయ్యారట. అయితే అది విలన్ రోలా? లేదా మరొకటా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
'దేవర' సినిమా గుర్తుందా? ముంబై నుంచి దేవరను వెతుకుతూ వచ్చిన పోలీస్ అధికారి అజయ్‌కు ప్రకాష్ రాజ్ తమ కథ చెప్పడం మొదలు పెడతారు. సముద్రం లోపల చాలా అస్థిపంజరాలు కనిపిస్తాయి. అందులో ఒక అస్థిపంజరం మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది. అది ఎవరిది? అనేది రివీల్ చేయలేదు. 'దేవర 2'లో ఆ పాత్ర కీలకం కానుంది. అందుకోసం శింబును సంప్రదించారా? లేదంటే మరొక పాత్ర కోసమా? అనేది త్వరలో స్పష్టత రానుంది.
Also Read: 'కాంతార' వర్సెస్ 'ఓజీ'... కర్ణాటకలో ఆటంకాలు & టికెట్ రేట్ ఇష్యూపై స్పందించిన పవన్
'మన్మథ' వంటి సినిమాలు విడుదలైన సమయంలో తెలుగులో శింబుకు మంచి మార్కెట్ ఉండేది. అయితే ఆ తర్వాత వేరే తమిళ హీరోలు ఆ మార్కెట్ క్యాప్చర్ చేశారు. అటు తమిళంలోనూ శింబు జోరు తగ్గింది. మణిరత్నం 'నవాబ్', గౌతమ్ వాసుదేవ్ మీనన్ 'లైఫ్ ఆఫ్ ముత్తు' సినిమాలతో కొంచెం హిట్ ట్రాక్ ఎక్కారు. ఈ హీరో ఇప్పుడు తెలుగు మార్కెట్ పెంచుకోవాలని ట్రై చేస్తున్నారు. ఎన్టీఆర్ సినిమా చేస్తే వచ్చే క్రేజ్ వేరు. అందువల్ల 'దేవర 2'కు ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి.
బాబీ డియోల్ సంగతి ఏంటి? ఉన్నారా?'దేవర' విడుదల సమయంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఓ క్యారెక్టర్ చేశారని ప్రచారం జరిగింది. బాలకృష్ణ 'డాకూ మహారాజ్', పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమాల్లో ఆయన కనిపించారు. కానీ 'దేవర'లో ఉన్నారా? లేదా? అనే క్లారిటీ రాలేదు. బాబీ డియోల్ కోసం అనుకున్న పాత్ర కోసం శింబు దగ్గరకు వెళ్ళారా? లేదా రెండు వేర్వేరు క్యారెక్టర్లా? అనేది త్వరలో తెలుస్తుంది. 'దేవర' విజయం తర్వాత కథలో కొరటాల శివ మార్పులు చేర్పులు చేస్తున్నారు. మరింత భారీ విజయం మీద ఆయన కన్నేశారు.
Also Read: మళ్ళీ మెగా పవర్ స్టారే... గ్లోబల్ స్టార్ ట్యాగ్ తీసేసిన రామ్ చరణ్!