ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) రోజు రోజుకూ మరింత క్రేజీగా మారుతోంది. తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన 'హను - మాన్'తో ఈ సినిమాటిక్ యూనివర్స్ మొదలైంది. తర్వాత 'జై హనుమాన్' అనౌన్స్ చేశారు. ఇప్పుడు 'పీవీసీయూ'లో తెరకెక్కుతున్న మూడో సినిమా 'మహాకాళి' (PVCU Mahakali Movie). అందులో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ రివీల్ చేశారు. ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా!Akshaye Khanna First Look From Mahakali Released: విక్కీ కౌశల్ హీరోగా ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన 'ఛావా'లో ఔరంగజేబు పాత్రలో అక్షయ్ ఖన్నా యాక్ట్ చేశారు. అందులో ఆయన లుక్, నటనకు మంచి పేరు వచ్చింది. ఆయన లుక్ చూసి చాలా మంది సర్‌ప్రైజ్ అయ్యారు. ఇప్పుడు మరోసారి 'మహాకాళి'లో లుక్ ద్వారా సర్‌ప్రైజ్ చేశారు.
'మహాకాళి' సినిమాలో శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా కనిపించనున్నట్టు చిత్ర బృందం తెలిపింది. ''భగవంతుని నీడలో కాంతివంతమైన తిరుగుబాటు జ్వాలగా మారిన శుక్రాచార్యుడు'' అంటూ అక్షయ్ ఖన్నా లుక్ విడుదల చేశారు. తెలుగులో ఆయనకు తొలి చిత్రమిది. ఈ చిత్రాన్ని ఆర్కేడీ స్టూడియోస్ పతాకం మీద ఆర్కే దుగ్గల్ సమర్పణలో రివాజ్ రమేష్ దుగ్గల్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.
Also Read: 'కాంతార చాప్టర్ 1' సెన్సార్ రిపోర్ట్... రిషబ్ శెట్టి, రుక్మిణీ వసంత్ సినిమా టాక్ ఎలా ఉందంటే?
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో మొదటి ఫిమేల్ సూపర్ హీరో సినిమాగా 'మహాకాళి' తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ కథ అందిస్తున్నారు. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహించనున్నారు. 'అధీర' సైతం PVCUలో సినిమా. అందులో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు కళ్యాణ్ దాసరి హీరోగా, ప్రధాన పాత్రలో ఎస్‌జే సూర్య నటిస్తున్నారు. ఈ సినిమాకు శరణ్ కొప్పిశెట్టి దర్శకుడు.
Also Read: ఇడ్లీ కొట్టు సెన్సార్ రిపోర్ట్... నిత్యా మీనన్‌తో ధనుష్ మరో హిట్ కొడతాడా? పల్లెటూరి కథ టాక్ ఏమిటంటే?