Kannada Star Hero Kichcha Sudeep Travelled In Hyderabad Metro: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ (Kichcha Sudeep).. తెలుగు ఆడియన్స్‌కు పరిచయం అక్కర్లేని పేరు. రాజమౌళి 'ఈగ'తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన ఈయన.. ఆ తర్వాత ప్రభాస్ బాహుబలి, చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రాల్లో తన నటనతో మెప్పించారు. తాజాగా, సుదీప్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ కోసం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ మేరకు తన టీంతో కలిసి బుధవారం సాయంత్రం ఉప్పల్ స్టేడియంకు మెట్రోలో (Hyderabad Metro) ప్రయాణించారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు, మెట్రో సిబ్బంది ఆయనతో ఫోటోలు దిగారు. తాజాగా, ఇవి నెట్టింట వైరల్‌గా మారాయి. సామాన్యులతో కలిసి సామాన్యుడిలా సుదీప్ మెట్రోలో ప్రయాణించడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా.. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (Celebrity Cricket League) దాదాపు 14 సీజన్లుగా జరుగుతుండగా.. కర్ణాటక బుల్డోజర్స్ టీంకు కిచ్చా సుదీప్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 14న ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్‌లో కర్ణాటక టీం చెన్నై రైనోస్‌తో తలపడనుంది. అటు, క్రికెట్ లీగ్ మ్యాచ్‌లకు భారీ భద్రత కల్పిస్తున్నట్లు రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. ఈ నెల 14, 15 తేదీల్లో మ్యాచ్‌లు జరుగుతాయని చెప్పారు. 15న జరగనున్న మ్యాచ్‌లో తెలుగు వారియర్స్, చెన్నై రైనోస్ పోటీ పడనున్నాయి.
Also Read: బేబమ్మ ఆశలన్నీ ఆ మూడు తమిళ సినిమాల మీదే... హిట్ కొట్టి మళ్ళీ టాలీవుడ్ డోర్స్ ఓపెన్ చేయమ్మా
ఈ నెల 25న ఓటీటీలోకి 'మ్యాక్స్'
రక్తచరిత్ర 1, 2 సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన సుదీప్.. రాజమౌళి 'ఈగ'తో మరింత చేరువయ్యారు. నాని హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. 2022లో విడుదలైన 'విక్రాంత్ రోణ' తర్వాత సుదీప్ లీడ్ రోల్‌లో నటించిన చిత్రం 'మ్యాక్స్'. విజయ్ కార్తికేయ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందగా.. క్రిస్మస్ కానుకగా గతేడాది డిసెంబర్ 25న విడుదలైంది. కన్నడతో పాటు తెలుగులోనూ మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, సునీల్, శరత్ లోహితస్య, ఉగ్రం మంజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.60 కోట్లు వసూలు చేసింది.
తాజాగా, 'మ్యాక్స్' ఓటీటీలోకి సైతం స్ట్రీమింగ్ కానుంది. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం 'జీ5' సొంతం చేసుకోగా ఈ నెల 22 నుంచి కన్నడలోకి అందుబాటులోకి రానుంది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది.