రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఓ పాన్ ఇండియా సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'ఫౌజీ' (Fauji Movie) టైటిల్ ఖరారు చేశారని సమాచారం. అయితే, ఆ విషయాన్ని అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. కానీ, ఈ సినిమాలో తాను నటిస్తున్న విషయాన్ని బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అనుపమ్ ఖేర్ (Anupam Kher) చెప్పారు. 


అనుపమ్ ఖేర్ @ 544... ప్రభాస్ 'ఫౌజీ'!
''ఇండియన్ సినిమా బాహుబలి... వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ హీరోగా వెరీ టాలెంటెడ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నేను నటిస్తున్నాను. నటుడిగా నా 544వ చిత్రం ఇది. వండర్ ఫుల్ టీమ్ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు నా ఫ్రెండ్స్ సుదీప్ చటర్జీ సినిమాటోగ్రాఫర్. ఈ సినిమాలో నటిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది'' అని అనుపమ్ ఖేర్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ప్రభాస్, హను రాఘవపూడి,‌‌ సుదీప్ చటర్జీతో దిగిన ఫోటోలను ఆయన షేర్ చేశారు.






నిఖిల్ కథానాయకుడుగా చందూ మొండేటి దర్శకత్వం వహించిన 'కార్తికేయ 2' సినిమాలోనూ అనుపమ్ ఖేర్ నటించారు. ఆయన క్యారెక్టర్, కృష్ణుడు గురించి ఆయన చెప్పిన డైలాగ్స్ ఆ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన 'టైగర్ నాగేశ్వర రావు' సినిమాలో కూడా అనుపమ్ ఖేర్ నటించారు. తెలుగులో ఆయనకు మూడో సినిమా 'ఫౌజీ'. ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఎటువంటి రోల్ చేస్తున్నారు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ సినిమా ఇమాన్వీ హీరోయిన్.


Also Readఇన్‌స్టాగ్రామ్‌లో బన్నీని అన్ ఫాలో చేసిన రామ్ చరణ్ - మెగా కజిన్స్ మధ్య ఏం జరుగుతోంది?



గాయం నుంచి కోలుకొని మళ్ళీ షూటింగ్!
'ఫౌజీ' సినిమా చిత్రీకరణలో ప్రభాస్ గాయపడ్డారు. దాంతో ఆయన కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నారు. ఇంజ్యూరీ మంచి కోలుకున్న ప్రభాస్ మళ్లీ చిత్రీకరణకు హాజరు అవుతున్నారు. హైదరాబాద్ సిటీలో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ప్రభాస్, అనుపమ్ ఖేర్ సహా ఇతర ప్రధాన తారాగణం మీద కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు దర్శకుడు హను రాఘవపూడి. 


'ఫౌజీ'తో పాటు ప్రభాస్ చేతిలో మరో ఐదు!
Prabhas Upcoming Movies: 'ఫౌజీ'తో పాటు మారుతీ దర్శకత్వంలో 'ది రాజా సాబ్' చిత్రీకరణ కూడా చేస్తున్నారు ప్రభాస్. ఈ రెండు సినిమాల్లో కాకుండా ఆయన చేతిలో మరో నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో రెండు సీక్వెల్స్ కావడం గమనార్హం. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సీక్వెల్, అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్ చేయాల్సి ఉంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' సినిమా కూడా చేయాల్సి ఉంది. వీటితో పాటు మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.


Also Readవైసీపీకి బుల్లిరాజు వార్నింగ్... 'సంక్రాంతికి వస్తున్నాం' బుడ్డోడి వైరల్ ట్విట్టర్ పోస్టులో నిజమెంత?