'కన్నప్ప' మూవీపై ఇప్పుడు పాజిటివ్ బజ్ నడుస్తోంది. కారణం కొత్తగా ఆ మూవీ నుండి రిలీజ్ అయిన 'శివ శివ శంకరా....' పాట. తెలుగులో తొలిసారి మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్న స్టీఫెన్ దేవస్సే ఈ ఒక్క పాటతో 'కన్నప్ప' సినిమాపై పాజిటిక్ వైబ్ తెచ్చాడంటూ ఆడియన్స్ అంటున్నారు. సోషల్ మీడియాలోనూ ఇదే చర్చ నడుస్తోంది. మంచు విష్ణు తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్న 'కన్నప్ప' సినిమాకు ఇది ఒక మేలు చేకూర్చే అంశమని చెప్పొచ్చు. అయితే స్టీఫెన్ దేవస్సే పదేళ్ల క్రితమే ఆంధ్రుల రాజధాని 'అమరావతి' సాక్షిగా తెలుగు వాళ్ళను పలకరించాడు. 

శివమణితో కలిసి తెలుగు వాళ్ళని అలరించిన స్టీఫెన్రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి అమరావతిని రాజధానిగా ప్రకటించిన టీడీపీ ప్రభుత్వం దాన్ని శంకుస్థాపన కోసం ప్రధాని మోదీని అమరావతికి ఆహ్వానించింది. అక్టోబర్ 22, 2015న ఉద్దండ రాయుని పాలెం వద్ద ప్రధాని మోదీ స్వయంగా అమరావతికి శంకుస్థాపన చేశారు. ఆ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులు, అమరావతి ప్రాంత ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. వారిని అలరించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమం 'శివమణి - స్టీఫెన్ దేవస్సే'ల మ్యూజిక్ షో.

అంతవరకూ శివమణి డ్రమ్స్ టాలెంట్ గురించి తెలిసిన తెలుగు వాళ్లను స్టీఫెన్ తన కీ బోర్డు టాలెంట్‌తో మెస్మరైజ్ చేశాడు. ఆ రోజు ఆ ప్రోగ్రాం అరేంజ్ చేసింది నారా లోకేష్ అని చెబుతారు. సంప్రదాయ, మోడ్రన్ సంగీతాల కలయికతో  శివమణి, స్టీఫెన్ ఇచ్చిన మ్యూజికల్ షో ఇప్పటికీ యూట్యూబ్‌లో పెద్ద ఎత్తున ఆకట్టుకుంటోంది. దానితో స్టీఫెన్‌కు తెలుగులో అభిమానులు ఏర్పడ్డారు. కానీ ఆయన ఎందుకో టాలీవుడ్ ఇండస్ట్రీపై పెద్దగా దృష్టి పెట్టలేదు. 10 ఏళ్ల తర్వాత 'కన్నప్ప' సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా తొలిసారి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు స్టీఫెన్ దేవస్సే. 

Also Read: ఇన్‌స్టాగ్రామ్‌లో బన్నీని అన్ ఫాలో చేసిన రామ్ చరణ్ - మెగా కజిన్స్ మధ్య ఏం జరుగుతోంది?

ఎవరీ స్టీఫెన్ దేవస్సే? ఆయన నేపథ్యం ఏమిటి?కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన స్టీఫెన్ చాలా చిన్న వయసులోనే మ్యూజిక్ రంగంలో అడుగు పెట్టాడు. సంగీత రంగంలో తన ప్రతిభను చూసిన హరిహరన్ తనతో పాటు యూరోప్‌లో జరిగే మ్యూజిక్ షోలకు స్టీఫెన్ దేవస్సేను తీసుకువెళ్లాడు. అప్పటికి అతని వయసు 18 ఏళ్లు మాత్రమే. మరో ఏడాదికే మరి కొందరితో కలిసి సొంతంగా ఒక మ్యూజిక్ బ్యాండ్ ఏర్పాటు చేశాడు స్టీఫెన్. రిలీజ్ చేసిన 'యే జిందగాని' ప్రవేట్ ఆల్బమ్ పెద్ద హిట్ అయింది. దానితో మలయాళ సినీ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్‌గా అవకాశం రావడంతో 2003 నుండి తనకు నచ్చిన సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ వస్తున్నారు స్టీఫెన్. అటు వెస్ట్రన్ ఇటు క్లాసికల్ మ్యూజిక్‌లో సమాన ప్రతిభ గల స్టీఫెన్ టాలీవుడ్ ఎంట్రీకి మాత్రం చాలా టైం తీసుకున్నాడు. చివరకు మంచు విష్ణు భారీ ఖర్చుతో నిర్మిస్తున్న 'కన్నప్ప' సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా తెలుగులో అడుగుపెడుతున్నారు స్టీఫెన్ దేవస్సే. తన తొలిపాటతోనే సినిమాపై వైబ్ పూర్తిగా మార్చేసిన స్టీఫెన్ భవిష్యత్తులో మరెన్ని సంచలనాలు సృష్టిస్తారో చూడాలి. అన్నట్టు వివిధ భాషల్లో చాలా మ్యూజిక్ షోలకు జడ్జి గానూ.. గెస్టుగానూ వెళ్లిన స్టీఫెన్ 2020-21లో సోనీ టీవీలో ప్రసారమైన 'ఇండియన్ ఐడియల్ 2'లో మన తెలుగు అమ్మాయి 'షణ్ముఖ ప్రియ'కు మెంటర్‌గానూ తన సహకారం అందించిన సంగతి తెలుగు సంగీత ప్రియులకు ఇంకా గుర్తున్న విషయమే.

Also Readవైసీపీకి బుల్లిరాజు వార్నింగ్... 'సంక్రాంతికి వస్తున్నాం' బుడ్డోడి వైరల్ ట్విట్టర్ పోస్టులో నిజమెంత?