టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో నెంబర్ వన్ స్థానానికి వెళుతుందని అందరూ అంచనా వేసిన కృతి శెట్టి (Krithi Shetty) కెరీర్ 2024లో డీలా పడింది. 'ఉప్పెన'తో 2021లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి తొలి సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. 'బేబమ్మ'గా తెలుగు ప్రజల మనసుల్లో స్థిరపడిపోయింది. అదే ఏడాది వచ్చిన 'శ్యామ్ సింఘ రాయ్' కూడా హిట్. ఆ తర్వాత ఏడాది 2022లో వచ్చిన 'బంగార్రాజు'తో హ్యాట్రిక్ హిట్ హిట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది కృతి శెట్టి.


హ్యాట్రిక్ హిట్స్‌ తర్వాత వరుస ఫెయిల్యూర్స్!
హ్యాట్రిక్ హిట్స్ తర్వాత వచ్చిన 'వారియర్', 'మాచర్ల నియోజకవర్గం' సినిమాలు కృతీ శెట్టికి డిజాస్టర్ రిజల్ట్స్ అందించాయి. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' పెద్దగా ఆడకపోయినా కృతి శెట్టి నటనకు పేరు వచ్చింది. మంచి అంచనాలతో వచ్చిన 'కస్టడీ' (2023) కూడా ఆడలేదు. ఇక, గతేడాది (2024)లో కృతి శెట్టి తెలుగులో 'మనమే'లో నటించింది. ఆ సినిమా కూడా డిజాస్టర్ అయింది. కానీ మలయాళంలో టోవినో థామస్‌తో ఆమె నటించిన 'ఏఆర్ఎమ్' సినిమా కేరళలో సూపర్ హిట్ అయింది.


Also Readవిలన్‌తో బాలకృష్ణ, కమల్ హాసన్, నాగార్జునకు మాటల్లేవ్... ఈ సినిమాల్లో అదే స్పెషాలిటీ మరి


బేబమ్మ అసలు అన్నీ తమిళ సినిమాల మీదే
Krithi Shetty Upcoming Movies 2025: ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఆమె నటించిన మూడు సినిమాల రిలీజ్‌లు కన్ఫర్మ్ అయ్యాయి. అయితే అవన్నీ తమిళ సినిమాలే కావడం విశేషం. తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన కార్తి హీరోగా వస్తున్న 'వా... వాతియార్'తో పాటు 'లవ్ టుడే' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రదీప్ రంగనాథన్ సరసన 'LIC -లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' మూవీల్లో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. వీటిలో 'ఎల్ఐసి' సినిమాకు నయనతార ప్రొడ్యూసర్ కాగా... ఆమె భర్త విఘ్నేశ్ శివన్ డైరెక్టర్. ఇవి రెండూ కాకుండా 'జయం' రవి హీరోగా వస్తున్న ఫాంటసీ సినిమా 'జీనీ'లోనూ కృతి శెట్టే హీరోయిన్. ఈ మూడు సినిమాలు తెలుగులోనూ డబ్ అవడం ఖాయం. వీటిలో కనీసం రెండు సక్సెస్ అయినా తనకు మళ్ళీ టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ స్టార్‌డమ్ పెరుగుతుందనే ఆశలో బేబమ్మ ఉంది. ఈ అమ్మాయిని టాలీవుడ్ ఆడియన్స్ మర్చిపోయే స్థితికి వచ్చేసింది. ఇప్పటికే శ్రీలీల నుండి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న కృతి శెట్టి కెరీర్ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో బలపడాలంటే ఈ మూడు సినిమాలే కీలకం. మరి ఈ ఏడాది 2025లో బేబమ్మ ఆశలు ఏ మేరకు నెరవేరుతాయో చూడాలి. తెలుగులో ఆల్రెడీ కొత్త సినిమా ఆఫర్లు ఆమె తలుపు తట్టినట్టు టాక్. రెండు మూడు కథలు విన్నారట. దర్శక నిర్మాతలతో ఆవిడ చర్చలు సాగిస్తున్నారట.


Also Readఎవరీ స్టీఫెన్ దేవస్సే? 'కన్నప్ప'కు మ్యూజిక్ చేసే ఛాన్స్ రావడానికి పదేళ్ల ముందు అమరావతి శంకుస్థాపనలో చితక్కొట్టిన కుర్రాడు ఇతడేనని తెలుసా?