Trisha Krishnan: హీరోయిన్‌గా పాతికేళ్లు... సౌత్ క్వీన్ త్రిషది మామూలు రికార్డు కాదు... 2025లోనూ క్రేజీ ప్రాజెక్టులే

పాతికేళ్ల క్రితం ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఓ అమ్మాయి ఇప్పటికీ కథానాయికగా కంటిన్యూ కావడం అంటే మామూలు విషయం కాదు. సౌత్ క్వీన్ త్రిష రికార్డ్ క్రియేట్ చేశారు. ఆవిడ కెరీర్ మీద ఎనాలసిస్....

Continues below advertisement

ఎంత గొప్ప కథానాయికకు అయినా 5 నుంచి 10 ఏళ్ళు మాత్రమే కెరీర్ పీక్‌లో ఉంటుంది. ఈ లోపు కొత్త హీరోయిన్లు వచ్చేయడం... పాత హీరోయిన్లు బోర్ కొట్టేయడం అనేది సినిమా ఇండస్ట్రీలో అత్యంత సహజం. ఆ తర్వాత కూడా కెరీర్ కొనసాగించాలి అనుకుంటే అక్క లేదా వదిన పాత్రలకు మారిపోవడమే హీరోయిన్ల ముందున్న మార్గం. అయితే త్రిష కృష్ణన్ (Trisha Krishnan) రూటే సపరేటు. పాతికేళ్ల క్రితం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన త్రిష మధ్యలో కాస్త డల్ అయినట్టు కనపడినా... ప్రస్తుతం ఆవిడ కెరీర్ పీక్‌లో ఉంది. కొత్త ఏడాదిలో ఏడు సినిమాల్లో ఆమె కనబడబోతోంది. అవన్నీ కూడా బిగ్ స్టార్స్ మూవీస్ కావడం విశేషం.

Continues below advertisement

ఇండస్ట్రీలో త్రిష అడుగుపెట్టి పాతికేళ్లు...
హీరోయిన్ రోల్ చేయడానికి ముందు 'జోడీ'లో!
ప్రశాంత్, సిమ్రాన్ జంటగా 1999లో వచ్చిన 'జోడి' సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో కాసేపు కనిపిస్తుంది త్రిష. ఆ తర్వాత యాడ్స్ లో ఫేమస్ కావడంతో 2002లో సూర్య హీరో గా వచ్చిన 'మౌనం పెసియాదే' సినిమాలో హీరోయిన్ ఛాన్స్ దక్కించుకుంది. ఆ సినిమా హిట్ కావడంతో 2003లో వచ్చిన తమిళ బ్లాక్ బస్టర్ 'సామీ'లో విక్రమ్ సరసన హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. ఇక అప్పటి నుంచి ఆమె కెరీర్ లో వెనుతిరిగి చూసుకోలేదు. 'వర్షం' సినిమాతో 2004లో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన త్రిష ఇక్కడ కూడా టాప్ రేంజ్ కు దూసుకుపోయింది. వెంట వెంటనే 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'అతడు' లాంటి హిట్స్ ఆమె కెరియర్ కు చాలా హెల్ప్ అయ్యాయి. అక్కడ నుంచి ఆమె  కెరీర్ దూసుకుపోతూనే వచ్చింది. మధ్య మధ్యలో డల్లయినప్పుడల్లా 'విన్నతాండి వరువాయ' (2010), '96' (2018), 'పొన్నియన్ సెల్వన్' (2022), 'లియో' (2023) లాంటి హిట్స్ త్రిష ఇమేజ్ ను కొనసాగిస్తూనే వచ్చాయి. ఇవే కాకుండా 'కోడి' (2016)లో విలన్ గానూ, 'నాయకి' (2016), 'మోహిని' (2018) లాంటి ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ త్రిష ప్రయోగాలు చేసింది. మధ్యలో 'కట్టామీటా'తో బాలీవుడ్ వైపూ ఓ చూపు చూసింది. 

త్రిషకు నయనతార నుండి గట్టి పోటీ ఎదురైనా....
త్రిష తర్వాత వచ్చిన నయనతార, అనుష్క, కాజల్ అగర్వాల్, సమంత నుండి ఆమెకు గట్టి పోటీ ఎదురైనా... ప్రేక్షకుల్లో ఆమె పట్ల ఆదరణ, హీరోయిన్‌గా టాప్ ప్లేస్ మాత్రం చెక్కిచెదరలేదు. మధ్యలో వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఆమె పర్సనల్ లైఫ్ లోనూ, కెరీర్లోనూ తిరిగి నిలబడింది. గత ఏడాది 'బృంద' సిరీస్‌తో సక్సెస్ ఫుల్ డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చింది త్రిష. ఈ ఏడాది మలయాళంలో టోవినో థామస్ 'ఐడెంటిటీ'లో నటించగా... అక్కడ మంచి హిట్ అందుకుంది. తమిళ సూపర్ స్టార్ అజిత్ హీరోగా 'విడామయుర్చి' ఆశించిన విజయం అందుకోలేదు. కానీ, ప్రజెంట్ ఆమె చేతిలో అన్నీ మంచి క్రేజీ ప్రాజెక్టులే ఉన్నాయి.

Also Read: విలన్‌తో బాలకృష్ణ, కమల్ హాసన్, నాగార్జునకు మాటల్లేవ్... ఈ సినిమాల్లో అదే స్పెషాలిటీ మరి

తెలుగులో చిరు... తమిళంలో అజిత్, సూర్య సినిమాలు!
Trisha Upcoming Movies: ప్రస్తుతం త్రిష నటిస్తున్న సినిమాలకు వస్తే... అజిత్ కుమార్‌తో 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో నటించింది. ఇక, మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న భారీ సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'లో హీరోయిన్‌గా త్రిష నటిస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల్ని చాలా కాలం తర్వాత పలకరించబోతోంది. ఇంకా తమిళంలో మణిరత్నం - కమల్ హాసన్ క్రేజీ ప్రాజెక్ట్ 'థగ్ లైఫ్', ఇంకా పేరు పెట్టని 'సూర్య 45' సినిమాల్లో త్రిష హీరోయిన్‌గా కనిపించబోతోంది. మలయాళంలో మోహన్ లాల్ సరసన త్రిష నటించిన 'రామ్' సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. సక్సెస్ మాత్రమే మాట్లాడే ఈ ఏడు సినిమాల్లో కనీసం సగం హిట్ అయినా త్రిష కెరియర్ మరి కొన్నేళ్లు కొనసాగడం గ్యారెంటీ.

శ్రీదేవి, జయప్రద,హేమమాలినీ వంటి అందగత్తెలకూ కుదర్లేదు
ఒక హీరోయిన్ ఎలాంటి బ్రేక్ లేకుండా పాతికేళ్లుగా కమర్షియల్ సినిమాల్లో టాప్‌లో కొనసాగడం అనేది ఇంతవరకూ ఎప్పుడూ జరగలేదు. ఆ రికార్డు త్రిషకు మాత్రమే సొంతమైంది. హిందీ సినిమాలలో రేఖ కూడా హీరోయిన్‌గా చాలాకాలం కొనసాగినా చివర్లో ఆమె నటించిన సినిమాల బడ్జెట్లూ, క్వాలిటీ అంత గొప్పవి కావు. లెజెండ్రీ హీరోయిన్లుగా సినీ ఇండస్ట్రీని ఏలిన శ్రీదేవి, జయప్రద, హేమమాలినీ లాంటి వాళ్లకు సైతం ఈ రికార్డు లేకపోవడం త్రిషకు  ఆడియన్స్ లోనూ.. ఫిల్మ్ ఇండస్ట్రీ లోనూ ఉన్న క్రేజ్ ను చెబుతోంది.

Also Readఎవరీ స్టీఫెన్ దేవస్సే? 'కన్నప్ప'కు మ్యూజిక్ చేసే ఛాన్స్ రావడానికి పదేళ్ల ముందు అమరావతి శంకుస్థాపనలో చితక్కొట్టిన కుర్రాడు ఇతడేనని తెలుసా?

Continues below advertisement