Kangana Ranaut: తన ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎన్ని కాంట్రవర్సీలు ఉన్నా.. తన రాజకీయ జీవితంలో ఎంత బిజీగా ఉన్నా.. ఫ్యామిలీకి మాత్రం ఎప్పుడూ టైమ్ ఇస్తుంది కంగనా రనౌత్. ఇటీవల బీజేపీ తరపున హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి ఎంపీగా పోటీ చేసింది కంగనా. అక్కడ ఘనవిజయం సాధించింది కూడా. ఇక ఈ ఎన్నికలు, ప్రచారాలు లాంటివి అన్నీ అయిపోయిన తర్వాత తన కజిన్ వరుణ్ రనౌత్ పెళ్లిలో సందడి చేసింది కంగనా. అంతే కాకుండా వరుణ్ రనౌత్‌కు కంగనా ఇచ్చిన గిఫ్ట్ గురించి ప్రస్తుతం బాలీవుడ్ ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. ఈ గిఫ్ట్ గురించి వరుణ్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.


ఫ్యామిలీతో కంగనా..


ఛండీగడ్‌లోని ఒక ఇంటిని వరుణ్ రనౌత్‌కు గిఫ్ట్‌గా ఇచ్చింది కంగనా. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు వరుణ్. ‘‘మన అనుకునేవాళ్లతో కొత్త ఇల్లు, కొత్త ప్రారంభం. కంగనా రనౌత్.. మీరు రావడంతో ఇంటికి, ఫంక్షన్‌కే కళ వచ్చింది. ఇల్లు చాలా అందంగా ఉంది. మీ ప్రేమకు, ఆశీస్సులకు రుణపడి ఉంటాను. ప్రేమతో మీ వరుణ్, సీమా’’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు వరుణ్ రనౌత్. అంతే కాకుండా ఇంటికి సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా ఫాలోవర్స్‌తో పంచుకున్నాడు. వీటిలో కంగనా రనౌత్ కూడా తన కుటుంబ సభ్యులతో ఫోటోలకు పోజులిస్తూ కనిపించింది.


థ్యాంక్స్ అక్క..


వరుణ్ రనౌత్ షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను తన స్టోరీలో షేర్ చేసింది కంగనా. అంతే కాకుండా తన కుటుంబ సభ్యులు అప్‌లోడ్ చేసిన ప్రతీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని స్క్రీన్‌షాట్ తీసుకొని తన స్టోరీలో షేర్ చేసింది. ముందుగా వరుణ్.. ‘‘థ్యాంక్స్ అక్క. ఇప్పుడు ఛండీగడ్ నాకు ఇల్లుగా మారిపోయింది’’ అంటూ కంగనాకు థ్యాంక్స్ చెప్పాడు. ఆ తర్వాత తన చెల్లెలు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని కూడా స్క్రీన్‌షాట్ తీసింది. ‘‘థాంక్యూ అక్క. నువ్వు ప్రతీసారి మా కలలను నిజం చేస్తూనే ఉన్నావు. అన్నింటికి చాలా థ్యాంక్స్’’ అని చెప్పింది. వరుణ్ రనౌత్‌కు ఇచ్చిన ఈ గిఫ్ట్‌తో కంగనా ఫ్యామిలీ అంతా చాలా హ్యపీ అయ్యిందని ఈ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు చూస్తేనే అర్థమవుతోంది.






పంచుకోవాలి..


‘‘మన దగ్గర ఎంత తక్కువ ఉన్నా దానిని పంచుకోవాలని గురునానక్ చెప్పారు. మన దగ్గర సరిపడా లేదని మనం ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాం. అలాంటి సమయాల్లో కూడా మనం పంచుకోవాలి అని ఆయన అన్నారు. అలా చేయడంకంటే పెద్ద సంతోషం నాకేమీ ఉండదు. మీతో ఉన్నది నాతో పంచుకున్నందుకు థ్యాంక్స్’’ అంటూ తన ఫ్యామిలీకి రిప్లై ఇచ్చింది కంగనా రనౌత్. ఇంటిని గిఫ్ట్‌గా ఇచ్చినందుకు వరుణ్ భార్య అంజలి రనౌత్ కూడా కంగనాకు థ్యాంక్స్ చెప్పుకుంది. ఈ ఇల్లు.. తన భర్తపై కంగనాకు ఉన్న ప్రేమకు నిదర్శనం అని తెలిపింది.


Also Read: హైదరాబాద్ రేప్ కేసుపై బాలీవుడ్ సినిమా - కరీనా, ఆయుష్మాన్ జంటగా!