Ayesha Khan SLAMS Netizen For Sending Her Vulgar Messages: సోష‌ల్ మీడియాలో కొంత‌మంది క‌న్నుమిన్ను కాన‌కుండా ప్ర‌వ‌ర్తిస్తుంటారు.  అస‌భ్య‌క‌రంగా మెసేజ్ లు పంపి వేధిస్తుంటారు. అలా త‌న‌ని వేధిస్తున్న ఒక‌డికి ఇచ్చి ప‌డేసింది 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' న‌టి అయేషా ఖాన్. అస‌భ్య‌క‌ర మెసేజ్ లు పెడుతున్న వ్య‌క్తి  ఫొటోను పోస్ట్ చేసి మరి.. వాడికి వార్నింగ్ ఇచ్చింది. ఇలాంటి వాళ్ల‌ను వ‌దిలిపెట్టొద్దు అంటూ కోపంతో ఊగిపోయింది. అస‌లు ఏం జ‌రిగిందంటే? 


అస‌భ్య‌క‌ర మెసేజ్ లు.. 


'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' సినిమాలో ప్ర‌త్యేక పాట‌లో న‌టించిన బాలీవుడ్ బ్యూటీ అయేషా ఖాన్ కి ఒక వ్య‌క్తి ఇన్ స్టాగ్రామ్ లో అస‌భ్య‌క‌రంగా మెసేజ్ లు చేశాడు. దీంతో ఆగ్రహించిన అయేషా.. అత‌ని ఫొటోను, ప్రొఫైల్‌ను తన స్టోరీలో పెట్టి మరి క్లాస్ పీకింది. ఇలాంటి వాళ్ల‌ని ఏం చేయాలో మీరే చెప్పండి. ఇలాంటి వాళ్ల వ‌ల్ల స‌మాజానికి ఇబ్బంది అంటూ పోస్ట్ చేసింది. "హై టైమ్. ఇలాంటివారికి సిగ్గు వ‌చ్చేలా చేద్దాం. ఇలాంటి వాళ్లు మ‌న చుట్టూనే ఉంటారు. కానీ, వాళ్లు స్త్రీల గురించి ఏం ఆలోచిస్తారో? ఎలా ఆలోచిస్తారో తెలియ‌దు. నాకు నిజంగా ఆశ్చ‌ర్యంగా ఉంది.. ఇలాంటి వాళ్లతో కుటుంబంలోని స్త్రీలు సేఫ్ గా ఎలా ఉంటారో అని? అస‌లు ఏం అనుకుంటున్నాడో అర్థం కావ‌డం లేదు. అడిగితే... ఎవ‌రు మెసేజ్ చేశారో నాకు తెలియ‌డం లేదు అని అంటున్నాడు. నా అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఎవ‌రు పంపారో నాకు అర్థం కావ‌డం లేదు అంటూ బూట‌క‌పు మాట‌లు చెప్తున్నాడు. నాకు తెలుసు ఇలాంటి వాళ్ల‌కి అటెన్ష‌న్ ఇవ్వొద్దు వ‌దిలేయండి అని నాకు హిత బోధ చేస్తారు. కానీ, మ‌నం చెప్ప‌క‌పోతే ఇంకెవ‌రు చెప్తారు? ఇలాంటి వాళ్ల గురించి ప్ర‌పంచానికి" అని స్టోరీలో రాసుకొచ్చారు అయేషా. దీంతో ఆమెకు స‌పోర్ట్ గా నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి వాళ్ల‌ను వ‌ద‌లొద్దు అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.




పార్థ స‌మంత‌న్, ఎరికా ఫెర్నాండెస్ న‌టించిన టెలివిజ‌న్ సీరియ‌ల్ క‌సౌటీ జింద‌గీలో జూనియ‌ర్ ఆర్టిస్ట్ గా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు అయేషా. ఆ త‌ర్వాత బ‌ల్వీర్ రిట‌ర్న్ షోలో బిర్బా రోల్ ప్లే చేశారు. ఆ త‌ర్వాత హిందీ బిగ్ బాస్ 17లోకి ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకుంది అయేషా. ఆ షోలో మున్నావ‌ర్ ఫ‌రుఖీ మీద తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేసి ఫేమ‌స్ అయ్యారు ఆమె. విశ్వ‌క్ సేన్, అంజ‌లి, నేహా శెట్టి త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి’ సినిమాలో మోత మోగిపోద్ది అనే ఐట‌మ్ సాంగ్ లో చేసింది అయేషా ఖాన్. ఈ పాట‌లో విశ్వ‌క్ సేన్ ప‌క్క‌న డ్యాన్స్ ఇర‌గ‌దీసింది. కుర్ర‌కారు మన‌సు దోచుకుంది. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి’ సినిమా మే 31న రిలీజ్ కాగా.. ప్ర‌స్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.


Also Read: వితికా ప్రెగ్నెసీపై క్లారిటీ ఇచ్చిన వ‌రుణ్ సందేశ్.. ‘కొత్త బంగారు లోకం’ క‌థ విని ఏడ్చేశా