Kalki 2898 AD Movie Update: ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్ తెరకెక్కిన చిత్రం 'కల్కి 2898 AD' భారీ విజయం సాధించింది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. రూ.1000 కోట్లు గ్రాస్ సాధించిన ఫాస్టెట్ మూవీగా రికార్డు సాధించింది. మూవీ విడుదలై నాలుగు వారాలు అవుతున్న ఇప్పటికి కల్కిబాక్సాఫీసు వద్ద అదే జోరు చూపిస్తుంది. ఇక ఓవర్సిస్‌లోనూ ఈ మూవీ సత్తాచాటుతోంది. నార్త్ అమెరికాలో 17 మిలియన్ల డాలర్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ చేసింది. నార్త్ అమెరికాలో అత్యధిక వసూళ్లు చేసిన తొలి తెలుగు సినిమాగా కల్కి 2898 ఏడీ నిలిచింది.
ఇక ప్రభాస్ కెరీర్‌లో వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్స్ చేసిన రెండో సినిమా ఈ చిత్రం అరుదైన రికార్డు నెలకొల్పింది. మహాభారతానికి సైన్స్ ఫిక్షన్ జోడించి కల్కి 2898 ఏడీని విజువల్ వండర్‌గా చూపించాడు నాగ్ అశ్విన్.దీంతో అతడి విజనరికి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. కల్కి 2898 ఏడీ నాగ్ అశ్విన్ అద్భుతం చేశాడంటూ ప్రతి ఒక్కరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ఉన్న సంగతి తెలిసిందే. కల్కి 2898 ఏడీని ఓ సినిమాటిక్ యూనివర్స్‌గా ప్రకటించారు నాగ అశ్విన్. ఈ సినిమా కోసం ఆయన మూడు ప్రపంచాలను సృష్టించాడు. అయితే 'కల్కి 2898 ఏడీ'లో కథను పూర్తిగా చెప్పలేదు.. కాంప్లెక్స్ హిస్టరీ, కమల్ హాసన్ క్యారెక్టర్ సుప్రీమ్ యాస్కిన్ క్యారెక్టర్ మాత్రమే పరిచయం చేశాడు. కానీ, యాస్కిన్ ఎవరూ, పంచభూతాలన ఎందుకు ఆక్రమించాడు, దానికి కారణమేంటనేది రివీల్ చేయుండ సస్పెన్స్‌లో ఉంచాడు.
అంతేకాదు అసలు యాస్కిన్ పాత్ర వెనక కథ ఏంటనేది చూపించలేదు. దీంతో ఆడియన్స్‌లో యాస్కిన్ పాత్రపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో 'కల్కి 2898 ఏడీ' మూవీ ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జిహానీ చౌదరి మూవీపై ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చాడు. అంతేకాదు యాస్కిన్ పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫస్ట్ పార్ట్‌లో చూపించినట్టు కల్కి 2898 ఏడీలో కాంప్లేక్స్ ఒకటి కాదని, ఇందులో మొత్తం ఏడు ఉంటాయని పేర్కొన్నాడు. కమల్ హాసన్ యాస్కిన్ పాత్ర శ్రీకృష్ణుడి చీకటి కోణమని, ఆ ఏడు కాంప్లెక్స్‌లకు సుప్రీమ్ యాస్కిన్ అధిపతి అంటూ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చాడు. ఆ ఏడు కాంప్లెక్స్‌లు ప్రపంచంలో వివిధ ప్రదేశాల్లో ఉంటాయని, కంటికి కనిపించని దైవ శక్తి కలికి అక్కడ ఏం జరుగుతుందునేది సుప్రీమ్ యాస్కిన్ వివరిస్తాడని చెప్పి నితిని జిహాని కల్కి 2898 ఏడీపై ఉత్కంఠ పెంచాడు.
దీంతో సెకండ్ పార్ట్‌పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. కాగా కల్కి 2898 ఏడీ సీక్వెల్‌పై 2025 ఆగస్ట్ విడుదల కానుందని టాక్. కాగా వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మాత అశ్విన్ దత్ కల్కి 2898 ఏడీని అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ దీపికా పదుకొనె, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్, నటి శోభనలు కీలక పాత్రలు పోషించారు. ఇక దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్‌లు అతిథి పాత్రల్లో నటించారు.
Also Read: గెట్ రెడీ.. బిగ్‌బాస్ 8 లోగో వచ్చేసింది - ఈసారి అన్‌లిమిటెడ్ ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్‌కి సిద్ధమా!