Sonyliv originals web series Brinda Trailer Review: సౌత్ క్వీన్ త్రిష కృష్ణన్ (Trisha Krishnan) ప్రధాన పాత్రలో రూపొందిన వెబ్ సిరీస్ 'బృంద'. ఇందులో ఆవిడ ఎస్సై బృందగా టైటిల్ పాత్రలో నటించారు. సోనీ లివ్ (Brinda Web Series OTT Platform) ఓటీటీ కోసం రూపొందిన ఎక్స్‌క్లూజివ్ ఒరిజినల్ సిరీస్ ఇది. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు. అది ఎలా ఉందో చూడండి.


సస్పెండ్ అయిన లేడీ ఎస్సైగా త్రిష!
Brinda Web Series Trailer Review In Telugu: 'బృంద' ట్రైలర్ ప్రారంభంలో ఓ వైపు కంటిలో వస్తున్న తడిని దిగమింగుతూ, మరో వైపు మనసులో కోపాన్ని అణుచుకుంటూ వడివడిగా బయటకు అడుగులు వేస్తున్న త్రిషను చూపించారు. 


'మేడమ్... ఆగండి మేడమ్! ఆగండి మేడమ్!' అంటూ త్రిష వెనుక నటుడు రవీంద్ర విజయ్ పరుగులు తీస్తూ వచ్చాడు. 'అసలు ఏమైంది మేడమ్?' అని ప్రశ్నిస్తారు. 'ఆ... పీకేశారు. సస్పెండ్ చేశారు' అని త్రిష సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్లాక... వెనక్కి తిరిగి 'తొమ్మిదేళ్ల నుంచి మీరు ఏమైయ్యారు ఈ కేసును సాల్వ్ చేయకుండా? ఇప్పుడు నేను లేకుండా సాల్వ్ చేస్తారా? చేయండి చూద్దాం' అని త్రిష చెబుతారు. ఓ కేసు విషయంలో ఆమెను సస్పెండ్ చేశారని ఆ మాటలతో అర్థం అవుతుంది. 


అసలు 'బృంద' కేసు ఏంటి? ఏమైంది?
ఓ స్టేషనుకు బృంద ఎస్సైగా వెళతారు. అయితే, అక్కడ ఆమెకు సరైన గుర్తింపు గానీ, గౌరవం గానీ లభించవు. పైగా ఇతర మేల్ ఆఫీసర్స్, పోలీసుల నుంచి సూటి పోటి మాటలు ఒకటి. 'లేడీ ఎస్సై అవసరం కాబట్టి నువ్వు ఈ స్టేషనులో ఉన్నావ్. అంతగా ఖాళీగా ఉన్నావ్ అనుకుంటే స్టేషన్ అంతా క్లీన్ చేసి బయట ముగ్గులు పెట్టు' అని ఓ అధికారి చులకన చేసి మాట్లాడతాడు. అయినా సరే బృంద తన ధైర్యం కోల్పోలేదు. 


స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో 50 మంది ఆడవాళ్లు, చిన్న పిల్లల మరణానికి కారణమైన దోషులను పట్టుకోవాలని ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతుంది. ఆ కేసులో ఆమెకు ఎన్ని అడ్డంకులు ఎదురు అయ్యాయి? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి. 


ఇది నువ్వు కోరుకున్న బలి కాదు... మూఢ నమ్మకాలు!
మూఢ నమ్మకాలు నేపథ్యంలో కొందరిని బలి ఇవ్వడం, ఆ కేసును పోలీసులు ఎలా ఛేదించారు? అనే కాన్సెప్ట్ నేపథ్యంలో 'బృంద' వెబ్ సిరీస్ తెరకెక్కిందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.






నిండు రాత్రి వేళ ఈ చిన్నారి అమ్మాయిని చెట్టుకు కట్టేసి పసుపు నీళ్లు పోయడం, అక్కడ 'ఇది నువ్వు కోరుకున్న బలి కాదు... వాళ్లు ఇవ్వగలిగిన బలి' అని వాయిస్ ఓవర్ రావడం... తాంత్రిక పూజలలో కనిపించే ముగ్గుల మధ్యలో ఓ వ్యక్తిని కాళ్లు చేతులు కట్టేసి పడేయడం, మరొక మహిళను గొంతు కోసి చంపడం వంటివి చూస్తుంటే... మూఢ నమ్మకాలను చూపించినట్టు అర్థం అవుతోంది. త్రిష పాత్రకు, ఆ సన్నివేశాలకు సంబంధం ఏమిటి? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. రాకేందు మౌళి, ఇంద్రజిత్ సుకుమారన్ పాత్రలు కాలేజీ నేపథ్యంలో వచ్చాయి.


Also Read: మిస్టర్ బచ్చన్' రిలీజ్ డేట్ ఫిక్స్ - బాక్సాఫీస్ బరిలో విక్రమ్ vs రవితేజ vs రామ్



ఆగస్టు 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ షురూ!
Brinda Web Series Release Date: త్రిషకు 'బృంద' వెబ్ సిరీస్ ఓటీటీ డెబ్యూ. దీనికి సూర్య మనోజ్‌ వంగాలా రచయిత, దర్శకుడు. పద్మావతి మల్లాదితో కలిసి ఆయన స్క్రీన్‌ ప్లే రాశారు. ఆగస్టు 2వ తేదీ నుంచి సోనీ లివ్ ఓటీటీలో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, బెంగాలీ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.   


Brinda Web Series Cast: త్రిష, ఇంద్రజిత్‌ సుకుమారన్‌, జయప్రకాష్‌, ఆమని, రవీంద్ర విజయ్‌, ఆనంద్‌ సామి, రాకేందు మౌళి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మిస్టరీ డ్రామా క్రైమ్ థ్రిల్లర్ 'బృంద'కు సంగీత దర్శకుడు: శక్తికాంత్‌ కార్తీక్, ప్రొడక్షన్‌ డిజైన్‌: అవినాష్‌ కొల్ల, సినిమాటోగ్రఫీ: దినేష్‌ కె బాబు, ఎడిటింగ్‌: అన్వర్‌ అలీ.


Also Readకన్నడ నిర్మాతను మోసం చేసిన విశాఖ వాసి - 'మార్టిన్' టీమ్ కంప్లైంట్‌తో కటకటాల వెనక్కి!