Kannada Movie Martin Graphic Designer Arrested: యాక్షన్ కింగ్ అర్జున్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మాతృభాష కన్నడతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ అభిమానులను సొంతం చేసుకున్నారు.
అర్జున్ మేనల్లుడు ధృవ్ సర్జా (Dhruva Sarja) కన్నడలో యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా సినిమాల్లో 'మార్టిన్' ఒకటి. ఆ చిత్ర నిర్మాత ఉదయ్ తమను విశాఖకు చెందిన వ్యక్తి మోసం చేశాడని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దాంతో సత్యా రెడ్డిని అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
మూడు కోట్లు తీసుకుని పరార్... చివరకు అరెస్ట్!
'మార్టిన్' సినిమా (Martin Movie)లో స్పెషల్ గ్రాఫిక్స్, సీజీ, విజువల్ ఎఫెక్ట్ వర్క్స్ చేయడం కోసం విశాఖ వాసి సత్యా రెడ్డికి చెందిన గ్రాఫిక్ ఏజెన్సీని గత ఏడాది జూన్, జూలై నెలల్లో తాము అప్రోచ్ అయ్యామని 'మార్టిన్' నిర్మాత ఉదయ్ తెలిపారు. అడ్వాన్సుగా మూడు కోట్ల రూపాయలు సైతం చెల్లించామని వివరించారు. అయితే... తమ సినిమా పనులను సత్యా రెడ్డి ఆలస్యం చేస్తూ వచ్చాయని, డిసెంబర్ 2023 నుంచి తమకు అందుబాటులో లేకుండా పోయారని తెలిపారు. సత్యా రెడ్డి పరారీలో ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని ఉదయ్ స్పష్టం చేశారు.
Also Read: 'కల్కి 2898 ఏడీ'లో అదొక్కటే కాదు, మొత్తం ఏడు ఉన్నాయ్ - నాగ్ అశ్విన్ చాలా దాచేశాడుగా
కర్ణాకట రాజధాని బెంగళూరులోని వెస్ట్ సైడ్ గల బసవేశ్వర్ నగర్ పోలీస్ స్టేషనులో సత్యా రెడ్డి మీద 'మార్టిన్' నిర్మాత కంప్లైంట్ చేశారు. చీటింగ్ కేసు పెట్టారు. సత్యా రెడ్డి బెంగళూరు నుంచి విశాఖ వెళ్లాడని తెలుసుకున్న పోలీసులు, అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారట.
సత్యా రెడ్డి చేసిన మోసం వల్ల తాము ఎంతో నష్టపోయామని 'మార్టిన్' దర్శక నిర్మాతలు పేర్కొంటున్నారు. ఇప్పుడు సినిమా సీజీ, విజువల్ ఎఫెక్ట్స్ పనులను సుమారు 15 కంపెనీలకు ఇచ్చినట్టు తెలిపారు.
Also Read: అల్లు అర్జున్ ఎక్కడ - ఫ్యామిలీతో కలిసి ఏ దేశానికి వెళ్లారో తెలుసా?
Martin Movie Cast And Crew: ధృవ్ సర్జా కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'మార్టిన్' సినిమాను ఏపీ అర్జున్ దర్శకత్వంలో ఉదయ్ కె మెహతా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో బ్రిగేడియర్ అర్జున్ సక్సేనా పాత్రలో హీరో కనిపించనున్నారు. ఆయన సరసన వైభవీ శాండిల్య కథానాయికగా నటిస్తున్నారు. అన్వేషి జైన్ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ స్వరాలు అందిస్తుండగా... 'కెజిఎఫ్' ఫేమ్ రవి బస్రూర్ నేపథ్య సంగీతం చేస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 31న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేశారు. కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లోనూ విడుదల చేయాలని అనుకున్నారు. మరి, ఆ సమయానికి విజువల్ ఎఫెక్ట్స్ కంప్లీట్ అవుతాయో? లేదో? చూడాలి.
Also Read: బహిష్కరణ రివ్యూ: Zee5 OTTలో లేటెస్ట్ బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ - అంజలి వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?