యంగ్, టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) కథానాయకుడిగా ఎస్ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతున్న సినిమా 'మెకానిక్ రాకీ' (Mechanic Rocky Movie). దీనికి రవితేజ దర్శకుడు. రవితేజ అంటే మాస్ మహారాజా కాదు అండీ... కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడి. రామ్ తాళ్లూరి నిర్మాత. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్, హ్యుజ్ కాన్వాస్‌పై తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్. ఆ సంగతి ప్రేక్షకులకు తెలుసు. ఆమె కాకుండా మరో అందాల భామ సైతం నటిస్తున్న చిత్ర బృందం తెలిపింది.
విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ'లో శ్రద్ధా శ్రీనాథ్!
Vishwak Sen's Mechanic Rocky team welcomes Shraddha Srinath to the movie cast: విశ్వక్ సేన్ టైటిల్ రోల్ చేస్తున్న 'మెకానిక్ రాకీ' సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ కూడా లీడింగ్ లేడీ అని ఎస్ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పేర్కొంది. ఈ రోజు ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేసింది. లాంగ్ స్కర్ట్, బేబీ హెయిర్ కట్, ఫ్లాట్స్... స్టైలిష్ లుక్‌లో శ్రద్ధా శ్రీనాథ్ కనిపించారు.
నేచురల్ స్టార్ నాని 'జెర్సీ'తో శ్రద్ధా శ్రీనాథ్ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యింది. ఆ సినిమా ఫ్లాష్‌బ్యాక్‌లో ఆమె మోడ్రన్ లుక్‌లో కనిపించినప్పటికీ... భార్యగా నటించిన సన్నివేశాలు హైలైట్ అయ్యాయి. 'కృష్ణ అండ్ హిజ్ లీల'లో మోడ్రన్ రోల్ చేశారు. మళ్లీ 'జోడీ', 'సైంధవ్'లో ట్రెడిషనల్ రోల్. ఇప్పుడీ సినిమాతో మళ్ళీ మోడ్రన్ బాట పట్టినట్టు ఉన్నారు.
Also Read: అల్లు అర్జున్ ఎక్కడ - ఫ్యామిలీతో కలిసి ఏ దేశానికి వెళ్లారో తెలుసా?
దీపావళి కానుకగా 'మెకానిక్ రాకీ' విడుదల!
Mechanic Rocky movie release date: దీపావళి కానుకగా 'మెకానిక్ రాకీ' చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు నిర్మాత కొన్ని రోజుల క్రితం అనౌన్స్ చేశారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన పోస్టర్ గమనిస్తే... ఒక చేతిలో రెంచ్, మరొక చేతిలో తుపాకీతో విశ్వక్ సేన్ కనిపించారు. మెకానిక్ క్యారెక్టర్ రిప్రజెంట్ చేసేలా రెంచ్ ఉంది. మరి, గన్ వెనుక కహాని ఏంటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
Also Read: ఇటలీలో బుట్ట బొమ్మ... పూజా హెగ్డే మల్టీకలర్ గౌను అంత చీపా?
Mechanic Rocky movie cast and crew: కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న 'మెకానికా రాకీ' సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీత దర్శకుడు. విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో నరేష్, 'వైవా' హర్ష, హర్ష వర్ధన్, 'రోడీస్' రఘు రామ్ ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్: కళ్యాణి - ప్రీతమ్ జుకల్కర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: సత్యం రాజేష్ - విద్యాసాగర్ జె, కూర్పు: అన్వర్ అలీ, ప్రొడక్షన్ డిజైనర్: క్రాంతి ప్రియా, ఛాయాగ్రహణం: మనోజ్ కటసాని, నిర్మాణ సంస్థ: SRT ఎంటర్‌టైన్‌మెంట్స్, నిర్మాత: రామ్ తాళ్లూరి, రచన - దర్శకత్వం: రవితేజ ముళ్లపూడి.