Bigg Boss 8 Telugu Season Logo: బుల్లితెరపై ఎంతో ఆదరణ పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్. అన్ని భాషల్లోనూ ఈ షో హిట్ అయ్యింది. ఈ షోను ఎన్ని వివాదాలు చూట్టుముట్టిన సీజన్ సీజన్‌కు ఎంతో క్రేజ్ పెంచుకుంటుంది. ఇక తెలుగులో ఇప్పటికే బిగ్‌బాస్ ఏడు సీజన్‌లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఎనిమిదో సీజన్‌కు సిద్ధమవుతుంది. సెప్టెంబర్ బిగ్‌బాస్ 8 సీజన్ గ్రాండ్‌గా లాంచ్ కానుందని కొద్ది రోజులు ప్రచారం అవుతుంది. అంతేకాదు ఈ సీజన్‌లో హౌజ్‌లో సందడి చేసే కంటెస్టెంట్స్ వీరే అంటూ ఓ జాబితా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఏడో సీజన్ ఫినాలే రోజు జరిగిన వివాదం వల్ల ఈసారి బిగ్‌బాస్ ఉంటుందో లేదో ప్రేక్షకులంతా ఆందోళన చెందారు. కానీ ఎనిమిదో సీజన్ ఉంటుందని బిగ్‌బాస్ టీం నుంచి ఇప్పటికే స్పష్టత వచ్చింది. ఇక ఇప్పుడు ఈ షో హోస్ట్, టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా బిగ్‌బాస్ 8 సిజన్‌కు అంతా సిద్ధమవుతుందని వెల్లడించారు. ఈ మేరకు బిగ్‌బాస్ 8వ సీజన్ సంబంధించిన లోగోను రివీల్ చేశారు. ఈ సందర్భంగా లోగోకు సంబంధించిన స్పెషల్ వీడియోను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. "మరోసారి మీకు వినోదాన్ని పంచేందుకు మళ్లీ తిరిగి వస్తున్నాము. ఇదిగో బిగ్‌బాస్ 8వ సీజన్ లోగో వచ్చేసింది.
ఈసారి అన్‌లిమిటెట్ ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం సిద్ధంగా ఉన్నారా!" అంటూ బిగ్‌బాస్ 8 సీజన్ లోగోను ప్రవేశపెట్టాడు 'కింగ్' నాగార్జున. ఈసారి లోగో కూడా కలర్‌ఫుల్‌గా ఆకట్టుకుంటోంది. ఇక కంటెస్టెంట్ల ఎంపిక పూర్తయితే ఈ సీజన్ సెప్టెంబర్ మొదటి లేదా రెండో వారంలో ప్రారంభం కానుందని సమాచారం. దీంతో బుల్లితెర ఆడియన్స్ అంతా పండగా చేసుకుంటున్నారు. ఏడో సీజన్‌లాగే ఈసారి బిగ్‌బాస్ 8ను ప్లాన్ చేశారా? అని అంతా ఆడియన్స్ అంతా అంచనాలు వేసుకుంటున్నారు. కాగా బిగ్‌బాస్ మొదటి రెండు సీజన్లు బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాయి.
కానీ ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఈ షోకు ప్రేక్షకాదరణ తగ్గుతూ వచ్చింది. షో వినోదం తక్కువ కావడంతో సీజన్ సీజన్‌కు సక్సెస్ రేట్ తగ్గింది. ఆరవ సీజన్ అట్టర్ ఫ్లాప్ కావడంతో ఏడో సీజన్‌ను కాస్తా డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు. ఉల్లాపుల్లా అంటూ ప్రమోషన్స్‌తోనే హైప్ పెంచారు. ఇక హౌజ్‌లో కంటెస్టెంట్స్ చేత కొత్తరకంగా ఆడిస్తూ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించారు. కామన్ మ్యాన్‌కి సెలబ్రిటీలకు మధ్య చిచ్చు పెడుతూ ఇంట్రెస్ట్ పెంచారు. దీంతో ఏడో సీజన్ మంచి విజయం సాధించింది. ఇక మరి ఎనిమిదో సీజన్ హిట్‌కు కింగ్ నాగార్జున ఎాంటి సక్సెస్ మంత్రతో వస్తున్నారో చూడాలి.
ఇక ఇప్పటి వినిపిస్తున్న కంటెస్టెంట్స్‌ని చూస్తుంటే ఎనిమిదో సీజన్ మంచి రసవత్తరంగా ఉండేలా కనిపిస్తుంది. బ్రహ్మముడి ఫేం కావ్య అకా దీపికా రంగరాజ్ బిగ్‌బాస్ హౌజ్‌లో వస్తున్నట్టు గట్టి ప్రచారం జరుగుతుంది. తన అల్లరి, కామెడీ పంచ్‌లతో ఫుల్ ఎంటర్‌టైన్ చేసే ఆమె ఇక హౌజ్‌లోకి వస్తే ఇక అల్లరే అల్లరి అంటున్నారు. అలాగే 'మొగలి రేకులు' ఫేం ఇంద్రనీల్, అమృత ప్రణయ్, సోషల్ మీడియా సెన్సేషన్ బర్రెలక్క, కుమారి ఆంటీ, నటి హేమ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరి బిగ్‌బాస్ 8వ సీజన్‌లో సందడి చేసే కంటెస్టెంట్స్ ఎవరో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
Also Read: ‘బిగ్ బాస్’ సీజన్ 8లో ఆ లేడీ కంటెస్టెంట్స్ - ఇక రచ్చ మామూలుగా ఉండదు!