నట సింహం నందమూరి బాలకృష్ణ 'అధినాయకుడు', కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు 'శివ శంకర్', యాంగ్రీ స్టార్ రాజశేఖర్ 'గోరింటాకు', శ్రీకాంత్ 'లేత మనసులు' సినిమాల్లో విశ్వ కార్తికేయ బాల నటుడిగా అలరించారు. 'జై సేన', 'కళాపోషకులు', 'అల్లంత దూరాన' సినిమాలతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'కలియుగం పట్టణంలో'. వచ్చే నెలలో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు తెలిపారు.


మార్చి 22న 'కలియుగ పట్టణంలో' విడుదల!
Kaliyugam Pattanam Lo movie release date: 'కలియుగం పట్టణంలో' చిత్రాన్ని నాని మూవీ వర్క్స్ అండ్ రామా క్రియేషన్స్ పతాకాలపై కందుల గ్రూప్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వర రెడ్డి, కాటం రమేష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో రమాకాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మార్చి 22న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాతలు చెప్పారు.


ఆయుషి పటేల్ కాకుండా మరో హీరోయిన్!
విశ్వ కార్తికేయ సరసన ఆయుషి పటేల్ కథానాయికగా నటించారు. ఆమె కాకుండా సినిమాలో మరొక హీరోయిన్ కీలక పాత్ర చేశారని దర్శక నిర్మాతలు చెప్పారు. చిత్రా శుక్లా కథను మలుపు తిప్పే పాత్రలో కనిపిస్తారని తెలిపారు. 'మా అబ్బాయి', 'రంగుల రాట్నం', 'సిల్లీ ఫెలోస్' 'తెల్లవారితే గురువారం' తదితర సినిమాల్లో ఆమె నటించారు.


Also Read: పదేళ్ల తర్వాత హిందీ సినిమాలో రాశీ ఖన్నా - యాక్షన్ థ్రిల్లర్ లో శారీలో...



చిత్రీకరణ అంతా కడప జిల్లాలోనే...
'కలియుగం పట్టణంలో' సినిమా గురించి దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ''తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు ఇలాంటి కాన్సెప్ట్‌ బేస్డ్ సినిమా రాలేదు. సరికొత్త కథాంశంతో మంచి సందేశాన్ని ఇస్తూ సకుటుంబ సమేత పరివారంతో చూసేలా చిత్రాన్ని రూపొందించాం. చిత్రీకరణ పూర్తి అయ్యింది. అంతా కడప జిల్లాలోనే చేశాం. 45 రోజుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా షూటింగ్ ఫినిష్ చేశాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. మార్చి 22న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.


Also Readయువ దర్శకుడికి అవకాశం ఇస్తున్న బాలకృష్ణ - నానికి హిట్ ఇచ్చినోడితో?  


ఆల్రెడీ విడుదలైన 'కలియుగం పట్టణంలో' సినిమా పోస్టర్లు చూస్తే... యాక్షన్ బ్యాక్ డ్రాప్ అనేది అర్థం అవుతోంది. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు భిన్నంగా ఆయుషి పటేల్ గన్ పట్టుకుని ఎవరికో గురి పెట్టినట్లు అర్థం అవుతోంది. మరి, సినిమా ఎలా ఉంటుందో? 'కలియుగ పట్టణంలో' ఏం జరిగిందో? వెయిట్ అండ్ సి.


విశ్వ కార్తికేయ, ఆయుషీ పటేల్ జంటగా నటించిన ఈ సినిమాలో దేవి ప్రసాద్, చిత్రా శుక్లా ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కూర్పు: గ్యారీ బీహెచ్, పాటలు: చంద్రబోస్ - భాస్కర భట్ల రవికుమార్, ఛాయాగ్రహణం: చరణ్ మాధవనేని, సంగీత దర్శకుడు : అజయ్ అరసాడ, నిర్మాణ సంస్థలు: నాని మూవీ వర్క్స్ - రామా క్రియేషన్స్, నిర్మాతలు: డాక్టర్ కె. చంద్ర ఓబుల్ రెడ్డి - జి మహేశ్వర రెడ్డి - కాటం రమేష్‌, దర్శకుడు : రమాకాంత్ రెడ్డి.