మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' థియేటర్లలోకి వచ్చి రెండేళ్లు దాటినా తమ ఫేవరెట్ స్టార్ కొత్త సినిమా తమ ముందుకు రాలేదని కాస్త అసంతృప్తితో ఉన్న వారికి ఎన్టీఆర్ డబుల్ ట్రీట్ ఇవ్వడం గ్యారంటీ. ఈ రోజు విడుదల చేసిన కొత్త పోస్టర్‌తో 'దేవర' చిత్ర బృందం ఓ క్లారిటీ ఇచ్చింది. అది ఏమిటంటే....


'దేవర'లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్!?
'దేవర' సినిమాలో ఎన్టీఆర్ రోల్ గురించి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో దర్శకుడు కొరటాల శివ చెప్పలేదు. నిర్మాతలు సైతం పెదవి విప్పలేదు. అయితే, ఈ రోజు విడుదల చేసిన పోస్టర్ చూస్తే... ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని ఈజీగా అర్థం అవుతుంది.


'ది ఫేసెస్ ఆఫ్ ఫియర్' (భయానికి ప్రతి రూపాలు) అని 'దేవర పార్ట్ 1' టీమ్ ఈ రోజు ఓ పోస్టర్ విడుదల చేసింది. సినిమా విడుదలకు సరిగ్గా నెల రోజులు ఉండటంతో కొత్త పోస్టర్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది. అందులో ఎన్టీఆర్ రెండు లుక్స్ ఉన్నాయి. చూపుల్లో ఫైర్ నుంచి చెవికి ఉన్న రింగ్, మీసకట్టు వరకు ఆ రెండు ఫోటోల్లో అంతా సేమ్ టు సేమ్. కానీ, ఒక్క జుట్టు విషయంలో తేడా కనబడుతోంది. 'దేవర' టీజర్ చూస్తే... రింగులు తిరిగిన, కాస్త పొడవాటి జుట్టుతో ఎన్టీఆర్ కనిపించారు. 'చుట్టమల్లే...' పాటలో సన్నగా, ట్రిమ్ చేసిన జుట్టుతో కనిపించారు. ఆ తేడా ఇప్పుడు ఒక్క పోస్టర్‌లో కనిపించింది.


Also Read: దీపికా పదుకోన్ కుమారుడిగా నాని... కల్కి ఆయనేనా? సరిపోదా న్యాచురల్ స్టార్ ఇచ్చిన ఈ వివరణ






తండ్రి బదులు కొడుకు ప్రతీకారం తీర్చుకుంటాడా?
'దేవర' కథ విషయంలోనూ పలు థియరీలు, ఊహాగానాలు వినబడుతున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ గ్యారెంటీ అని... అయితే పతాక సన్నివేశాల్లో, చివరకు ఒక్క ఎన్టీఆర్ ఉంటారా? ఇద్దరూ ఉంటారా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అట!


'దేవర' పతాక సన్నివేశాల్లో తండ్రి క్యారెక్టర్ మరణిస్తుందని, తండ్రిని చంపిన శత్రువులపై కుమారుడు ప్రతీకారం తీర్చుకోవడం సెకండ్ పార్ట్ అని ఓ టాక్. అది ఎంత వరకు నిజం? అనేది సినిమా విడుదల అయితే గానీ తెలియదు. అదీ సంగతి.


Also Readకమిటీ కుర్రోళ్ళు ఓటీటీ... ఆహా కాదండోయ్, మరో వేదికలో నిహారిక నిర్మించిన సినిమా



'దేవర'లో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా... సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా నటించారు. బాబీ డియోల్ మరో విలన్ రోల్ చేశారు. ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీత దర్శకుడు. ఆల్రెడీ 'ఫియర్ సాంగ్', 'చుట్టమల్లే...' సాంగ్స్ వచ్చాయి. ఆ రెండూ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. మరో రెండు పాటలు మరింత బావుంటాయని చిత్ర బృందం చెబుతోంది.