'కల్కి 2898 ఏడీ'లో (Kalki 2898 AD Movie) అతిథి పాత్రల్లో స్టార్స్ మెరిశారు. నానీని సైతం ఓ పాత్ర చేయమని దర్శకుడు నాగ్ అశ్విన్ అడిగినట్టు వార్తలు వచ్చాయి. ఆ వార్తల పట్ల ఆయన ఎప్పుడూ స్పందించలేదు. ఈ గురువారం (ఆగస్టు 29న) తన కొత్త సినిమా 'సరిపోదా శనివారం' విడుదల కానున్న సందర్భంగా ప్రింట్ అండ్ వెబ్ మీడియాతో న్యాచురల్ స్టార్ ముచ్చటించారు. అప్పుడు 'కల్కి 2898 ఏడీ' ప్రస్తావన వచ్చింది. అప్పుడు ఆయన ఏమన్నారంటే... 


'కల్కి 2898 ఏడీ'లో నాని... అది ఫేక్‌ న్యాసే!
సోషల్ మీడియాలో వచ్చే కొన్ని రూమర్లను తానూ చూస్తానని నాని చెప్పారు. 'కల్కి 2898 ఏడీ' రూమర్ సైతం చూశానని అన్నారు. దాని గురించి స్పందిస్తూ... ''ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో ఎక్కువ వస్తున్నాయి. ఇంతకు ముందు ఫ్యాన్స్ లేదా మీమ్ హ్యాండిల్స్ ఫేక్ న్యూస్ పబ్లిష్ చేస్తే... మీడియా హ్యాండిల్స్ రాంగ్ అని వేసేవి. ఇప్పుడు ఆ ఫేక్ న్యూస్ కాపీ పేస్ట్ చేసి అఫీషియల్ హ్యాండిల్స్ వేయడం మొదలు పెట్టాయి. 'కల్కి 2898 ఏడీ'లో నాకు ఓ రోల్ ఆఫర్ చేశారనేది కూడా అంతే! అది ఫేక్ న్యూస్'' అని నాని స్పష్టం చేశారు. 


దీపికా పదుకోన్ కుమారుడిగా నాని కనిపించే అవకాశాల్లేవ్!
ఇంతకీ, 'కల్కి 2898 ఏడీ'లో నానికి ఏ క్యారెక్టర్ ఆఫర్ చేశారని ప్రచారం జరిగింది? అంటే... 'కల్కి'. సినిమా చూసిన ప్రేక్షకులు అందరికీ దీపికా పదుకోన్ క్యారెక్టర్ గుర్తు ఉంటుంది! గర్భవతిగా కనిపించారు. ఆవిడకు పుట్టబోయే బిడ్డ కల్కి. రెండో పార్ట్ చివరిలో దీపికా పదుకోన్ ఓ బిడ్డకు జన్మ ఇచ్చినట్టు క్లైమాక్స్ రాశారట నాగ్ అశ్విన్. ఆ కల్కి పాత్రలో నటించాల్సిందిగా నానిని అడిగారని ప్రచారం జరిగింది. అందులో నిజం లేదని నాని చెప్పేశారు. 


ఒక్కసారి వివరణ ఇస్తూ పోతే... ప్రతి పుకారుకు స్పందించాలి!
సోషల్ మీడియాలో వచ్చే పుకార్లకు తాను ఎందుకు స్పందించడం లేదనేది కూడా నాని చెప్పారు. ''సోషల్ మీడియాను ఉపయోగించే ప్రజలు ఎక్కువైన తర్వాత ప్రతి రోజూ ఏదో ఒక పుకారు, ఎవరో ఒకరి మీద వస్తూ ఉంది. ఒక్కసారి రూమర్లకు స్పందించడం మొదలు పెడితే... ప్రతి పుకారుకు వివరణ ఇవ్వాలి. మనం ఏదైనా పనిలో ఉండి, వివరణ ఇవ్వడం ఆలస్యం అయితే ఆ రూమర్ నిజమని కన్ఫర్మ్ చేసేస్తారు. అందుకే, స్పందించడం లేదు'' అని నాని వివరించారు.


Also Readకమిటీ కుర్రోళ్ళు ఓటీటీ... ఆహా కాదండోయ్, మరో వేదికలో నిహారిక నిర్మించిన సినిమా



'కల్కి 2898 ఏడీ'లో పలువురు తారలు అతిథి పాత్రలు చేశారు. ఈ సినిమాకు ముందు దర్శకుడు నాగ్ అశ్విన్ తీసిన సినిమా 'మహానటి'. అందులో టైటిల్ రోల్ చేసిన కీర్తీ సురేష్, 'కల్కి 2898 ఏడీ'లో బుజ్జి కారుకు వాయిస్ ఇచ్చారు. ఇక, మెయిన్ లీడ్ చేసిన దుల్కర్ సల్మాన్ కెప్టెన్ రోల్ చేశారు. ఆయనది పరశురాముడి పాత్ర అని ప్రచారం జరుగుతోంది. వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మించిన 'సీతా రామం' సినిమాలో కథానాయికగా నటించిన, తెలుగు చిత్రసీమకు పరిచయం అయిన మృణాల్ ఠాకూర్ మరో అతిథి పాత్ర చేశారు. ఇక, 'ఎవడే సుబ్రమణ్యం'లో నటించిన విజయ్ దేవరకొండ... 'కల్కి 2898 ఏడీ'లో అర్జునుడి పాత్ర చేశారు. 'జాతి రత్నాలు' దర్శకుడు కేవీ అనుదీప్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా సైతం ఓ పాటలో మెరిశారు. 


నాగ్ అశ్విన్ దర్శకుడిగా లేదంటే ఆయన అండదండలతో వైజయంతీ మూవీస్ లేదా స్వప్న సినిమా సంస్థల్లో తెరకెక్కిన సినిమాల్లో హీరో హీరోయిన్లు అతిథులుగా 'కల్కి 2898 ఏడీ'లో సందడి చేశారు. నాని ఒక్కరే మిస్ అయ్యారు. అందుకని, 'కల్కి 2898 ఏడీ' పార్ట్ 2లో ఆయన కనిపిస్తారని ప్రచారం జరిగింది.


Also Readమాన్‌స్ట‌ర్‌ కాదు... రాజశేఖర్ - పవన్ సాధినేని సినిమాకు 1990 సూపర్ హిట్ టైటిల్