మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela)లో నటితో పాటు మంచి నిర్మాత కూడా ఉన్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సంస్థ స్థాపించి 'ముద్దపప్పు ఆవకాయ్', 'నాన్న కూచి', 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' వెబ్ సిరీస్‌లు ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు డిజిటల్ స్క్రీన్ నుంచి సిల్వర్ స్క్రీన్ మీదకు వచ్చారు. 'కమిటీ కుర్రోళ్ళు'తో నిర్మాతగా వెండితెరపై అడుగు పెట్టారు. ఆవిడ ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇది. బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు రాబట్టింది. మరి, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఏ ఓటీటీ సంస్థ దగ్గర ఉన్నాయో తెలుసా?


ఈటీవీ విన్ ఓటీటీకి కమిటీ కుర్రోళ్ళు
'కమిటీ కుర్రోళ్ళు' ఓటీటీ రైట్స్ ఆహా సంస్థ తీసుకుందని ఓ వార్త షికారు చేసింది. ఆ మాటకు కారణం నిహారిక సినిమా కావడమే. ఆహా ఓటీటీలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కావడం వల్ల ఆ టాక్ వినిపించింది. అయితే, అందులో నిజం లేదు. ఈ మూవీ ఓటీటీ రైట్స్ మరో సంస్థ దగ్గరకు వెళ్లాయి.


'కమిటీ కుర్రోళ్ళు' సినిమా ఓటీటీ హక్కులను ఈటీవీ విన్ తీసుకుంది. ''ఈ రోజు మా ఈటీవీ విన్ ఆఫీసుకు 11 మంది కుర్రాళ్ళు వచ్చారు'' అని ఆ సంస్థ సోషల్ మీడియాలో పేర్కొంది. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు మాత్రమే కాదు, శాటిలైట్ (టీవీ) హక్కులను సైతం ఈటీవీ సంస్థ తీసుకుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.


Also Readభయపడకు, నేనున్నాను... మహేష్ వాయిస్ ఓవర్‌తో 'ముఫాసా' తెలుగు ట్రైలర్ వచ్చేసిందోచ్!






మూడు వారాల్లో రూ. 15 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా
'కమిటీ కుర్రోళ్ళు'ను సుమారు తొమ్మిది కోట్ల నిర్మాణ వ్యయంతో తెరకెక్కించారు. ఆ సినిమా విడుదలైన మూడు వారాల్లో బాక్సాఫీస్ బరిలో పదిహేను కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసింది. నిర్మాతగా నిహారిక కొణిదెలకు, అలాగే సినిమా పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమా లాభాలు తీసుకు వచ్చింది.


Also Readమైండ్ బ్లాక్ అయ్యే రేంజ్‌లో మహేష్ - రాజమౌళి సినిమా... ఇది మామూలు ప్లాన్ కాదయ్యా!






'కమిటీ కుర్రోళ్ళు' సినిమాతో తాడేపల్లిగూడెం యువకుడు యదు వంశీ దర్శకుడిగా పరిచయం అయ్యారు. అలాగే, ఈ సినిమాతో పదకొండు మంది కుర్రోళ్ళను హీరోగా పరిచయం చేశారు. నలుగురు తెలుగు అమ్మాయిలను కథానాయికలుగా పరిచయం చేశారు. సినిమాలో ప్రతి ఒక్కరికీ పేరు వచ్చింది.


Also Readఓటీటీలోకి వచ్చేసిన 'ముంజ్యా'... వంద కోట్ల హారర్‌ కామెడీ కావాలా, అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమా చూసేయండి