మలయాళీ సంగీత దర్శకుడు, గాయకుడు జెస్సీ గిఫ్ట్ (Jassie Gift) గుర్తు ఉన్నారా? ఆయన రూపం చాలా మంది తెలుగు ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. కానీ, ఆయన గొంతు బాగా తెలుసు. ఆ గొంతు వింటే ఠక్కున గుర్తు పడతారు! ఆయన సంగీతం అందించిన పాటలు కూడా తెలుగు ప్రేక్షకులకు తెలుసు. 


'యువసేన' చిత్రానికి సంగీతం అందించడమే కాదు... 'మల్లీశ్వరివే మధురాశల మంజరివే', 'వోణి వేసుకున్న', 'ఏ దిక్కున నువ్వున్నా 'పాటలను ఆయనే పాడారు. జెస్సీది టిపికల్ వాయిస్. అందువల్ల, ఈజీగా గుర్తు పట్టవచ్చు. 'యువసేన' సినిమా తర్వాత తెలుగులో ఇతర సంగీత దర్శకులకూ జెస్సీ గిఫ్ట్ కొన్ని పాటలు పాడారు. చాలా రోజుల విరామం తర్వాత ఆయన ఓ తెలుగు పాట పాడారు. 


తెలుగు 'బిగ్ బాస్' సీజన్ 5 విజేత, యువ కథానాయకుడు వీజే సన్నీ (VJ Sunny) నటించిన కొత్త సినిమా 'సౌండ్ పార్టీ' (Sound Party Movie Telugu). హ్రితిక శ్రీనివాస్ కథానాయికగా నటించారు. సంజ‌య్ శేరి ద‌ర్శ‌కత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జయ శంకర్ చిత్ర సమర్పకులు. ఇటీవల ప్రముఖ దర్శకుడు సంపత్ నంది చేతుల మీదుగా సినిమా టీజర్ విడుదలైంది. తాజాగా జెస్సీ గిఫ్ట్ ఆలపించిన 'మనీ మనీ...' లిరికల్ వీడియో విడుదల చేశారు.


Also Read : 'జవాన్'లో షారుఖ్ డూప్‌గా నటించింది ఈయనే - సేమ్ టు సేమ్ షారుఖ్‌లా



'సౌండ్ పార్టీ' సినిమాకు మోహిత్ రెహమానిక్ సంగీతం అందిస్తున్నారు. 'మనీ మనీ' పాటకు పూర్ణచారి సాహిత్యం అందించారు. ఉజ్వల్, తనిష్క కోరస్ అందించారు. ఇటీవల విడుదలైన ఈ పాటకు మంచి స్పందన లభిస్తోందని చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. 


అద్దె ఇంటిలో నివసించే తండ్రీ కుమారులు... బంజారా హిల్స్ ఏరియాలో ఇల్లు కొని అద్దెకు ఇవ్వాలని కలలు కంటారు. అందుకోసం వాళ్ళు ఏం చేశారు? అనేది చిత్ర కథాంశం అని టీజర్ చూస్తే తెలుస్తోంది. 


Also Read షారుఖ్ ఒక్కడికీ 100 కోట్లు - నయనతార, విజయ్ సేతుపతికి ఎంత ఇచ్చారో తెలుసా?



'సౌండ్ పార్టీ'లో సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటించగా... శివన్నారాయణ, అలీ, సప్తగిరి, '30 ఇయర్స్' పృథ్వీ, 'మిర్చి' ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, 'జెమిని' సురేష్, భువన్ సాలూరు, అంజలి, ఇంటూరి వాసు, 'చలాకి' చంటి, ప్రేమ్ సాగర్, ఆర్జే హేమంత్, శశాంక్ మౌళి, త్రినాధ్, కృష్ణ తేజ త‌దిత‌రులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి కూర్పు : జి. అవినాష్, ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్ నాయర్, పాటలు : పూర్ణ చారి, ఛాయాగ్రహణం : శ్రీనివాస్ రెడ్డి, సంగీతం : మోహిత్ రెహమానిక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : భువన్ సాలూరు, నిర్మాతలు : రవి పోలిశెట్టి - మహేంద్ర గజేంద్ర - శ్రీ శ్యామ్ గజేంద్ర, సమర్పణ : జ‌య‌శంక‌ర్‌, రచన - ద‌ర్శ‌కత్వం : సంజ‌య్ శేరి.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial