బాలీవుడ్ సినీ ప్రముఖులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల పండగ ఐఫా. ఈసారి ఐఫా అవార్డ్స్ - 2025లో 25 సంవత్సరాల వార్షికోత్సవ వేడుకను సెలబ్రేట్ చేయబోతున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో ఈ కార్యక్రమాన్ని మరింత స్పెషల్ గా, పలువురు సినీ ప్రముఖుల పర్ఫార్మెన్స్ తో కన్నుల పండగగా నిర్వహించబోతున్నారు. ఇక ఐఫా అవార్డుల వేడుక జరుగుతున్నప్పుడు బాలీవుడ్ తారలందరూ ఓకే ఈవెంట్లో కనిపించి, ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇస్తూ ఉంటారు. ఈ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ రజతోత్సవ వేడుకలు రెండు రోజులపాటు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమం ఎప్పుడు, ఎక్కడ జరగబోతుంది? టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి? అనే విషయాలపై ఆరాతీస్తున్నారు.
ఐఫా అవార్డ్స్-2025 వేడుక ఎక్కడ జరగబోతోంది?
ఐఫా అవార్డ్స్-2025 అవార్డుల ప్రదానోత్సవం రాజస్థాన్లోని జైపూర్ లో జరగబోతోంది. ఈసారి ఐఫా ఫస్ట్ టైం డిజిటల్ అవార్డులను కూడా ప్రదానం చేయడం మొదలు పెట్టబోతోంది. డిజిటల్ ఎంటర్టైన్మెంట్, సినిమాలు, ఓటీటీ కంటెంట్ లో అత్యుత్తమ పర్ఫామెన్స్ ఇచ్చిన బెస్ట్ ఆర్టిస్ట్ లను, సినిమాలను, సిరీస్ లను గుర్తించి అవార్డులను ప్రదానం చేయబోతున్నారు. అంతేకాకుండా ఈ అవార్డ్స్ వేదికపైనే పలువురు హీరోయిన్లు డాన్స్ లతో అదరగొట్టబోతున్నారు.
ఐఫా అవార్డ్స్ ప్రదానోత్సవం డేట్
ఐఫా అవార్డ్స్ 2025 వేడుకలు అట్టహాసంగా జైపూర్ లో మార్చ్ లో జరగబోతున్నాయి. మార్చ్ 8, 9 తేదీల్లో జైపూర్ లో ఉన్న ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. ఐఫా డిజిటల్ అవార్డుల వేడుక మార్చి 8న జరిగితే, ఐఫా గ్రాండ్ ఫినాలే మార్చ్ 9న జరగబోతోంది.
ఎవరు హోస్ట్ చేస్తారు?
ఐఫా అవార్డ్స్ 2025 అవార్డులను ప్రముఖ స్టార్స్ హోస్ట్ చేస్తారన్న సంగతి తెలిసిందే. ఐఫా గ్రాండ్ ఫినాలేకు ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్, హీరో కార్తీక్ ఆర్యన్ హోస్ట్ చేయబోతున్నారు. అలాగే అపర శక్తి ఖురానా ఐఫా ఫస్ట్ డిజిటల్ అవార్డ్స్ కి హోస్ట్ గా చేయబోతున్నారు. ఈ గ్రాండ్ ఫినాలే లో షారుక్ ఖాన్, మాధురి దీక్షిత్, షాహిద్ కపూర్, కరీనా కపూర్ వంటి అగ్రతారలు వేదికపై పర్ఫామెన్స్ ఇవ్వబోతున్నారు. ఐఫా డిజిటల్ అవార్డ్స్ - 2025లో నోరా ఫతేహి డాన్స్ తో అదరగొట్టబోతోంది.
Also Read: 'మాస్ జాతర' తర్వాత రవితేజ సినిమా ఫిక్స్... సమ్మర్‌లో సెట్స్ మీదకు, దర్శకుడు ఎవరంటే?
టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి?
ఐఫా అవార్డ్స్ 2025కి అధికారిక టికెట్ పార్ట్నర్ జొమాటో. ఆన్లైన్ లో ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. అయితే 2025 హైపర్ అవార్డ్స్ కోసం హాజరయ్యే వారి కోసం వివిధ రకాల టికెట్ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. బ్లాకులతో పాటు కాస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది.
అందులో ఫేజ్ 1 ఆరెంజ్ బ్లాక్ ఏ అండ్ బి అనే కేటగిరీలో టికెట్లు రూ.3000 గా నిర్ణయించారు. అలాగే ప్రీమియం ఎర్లీ బర్డ్ టికెట్స్ రూ. 1,50,000 ఉండబోతున్నాయి. ఈ భారీ ధరతో టికెట్లు కొన్న వారికి అల్పాహారంతో పాటు ప్రత్యేకమైన సెలబ్రిటీ వెల్కమ్ వీడియో సందేశం, రూ. 1500 విలువైన ఎఫ్ అండ్ బి ఓచర్, టోట్ వంటివి గిఫ్ట్ గా ఇవ్వబోతున్నారు. ఇక గోల్డ్ క్యాటగిరి టిక్కెట్లు ఓన్లీ ఇన్విటేషన్ కోసం మాత్రమే అందుబాటులో ఉన్నాయి.