Thaman Interesting Comments On Pawan Kalyan OG Movie: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న మూవీ 'ఓజీ' (OG). ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. సుజీత్ దర్శకత్వంలో పీరియడ్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. పవన్ పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ పాలనలో బిజీగా మారారు. అటు, హరిహర వీరమల్లు, ఇటు ఓజీ సినిమాలు రెండూ పవన్ షెడ్యూల్ ఖరారు కాగానే.. షూటింగ్స్ వేగంగా జరిగే అవకాశం ఉంది. అయితే, ఓజీ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. అప్పుడప్పుడు చిత్ర విశేషాలను పంచుకుంటూ వస్తున్నారు. తాజాగా, ఓజీపై తమన్ వ్యాఖ్యలు ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్కిచ్చాయి.
'ఓజీ మూవీ ఓ న్యూక్లియర్ బాంబ్'
పవన్ కల్యాణ్ 'ఓజీ' సినిమా ఓ బాంబ్.. న్యూక్లియర్ బాంబ్ అని తమన్ (Thaman) ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 'ఓజీ రిలీజయ్యే సమయానికి నేను ఇంకా కొంచెం గడ్డాలు, మీసాలు పెంచుకుంటాను. ఎందుకంటే తిప్పడానికి.. సినిమా ఎప్పుడు వచ్చినా సరే. సినిమా లేట్ అయ్యే కొద్ది ఇంకా ఇంకా పాటలను అప్ గ్రేడ్ చేసుకుంటూ వస్తున్నాం. బెటర్మెంట్ కోసం చేసిన పాటల మీదే వర్క్ చేస్తున్నాం. డైరెక్టర్ సుజిత్ కూడా సేమ్ ఏజ్ కావడంతో ఇద్దరికీ వేవ్ లెంగ్త్ కుదిరింది. పవన్ సార్ స్టార్ డమ్‌కు తగ్గట్లుగా మ్యూజిక్ అందించాలని.. సినిమాను వేరే లెవల్‌లో దింపాలని చూస్తున్నాం. ఓజీ ఓ మ్యాజిక్. పవన్ కల్యాణ్‌ను ఎలా చూడాలనుకుంటున్నారో ఈ సినిమాలో అలా చూస్తారు.' అని తమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'నమ్మిన వారే వెన్నుపోటు పొడిచారు'
అటు, ఇదే ఇంటర్వ్యూలో తమన్ కెరీర్ సహా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇన్నేళ్ల తన కెరీర్‌లో తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తమన్ తెలిపారు. జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో కొందరు వ్యక్తులను నమ్మి మోసపోతారని.. తనకు కూడా అలాంటి అనుభవాలే ఎదురయ్యాయని అన్నారు. 'నేను ఎంతోమందిని నమ్మాను. వారు నాకు వెన్నుపోటు పొడిచారు. నా ముందు మంచిగా మాట్లాడి బయటకు వెళ్లి నా గురించి చెడుగా చెప్పేవారు. ఎంతో డబ్బు పోగొట్టుకున్నా. జీవితంలో ఇలాంటి ఎన్నో ఒడుదొడుకుల నుంచి పాఠాలు నేర్చుకున్నాను.' అని చెప్పారు.
'ఒత్తిడికి గురైతే ఇలా చేస్తాను'
వర్క్ లైఫ్‌లో తాను ఒత్తిడికి గురైతే వెంటనే గ్రౌండ్‌లోకి అడుగు పెడతానని తమన్ చెప్పారు. తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టమని.. అదే తనకు ప్రశాంతత ఇస్తుందని అన్నారు. 'మాకంటూ ఓ స్పెషల్ టీమ్ ఉండాలని.. స్టార్ క్రికెటర్లు ఆడిన మైదానంలో ఆడాలని.. ఎన్నో ఆశలు ఉండేవి. సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో భాగం కావడంతో ఆ బాధ కూడా తీరిపోయింది. మా టీమ్‌తో కలిసి పేరొందిన మైదానాల్లో మ్యాచ్‌లు ఆడుతున్నందుకు సంతోషంగా ఉంది.' అని తెలిపారు.
Also Read: పూసలమ్మే స్థాయి నుంచి సెలిబ్రిటీగా - 'మోనాలిసా' రెమ్యునరేషన్ ఎంతో తెలుసా!