Surya Retro Telugu Teaser Out: తమిళ స్టార్ హీరో సూర్య (Surya), ప్రముఖ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కాంబోలో వస్తోన్న మూవీ 'రెట్రో' (Retro). పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం తెలుగు టీజర్‌ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. మలయాళ నటుడు జోజు జార్జ్, కరుణకరణ్, జయరామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నటుడు సూర్య సొంత నిర్మాణ సంస్థ '2డీ ఎంటర్‌టైన్మెంట్స్' బ్యానర్‌పై తన భార్య జ్యోతికతో కలిసి స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా.. తాజాగా సినిమా విడుదల తేదీని సైతం మూవీ టీం ప్రకటించింది. సమ్మర్ కానుకగా మే 1వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. కాగా, గత మూడేళ్లుగా సూర్య 'కంగువ' కోసం పనిచేశారు. ఈ సినిమా ఆశించినంత ఫలితం రాబట్టలేకపోయినందున 'రెట్రో'తో హిట్ కొట్టాలని భావిస్తున్నారు.

Also Read: నాగ చైతన్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ - అదరగొట్టిన 'తండేల్', ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

'రెట్రో' టీజర్ ఎలా ఉందంటే.?

ఇప్పటికే 'రెట్రో' తమిళ టీజర్ విడుదల కాగా తాజాగా తెలుగు వెర్షన్ రిలీజ్ అయ్యింది. గ్యాంగ్ స్టర్ బ్యాక్‌గ్రౌండ్‌గా ఈ సినిమా తెరకెక్కినట్లు సమాచారం. 'గ్యాంగ్ స్టర్‌గా మారిన హీరో తన ప్రేయసి కోసం ఎలా మారాడు.?' అనేదే ప్రధాన కథాంశంగా తెలుస్తోంది. యాక్షన్, డ్రామా, లవ్,  వయలెన్స్ ఇలా అన్నీ మేళవింపుల సమాహారంగా చిత్రం ఉండబోతోందని టీజర్ చెప్పకనే చెబుతోంది. గ్యాంగ్ స్టర్‌ అయిన హీరో హింస మార్గం నుంచి బయటపడి కొత్త జీవితం ప్రారంభిస్తానని.. చెప్పే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు 'దసరా' సినిమాకు సంగీతం అందించిన సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Also Read: స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఓకే - మరి వీటి సంగతేంటి.?, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'RC 16' మూవీ కథపై ఆసక్తికర ట్వీట్