అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవడం (Naga Chaitanya Samantha Divorce), శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala)ను పెళ్లి చేసుకోవడం జరిగిపోయాయి. కానీ ఇప్పటికి కూడా చై - సామ్ కు సంబంధించిన వార్తలు ఆగట్లేదు. అయితే అటు సమంత, ఇటు నాగచైతన్య ఎప్పుడూ డివోర్స్ గురించి పెద్దగా మాట్లాడలేదు. కానీ తాజాగా నాగచైతన్య సమంతతో డివోర్స్ తీసుకోవడం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
క్రిమినల్ లా ట్రీట్ చేశారు
తాజా ఇంటర్వ్యూలో నాగ చైతన్య తను సమంతతో విడిపోవడం గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తాను కూడా ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చానని, కాబట్టి తనకు ఆ పెయిన్ ఏంటో తెలుసు అంటూ ఆయన చేసిన ఎమోషనల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నాగచైతన్య మాట్లాడుతూ "నా లైఫ్ లో ఏం జరిగిందో అది చాలా మంది జీవితంలో జరుగుతుంది. అది కేవలం నా లైఫ్ లో మాత్రమే జరగలేదు. కానీ నేనేదో పెద్ద తప్పు చేసినట్టు, నన్ను మాత్రమే ఎందుకు క్రిమినల్ గా ట్రీట్ చేశారు? నేను ఎవరినైనా డిసప్పాయింట్ చేసి ఉంటే సారీ... ఒక రిలేషన్షిప్ ని బ్రేక్ చేయాలంటే నేను 1000 సార్లు ఆలోచిస్తాను. ఎందుకంటే నాకు దాని వల్ల జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసు. నేను కూడా ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచే వచ్చాను. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో తెలుసు. అలా జరిగినందుకు నిజంగా బాధగా ఉంది. కానీ అదొక మ్యూచువల్ డెసిషన్. మేమిద్దరం గ్రేస్ తో మా దారులలో నడుస్తున్నాము. కానీ అన్ఫార్చునేట్ గా అదొక హెడ్ లైన్ గా, గాసిప్ లా, ఎంటర్టైన్మెంట్ లా మారింది" అని అన్నారు.
నాగ చైతన్య ఇంకా మాట్లాడుతూ "దీని గురించి చాలా ఆలోచించాను. ఒకవేళ నేను దీని గురించి బయటకు వచ్చి మాట్లాడితే, ఆ ఇంటర్వ్యూ నుంచి కూడా ఇంకా కొన్ని ఆర్టికల్స్ పడతాయి. మరి దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడుంది? రాసేవాళ్ళే ఫుల్ స్టాప్ పెట్టాలి" అంటూ తన మనసులోని మాటని చెప్పారు. అయితే ఆయన ఎక్కడా సమంత పేరు ప్రస్తావించకపోవడం గమనార్హం.
నాగచైతన్య తల్లిదండ్రులైన నాగార్జున - లక్ష్మీ దగ్గుబాటి ఆయన చిన్నప్పుడే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత నాగార్జున అక్కినేని అమలను పెళ్లి చేసుకున్నారు. అయితే నాగచైతన్య మాత్రం తండ్రి దగ్గరే పెరిగారు. ఇక మరోవైపు నాలుగేళ్ల వివాహ బంధం తర్వాత నాగచైతన్య సమంత పరస్పర అంగీకారంతో 2021లో డివోర్స్ తీసుకొని విడిపోయారు. అప్పటి నుంచి వీరిద్దరి బంధం గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరోవైపు నాగచైతన్య గత ఏడాది శోభిత ధూళిపాళను పెళ్లి చేసుకున్నారు. ఇక తాజాగా నాగచైతన్య హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ 'తండేల్' థియేటర్లలోకి వచ్చింది. మొదటి రోజే ఈ మూవీ 16 కోట్లకు మించి గ్రాస్ కలెక్షన్లను రాబట్టినట్టు సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.