సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ట్రెండ్ మారింది. డైరెక్టర్స్ హీరోల కంటే ఎక్కువగా విలన్లను సెలెక్ట్ చేసుకోవడం గురించే ఆలోచిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి చిత్రపరిశ్రమంలో విలన్లకు మంచి పవర్ ఫుల్ రోల్స్ దక్కుతున్నాయి. ఇప్పుడు ఇండస్ట్రీలో పవర్ ఫుల్ విలన్ ఎవరు అంటే జగపతి బాబు, బాబీ డియోల్, సంజయ్ దత్ అని టక్కున చెప్పేస్తారు. మరి లేడీ విలన్ అంటే... సమాధానం లేదు. ఓ హీరోయిన్ మాత్రం విలన్ గా మరి, ఇండియన్ సినిమాలో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న విలన్లు అందర్నీ వెనక్కి నెట్టేసింది. 


హీరోయిన్ నుంచి విలన్‌గా మారిన నటి 
సాధారణంగా హీరోలు కొంతకాలం ఇండస్ట్రీలో హీరోలుగా నటించి, ఆ తర్వాత విలన్ గా టర్న్ తీసుకోవడం ఇప్పటిదాకా చూశాము మనము. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ మాత్రం స్టార్ హీరోయిన్ గా ఓవైపు నటిస్తూనే, ఫస్ట్ టైం విలన్ గా కనిపించబోతుందని ప్రచారం జరుగుతుంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు ప్రియాంక చోప్రా. ఫ్యాన్ ఇండియా స్టార్ట్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న 1000 కోట్ల పాన్ వరల్డ్ సినిమాలో ప్రియాంక చోప్రా కీలకపాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా విలన్ పాత్రను పోషించబోతోంది అంటూ గత కొంతకాలంగా ప్రచారం జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఈ మూవీకి ఆమె రూ. 30 కోట్లు రెమ్యూనరేషన్ కింద వసూలు చేసిందని బీటౌన్ కోడై కూస్తోంది. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలీదు గానీ, లెక్క ప్రకారం చూస్తే ప్రస్తుతం ఇండియన్ సినిమాలోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ విలన్లు అందర్నీ ఆమె దాటేసినట్టే. అంటే SSMB 29 సినిమా మాత్రమే కాదు, ఇప్పుడు ఈ లేడీ విలన్ కూడా ఖరీదైనదే.


Also Readఎస్వీఆర్ మనవడితో ఎంట్రీ... సీఎం కొడుకుతో సినిమా... ప్రియాంకా చోప్రా మరదలు టాలీవుడ్ హీరోయినే


ఇండియాలో హయ్యస్ట్ పెయిడ్ విలన్స్ 


కమల్ హాసన్: 'కల్కి' సినిమాతో లోకనాయకుడు కమల్ హాసన్ విలన్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం ఆయన రూ.25 కోట్లు పారితోషకంగా అందుకున్నారు. 


విజయ్ సేతుపతి: 'జవాన్' సినిమాలో విజయ్ సేతుపతి పవర్ ఫుల్ విలన్ గా కనిపించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం ఆయన రూ.21 కోట్లు పారితోషికం తీసుకున్నారు. 


సైఫ్ అలీ ఖాన్: 'ఆదిపురుష్' మూవీలో సైఫ్ నెగటివ్ లో నటించారు. ఈ డిజాస్టర్ మూవీ కోసం ఆయన రూ.10 కోట్లు పారితోషికంగా తీసుకున్నారు. 


సంజయ్ దత్: 'కేజీఎఫ్ 2', 'లియో' వంటి సినిమాలలో విలన్ గా నటించిన బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్. ఆయన ఒక్కో సినిమాలో విలన్ గా నటించడానికి రూ.8 నుంచి 9 కోట్లు అందుకుంటున్నారు. 


బాబీ డియోల్: విలన్ గా బాగా క్రేజ్ ఉన్న నటుల్లో బాబీ డియోల్ కూడా ఒకరు. ఆయన ఒక్కో సినిమాకు రూ.5 నుంచి 6 కోట్లు పారితోషికం అందుకుంటున్నారు. 


ఇమ్రాన్ హష్మీ: 'టైగర్' ఫ్రాంచైజీతో ఇమ్రాన్ హష్మీ విలన్ గా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. నెగిటివ్ రోల్ కోసం ఆయన రూ.10 కోట్లు పారితోషం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.


Also Readఊరిలో భార్య... సిటీలో మరొక మహిళతో ఎఫైర్... అయినా చాలదన్నట్టు ఇతరులపై కన్నేసిన మగాడు... ఓటీటీలోకి వచ్చిన దేవర విలన్ సినిమా