100 Crores Budger For Nayanathara Sequel Movie Mookuthi Amman 2: లేడీ సూపర్ స్టార్ నయనతార లీడ్ రోల్‌లో తెరకెక్కిన డివోషనల్ ఫాంటసీ మూవీ 'మూకుత్తి అమ్మన్' (Mookuthi Amman). 2020లో వచ్చిన ఈ సినిమా తెలుగులో 'అమ్మోరు తల్లి'గా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. నటుడు ఆర్జే బాలాజీ, ఎస్‌జే శరవణన్ ఈ చిత్రానికి సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ముక్కుపుడక అమ్మవారిగా నయనతార మెప్పించారు. భక్తి పేరుతో దొంగబాబాలు చేసే మోసాలు, వారి పని పట్టే క్రమంలో హీరో ఎదుర్కొన్న పరిణామాలు, అతనికి అమ్మవారు ఎలా సాయం చేశారనేదే ప్రధానాంశంగా చిత్రాన్ని తెరకెక్కించారు.

Also Read: నాగ చైతన్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ - అదరగొట్టిన 'తండేల్', ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

రూ.100 కోట్ల భారీ బడ్జెట్

'మూకుత్తి అమ్మన్' ఫస్ట్ పార్ట్ సక్సెస్ అయిన క్రమంలో దీనికి కొనసాగింపుగా సీక్వెల్ 'మూకుత్తి అమ్మన్ 2' తెరకెక్కుతోంది. తెలుగులో 'అమ్మోరు తల్లి 2'గా వస్తోన్న ఈ సినిమాకు సి.సుందర్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. నయనతార మరోసారి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. సినిమాలో గ్రాఫిక్స్ భారీగా ఉండనున్నాయని సమాచారం. తొలి భాగానికి భిన్నంగా రెండో భాగం ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, రౌడీ పిక్చర్స్, అవనీ సినిమాక్స్, IVY ఎంటర్‌టైన్మెంట్, B4U మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

కాగా, దర్శకుడు సుందర్.సి ఇటీవల అరణ్మనై 4, మధగజరాజా చిత్రాలతో వరుస బ్లాక్ బస్టర్లను అందించారు. గతంలో రవిమోహన్‌తో ఒక భారీ-బడ్జెట్ చిత్రాన్ని నిర్మించాలని అనుకున్నా.. వివిధ కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. మూకుతి అమ్మన్ 2తో భారీ-బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లను హ్యాండిల్ చేయడంలో తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలనుకుంటున్నారు.

వివాదంలో 'అమ్మోరు తల్లి'

కాగా, నయనతార నటించిన 'అమ్మోరు తల్లి' 2020 నవంబర్ 14న డిస్నీ+హాట్ స్టార్‌లో దీపావళి సందర్భంగా విడుదలైంది. ముక్కుపుడక అమ్మోరుగా నయన్ నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రాన్ని ఆర్జే బాలాజీ ప్రధాన పాత్రలో నటిస్తూనే స్వీయ దర్శకత్వం వహించారు. ఊర్వశి, స్మృతి వెంకట్, మధు మైలాంకోడి, అభినయ, అజయ్ ఘోష్ నటించారు. అయితే, ఈ సినిమాతో ఓ వర్గం మనోభావాలు దెబ్బతిన్నాయంటూ.. దర్శక, నిర్మాతలపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ సినిమా ప్రదర్శనను నిలిపేయాలనే డిమాండ్లు కూడా వినిపించాయి.

Also Read: స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఓకే - మరి వీటి సంగతేంటి.?, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'RC 16' మూవీ కథపై ఆసక్తికర ట్వీట్