నటి పూజా హెగ్డే.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోకి తొలిసారి అడుగు పెట్టింది. టామ్ క్రూజ్ నటించిన ‘టాప్ గన్: మావెరిక్’ ప్రీమియర్‌కు సంబంధించిన రెడ్ కార్పెట్‌పై అడుగులు వేసింది. అయితే, రెడ్ కార్పె్ట్‌పై అడుగు పెట్టడానికి కొన్ని గంటల ముందు ఆమె ఎంతో ఆందోళనకు గురైందని, ఆఖరి నిమిషం వరకు ఆమె టెన్షన్‌తో గడిపారని పూజా సన్నిహితులు తెలిపారు. కేన్స్ ఫెస్టివల్ కోసం సిద్ధం చేసుకున్న దుస్తుల నుంచి మేకప్ కిట్ వరకు అన్నీ పోగొట్టుకుని.. ఏం చేయాలో తెలియని అయోమయంలో గడిపిందన్నారు. ఎట్టకేలకు ఆమె టీమ్.. అప్పటికప్పుడు ఆమెకు కావల్సిన వస్తువులు, దుస్తులను సిద్ధం చేసి ఆమెను రెడ్ కార్పెట్‌పై అడుగు పెట్టేందుకు సహకరించారని తెలిసింది. ఆమెను ఎలాగైన సమయానికి సిద్ధం చేయాలనే తపనతో ఆమె టీమ్ నిద్రాహారాలు మానుకొని మరీ పనిచేశారని ఇటీవల పూజా ఓ మీడియా సంస్థతో చెప్పడానికి కారణం ఇదేనని అంటున్నారు.
‘రాధేశ్యామ్’ సినిమాతో మెస్మరైజ్ చేసిన పూజా కేన్స్‌లో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. దీంతో ఆమె ఉత్సాహంతో ఉరకలెత్తింది. కానీ, అక్కడికి చేరుకున్న తర్వాత ఆమె ఆనందం ఆవిరైంది. అక్కడికి చేరుకున్న తర్వాత ఆమె ఆమె హెయిర్‌స్టైలిస్ట్‌కు ఫుడ్ పాయిజనింగ్‌తో అస్వస్థతకు గురైంది. విమానాశ్రయం నుంచి ఆమె బ్యాగ్‌లలో ఒకటి మాత్రమే కేన్స్‌కు చేరింది. మిగిలినవి ఇండియాలోనే ఉండిపోయాయి. మిగిలిన ఆ ఒక్క బ్యాగ్ కూడా ప్రయాణం సమయంలో మిస్సయ్యింది.
Also Read: ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో పులి, పాముకు ఇలా ప్రాణం పోశారు, ఇదిగో VFX వీడియో!
లక్కీగా ఆమెతోపాటు తెచ్చుకున్న బ్యాగేజీలో ఇండియా నుంచి తెచ్చుకున్న రెండు ఖరీదైన ఆభరణాలు మాత్రమే ఆమెతో ఉన్నాయి. ఆ తర్వాత ఆమె కోసం టీమ్ ఎంతో కష్టపడి దుస్తులు రూపొందించి అప్పటికప్పుడు ఆమెను రెడ్ కార్పెట్‌పై నడిచేందుకు సిద్ధం చేశారు. ఎట్టకేలకు పూజా పక్షిఈకల తరహాలో తేలికైన పెద్ద గౌను, పోనీ టైల్, డైమండ్ ఇయర్ రింగ్స్‌కు తన క్యూట్‌నెస్‌ను జోడించి కేన్స్ అభిమానులను సైతం ఆకట్టుకోగలిగింది. అయితే, ఇంత టెన్షన్‌లో కూడా పూజా తన కూల్‌నెస్ కోల్పోకుండా ఎంతో ధైర్యంగా ముందుకెళ్లారని ఆమె టీమ్ సభ్యులు తెలిపారు.
Also Read: భర్తతో లిప్ లాక్ ఫొటోను షేర్ చేసిన నిహారిక కొణిదెల, అవసరమా అంటున్న ఫ్యాన్స్!
పూజాకు ఈ ఏడాది ‘బీస్ట్’, ‘రాధేశ్యామ్’, ‘ఆచార్య’ రూపంలో వరుసగా మూడు ఫ్లాప్స్ వచ్చాయి. ప్రస్తుతం ‘ఎఫ్3’లో స్పెషల్ సాంగ్‌లో మాత్రమే కనిపించనుంది. అయితే, బాలీవుడ్‌లో మరికొన్ని చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణవీర్ సింగ్‌తో కలిసి నటించిన ‘సర్కస్’ త్వరలోనే విడుదల కానుంది. సల్మాన్ ఖాన్‌తో నటిస్తున్న ‘కభీ ఈద్ కభీ దీపావళి’ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో సల్మాన్ యొక్క లక్కీ బ్రాస్‌లెట్‌ను తన చేతికి వేసుకుని సల్లూ భాయ్‌తో సినిమా షూటింగ్ ఆరంభమైనట్లు పూజా ప్రకటించింది.