Niharkika: భర్తతో లిప్ లాక్ ఫొటోను షేర్ చేసిన నిహారిక కొణిదెల, అవసరమా అంటున్న ఫ్యాన్స్!

మెగా డాటర్ నిహారిక తాజాగా పోస్ట్ చేసిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫొటో చూసిన కొందరు అభిమానులు ‘అవసరమా సిస్టర్’ అని ప్రశ్నిస్తున్నారు.

Continues below advertisement

నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల ఇటీవల వార్తల్లో ఉంటున్నారు. కొద్ది రోజుల కిందట రాడిసన్ బ్లూ పబ్‌లో జరిగిన దాడుల్లో పట్టుపడివారిలో నిహారికతోపాటు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉన్నట్లు పేర్లు బయటకు వచ్చాయి. అయితే, ఆ తర్వాత మళ్లీ ఈ ఘటనపై ఎలాంటి సమాచారం లేదు. ఈ ఘటనపై అప్పట్లో నాగబాబు కూడా స్పందించారు. తన కూతురు ఎలాంటి తప్పు చేయలేదని, అనవసరమైన ఊహాగానాలు స్ప్రెడ్ చేయొద్దని రిక్వెస్ట్ చేశారు. పబ్ టైమింగ్స్ పరిమితికి మించి ఉండటం వలనే పోలీసులు ఆ పబ్ మీద యాక్షన్ తీసుకున్నారని, ఈ విషయంలో నిహారిక తప్పు లేదని పోలీసులు చెప్పారని నాగబాబు సందేహాలను క్లియర్ చేశారు. ఈ ఘటన తర్వాత నిహారిక కూడా కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉంది. ప్రస్తుతం నిహారిక తన భర్తతో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

Continues below advertisement

తాజాగా ఆమె తన భర్త చైతన్యపై ప్రేమను వ్యక్తం చేస్తూ రెండు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశఆరు నిహారిక పోస్ట్ చేశారు. ఒక చిత్రంలో ఆమె తన భర్త చైతన్యకు లిప్ లాక్ చేస్తుంది. పైగా దాన్ని బ్లర్ కూడా చేశారు. అయితే,  మెగా ఫ్యాన్స్‌కు మాత్రం ఆమె అలా చేయడం అస్సలు ఇష్టం లేదు. అలాంటి ఫొటోలు పెట్టడం అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే, కొందరు మాత్రం నిహారికను సపోర్ట్ చేస్తున్నారు. అలా ధైర్యంగా ఉండమని అంటున్నారు. ప్రస్తుతం నిహారిక సినిమాల్లో నటించడం మానేశారు. ‘సైరా’ సినిమా తర్వాత ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అనే కామెడీ వెబ్ సీరిస్‌ను నిహారిక నిర్మించారు. ఇందులో సంగీత్ శోభన్, సినీయర్ నటి తులసి నటించారు. ఈ వెబ్ సీరిస్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. ఈ సీరిస్ సెకండ్ సీజన్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. (Image Credit: Niharika Konidela/Instagram).

Also Read: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని హల్దీ ఫంక్షన్ - సందడి చేసిన హీరోలు

Also Read: 'మేజర్' నుంచి రొమాంటిక్ లవ్ సాంగ్ - విన్నారా?

Continues below advertisement