యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. దీంతో ఫ్యాన్స్, ఫ్రెండ్స్, ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ కి విషెస్ చెబుతున్నారు. ఈ పుట్టినరోజు కానుకగా ఎన్టీఆర్ తన తదుపరి సినిమాలకు సంబంధించిన మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ లను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ అప్డేట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా.. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ చెబుతూ ఓ లెటర్ ని షేర్ చేశారు ఎన్టీఆర్. 'నా స్నేహితులకు, ఫ్యామిలీకి, శ్రేయోభిలాషులకు, ఇండస్ట్రీలో కలిసి పని చేసిన కొలీగ్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలానే నాకు విషెస్ చెప్పడానికి ఇంటివరకు వచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు. మీరు నాపై చూపిన ప్రేమ ఈ పుట్టినరోజు మరింత స్పెషల్ గా మార్చింది. నేను ఇంట్లో లేకపోవడంతో మిమ్మల్ని కలవలేకపోయాను.. దానికి క్షమించమని కోరుతున్నాను. మీ ప్రేమకు, అభిమానానికి ధన్యవాదాలు. నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను' అంటూ రాసుకొచ్చారు.
గురువారం అర్థరాత్రి ఎన్టీఆర్ అభిమానులంతా ఆయన ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఎన్టీఆర్ ఇంట్లో లేకపోవడంతో ఆయన రాక కోసం రోడ్డు మీదే ఎదురుచూశారు. కొంతమంది అభిమానులు కేక్ కట్ చేసి హడావిడి చేశారు. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఎన్టీఆర్ ఇంటివద్దకు చేరుకొని.. అభిమానులను తరలించారు. ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ కూడా చేసినట్లు తెలుస్తోంది.
Also Read: బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన కొమురం భీముడు- బృందావనంలో అందాల రాముడు
Also Read: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!