Hanu man in 3D: 'హనుమాన్'.. సంక్రాంతి రేస్‌లో నిలిచి రికార్డుల మోత మోగిస్తున్న సినిమా. తక్కువ బడ్జెట్‌లో అద్భుతమైన గ్రాఫిక్స్‌తో తెరకెక్కించారు ఈ సినిమాని. ఆ సినిమా చూస్తున్నప్పుడు.. ఇది 3డీలో వస్తే భలే ఉంటుందని అనుకొనే ఉంటారు కదూ. అందుకు ప్రశాంత్ వర్మ టీమ్ ‘హనుమాన్’ మూవీని 3D వెర్షన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నహాలు చేస్తున్నట్లు సమాచారం అందింది.
సమ్మర్‌లో రిలీజ్?
జనవరి 12న విడుదలైన ఈ మూవీ ఇంకా థియేటర్లలో రన్ అవుతోంది. ఈ సినిమాకి ఇంకా టికెట్లు తెగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 3D వెర్షన్‌ను ఇప్పట్లో రిలీజ్ చేయబోరని తెలిసింది. పైగా.. 3డీ వెర్షన్‌కు సాంకేతికంగా కూడా మార్పులు చేయాల్సి ఉంటుంది. అలాగే, అందుకు తగిన స్క్రీన్స్‌ను కూడా ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది. ఇవన్నీ జరిగేసరికి చాలా టైమ్ పట్టవచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని హంగులు పూర్తి చేసి.. సమ్మర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. దీనికోసం బ్యాగ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేసినట్లు సమాచారం. అయితే, దీనిపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన చెయ్యలేదు.
వేసవి సెలవలే బెస్ట్ ఆప్షన్?
'హనుమాన్' సినిమాని వయసుతో సంబంధం లేకుండా అందరూ ఆదరిస్తున్నారు. కానీ, పిల్లలు మాత్రం ‘హనుమాన్’ని ఒక సూపర్ హీరోగా భావిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే, ఈ సినిమా పిల్లలకి తెగ నచ్చేస్తోంది. దీంతో ఇప్పుడు సమ్మర్‌లో ట్రీడీ తీసుకొస్తే పిల్లలను బాగా ఆకట్టుకోవచ్చు. ఆ టైంలో సెలవులు ఉంటాయి కాబట్టి.. మళ్లీ భారీ కలెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఇప్పటికే మెస్మరైజ్ అయిపోతున్నారు. సినిమాలోని చాలా సీన్లు మనుషులను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా లాంగ్ షాట్‌లో వచ్చే భారీ ఆంజనేయస్వామి విగ్రహం అయితే వేరేలెవెల్ అనే చెప్పాలి. అది వచ్చినప్పుడల్లా.. రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి అని చాలామంది ప్రేక్షకులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయి చూస్తున్నారు. ఇక ఈ మధ్యే ఒక మహిళ పూనకం వచ్చినట్లు ఊగిపోయిన వీడియో కూడా వైరల్ అయ్యింది. అలాంటి ఇక 3D గ్లాసులు పెట్టుకుని, 3D వెర్షన్‌లో చూస్తే.. హనుమంతుడే పక్కన వచ్చి కూర్చున్నాడా? అనేలా ఉంటుందేమో భయ్యా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు అభిమానులు, హనుమాన్ ఫ్యాన్స్.
ఎలాంటి అంచనాలు లేవు. పెద్దగా ప్రచారం లేదు. రిలీజ్‌కి పెద్దగా థియేటర్లు ఇవ్వలేదు. కానీ, ఇప్పుడు ఆ సినిమానే ప్రభంజనంగా మారిపోయింది. రూ.265 కోట్ల కలెక్షన్‌ని బీట్ చేసింది 'హనుమాన్'. తేజ సజ్జ నటించిన ఈ సినిమాను ప్రశాంత్‌వర్మ డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకి పార్ట్ - 2గా 'జై హనుమాన్' రాబోతోంది. దాంట్లో హనుమంతుడే హీరో కాగా.. ఇప్పటికే ప్రీ పొడక్షన్ పనులు మొదలయ్యాయి. 2025లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు ప్రశాంత్‌వర్మ ప్రకటించారు. దీంతో ఇప్పుడు హనుమాన్ క్యారెక్టర్‌లో ఎవరు నటిస్తారా? అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో ఉంది. అయితే, హనుమాన్ క్యారెక్టర్‌లో మెగాస్టార్ చిరంజీవిని అనుకుంటున్నట్లు, రాముడిగా మహేశ్‌బాబు అయితే బాగుంటుందని అనుకున్నానని, వాళ్లను కలిసి కథ చెప్తానని ప్రశాంత్ తన మనసులో మాటను ఈ మధ్యే ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు.
Also Read: ఓటీటీలోకి 'నా సామిరంగ' - స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..