Naa samiranga OTT Release: ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగిన సినిమాల్లో ఒకటి 'నా సామిరంగ'. కింగ్‌ నాగార్జున నటించిన ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ సాధించింది. 'హనుమాన్‌', 'గుంటూరు కారం', 'సైంధవ' సినిమాలు రిలీజైనప్పటికీ బాక్సాఫీస్‌ దగ్గర బాగానే హిట్‌ టాక్‌ అందుకుంది ఈ సినిమా. తమిళ్‌ సినిమాని రీమేక్‌గా రూపొందించిన ఈ సినిమా.. తెలుగు ప్రేక్షకులను కొంతమేర ఆకట్టుకుందనే చెప్పాలి. 


ఆ ఓటీటీలో రిలీజ్‌..


నాగార్జున ఫ్యాన్స్‌ అంతా ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమాని ఒక నెల రోజుల్లోనే ఓటీటీలో రిలీజ్‌ చేయనున్నారు. జనవరి 14న ఈ సినిమా రిలీజ్‌ కాగా.. ఫిబ్రవరి 15న ఓటీటీలోకి వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ఈ సినిమా రిలీజ్‌ కానుంది. 


'నా సామిరంగ' మలయాళ సినిమా రీమేక్‌. దీన్ని విజయ్‌ బిన్నీ తెరకెక్కించారు. ఈ సినిమాలో నాగార్జున హీరో కాగా.. అల్లరి నరేశ్‌, రాజ్‌తరుణ్‌, ఆషికా రంగనాథ్‌ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించారు. ఇక గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న నాగార్జునకు సంక్రాంతి సెంటిమెంట్ కలిసి వచ్చింది. ‘నా సామిరంగ' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.


మామూలుగా ఏ సంక్రాంతికి అయినా నాగార్జున సినిమా విడుదల అయ్యిందంటే పక్కా సక్సెస్ అవుతుందనే టాక్ ఉంది. ఆ సెంటిమెంట్ ఈ సినిమాతో మరోసారి నిజమేనని నిరూపణ అయ్యింది. దీంతో సక్సెస్‌ మీట్ నిర్వహించింది చిత్రబృందం. ఆ సందర్బంగా మాట్లాడిన నాగార్జున మళ్లీ సంక్రాంతికి కలుద్దామని, నెక్స్ట్‌ సంక్రాంతికి మరో సినిమా రిలీజ్‌ చేస్తానని ప్రకటించారు.


ప్రస్తుతం నాగార్జున.. అప్‌కమింగ్ సినిమాలపై పెద్దగా క్లారిటీ లేదు. శేఖర్ కమ్ముల, ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీలో నాగార్జున ఒక కీలక పాత్ర చేస్తున్నట్టుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అది తప్పా.. ఫుల్ లెన్త్ హీరోగా ఆయన ఎవరితో సినిమా చేయాలనుకుంటున్నారు, అసలు దర్శకుడు ఎవరు లాంటి వివరాలు బయటికి రాలేదు. 


ఇక ఈ సినిమాలో నాగార్జున విలేజ్‌ లుక్‌లో కనిపించారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్‌ అంతా తండ్రి నాగేశ్వరరావును గుర్తు చేసుకున్నారు. 'దసరా బుల్లోడు' తదితర చిత్రాల్లో నాగేశ్వరరావు ఉన్నట్లు ఉన్నారని కాంప్లిమెంట్స్‌ ఇచ్చారు చాలామంది. ఇక ఈ సినిమా హీరోయిన్‌ అషికా కూడా పర్పార్మెన్స్‌తో ఇరగదీసిందని ఫ్యాన్స్‌ చెప్పుకున్నారు. అల్లరి నరేశ్‌, రాజ్‌తరుణ్‌లు కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేశారని అన్నారు. 


Also Read: ప్రియుడితో ఎంగేజ్మెంట్‌ చేసుకున్న 'తీన్మార్‌' బ్యూటీ