Kriti Kharbanda Engagement: కృతికర్బంద, పుల్కిత్‌ సామ్రాట్‌ ఒకటవ్వనున్నారు. వీరిద్దరూ ఎంగేజ్మెంట్‌ చేసుకున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ.. ఈ మధ్యే కుటుంబసభ్యుల సమక్షంలో ఒకటైనట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. 


కృతి బ్లూ అండ్‌ గోల్డెన్‌ అనార్కలీ మీద క్యూట్‌ పింక్‌ దుపట్టాలో మెర్సిపోతుంటే.. పుల్కిత్‌ తెల్లటి కుర్తాలో హ్యాండ్‌సమ్‌గా ఉన్నాడు. పుల్కిత్ సామ్రాట్-కృతి ఖర్బందాలు 2019 నుంచి డేటింగ్‌లో ఉన్నారు. పుల్కిత్‌కి ఇది రెండోపెళ్లి. 2015లో ఆయన శ్వేతా రోహిరాను పెళ్లి చేసుకున్నారు. అదే సంవత్సరం ఆమెతో విడిపోయారు. ఆ తర్వాత కృతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ ఇద్దరు కలిసి 'వీరేకి వెడ్డింగ్‌', 'తైష్‌' తదితర చిత్రాల్లో నటించారు.


ఇక కృతి తెలుగులో కూడా ఎన్నో సినిమాల్లో నటించారు. తెలుగులో ఆమె నటించిన సినిమా 'బోణి'. ఇక ఆ తర్వాత 'తీన్మార్‌' కృతికి తెలుగులో బ్రేక్‌ ఇచ్చిన సినిమా. 'మిస్టర్‌ నూకయ్య', 'ఒంగోలు గిత్త', 'బ్రూస్‌లీ' సినిమాల్లో నటించారు. తెలుగులో బ్రూస్‌లీ తర్వాత మరే సినిమాలో ఆమె కనిపించలేదు. ఆ తర్వాత బాలీవుడ్‌లో బిజీ అయ్యారు ఆమె. 'పాగల్‌పంతీ', 'తైశ్‌' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.


Also Read : హనుమాన్ పాత్రలో చిరంజీవి, రాముడిగా ఆ హీరో - ప్రశాంత్‌ వర్మది పెద్ద ప్లానింగే!