Ranbir Kapoor and Triptii Dimri: సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘యానిమల్’ మూవీ ఎన్నో విధాలుగా ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఫిల్మ్‌ఫేర్ అవార్డుల విషయంలో కూడా 19 కేటగిరిల్లో చోటు దక్కించుకుంది. రణవిజయ్ సింగ్ పాత్రలో రణబీర్ కపూర్ పెర్ఫార్మన్స్ ‌కు ఫిల్మ్‌ఫేర్.. తనకు బెస్ట్ అవార్డును కూడా అందజేసింది. ఇక ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ఈవెంట్ తాజాగా గుజరాజ్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌లో ఎన్నో స్పెషల్ సందర్భాలు ఉన్నాయి. కానీ చాలామంది ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది మాత్రం రణబీర్ కపూర్, తృప్తి దిమ్రీ పెర్ఫార్మన్స్ . ఈ పెర్ఫార్మన్స్ ‌కు ప్రేక్షకులు ఫిదా అవ్వడంతో పాటు దీనిని సోషల్ మీడియాలో తెగ షేర్ చేసేస్తున్నారు కూడా.


స్టేజ్‌పై రణబీర్ పెర్ఫార్మన్స్ ..


తాజాగా గుజరాత్‌లో 69 ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది. ‘యానిమల్’ సినిమాకు బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకున్న రణబీర్.. దాదాపు ఆ సినిమాలోని అన్ని పాటలపై డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ‘జమల్ కుడు’ పాటకు తన భార్య ఆలియా భట్‌తో కలిసి పర్ఫార్మ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక ఆ మూవీలోని ‘పెహ్లె బీ మే’ అనే పాటకు పర్ఫార్మ్ చేస్తుండగా తృప్తి దిమ్రీ ఎంట్రీ ఇచ్చింది. వీరిద్దరు స్టేజ్‌పై కలిసి కనిపించింది నిమిషమే అయినా.. ప్రేక్షకులు మాత్రం వీరి కెమిస్ట్రీకి ఫిదా అయిపోతున్నారు. ఈ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ‌కు సంబంధించిన ఫోటోలను, వీడియోను వైరల్ చేస్తూ.. కలిసి సినిమా చేయమని కోరుతున్నారు.






కెమిస్ట్రీ ఫైర్..


‘ఫిల్మ్‌ఫేర్ అవార్డుల స్టేజ్‌పై యానిమల్ నుండి పెహ్లే బీ మే సాంగ్ పెర్ఫార్మన్స్ ‌లో తృప్తి దిమ్రీ, రణబీర్ కపూర్ పెర్ఫార్మన్స్ ‌లో డిఫరెంట్ యాంగిల్ బయటపడింది’ అంటూ తృప్తి దిమ్రీ ఫ్యాన్ పేజ్.. పెర్ఫార్మన్స్ వీడియోను షేర్ చేసింది. ‘ఎవరైనా వీళ్లను పూర్తిస్థాయి సినిమాలో క్యాస్ట్ చేయండి. వీరి కెమిస్ట్రీ అదిరిపోయింది’ అంటూ మరొక యూజర్.. ఫోటోలను షేర్ చేసింది. ‘ఈ పెర్ఫార్మన్స్ నుండి బయటికి రాలేకపోతున్నాం’ అని మరొక యూజర్ అన్నారు. వీళ్ల కెమిస్ట్రీ ఫైర్ అంటూ మరొక యూజర్ కామెంట్ చేశారు. అయితే, కొందరు మాత్రం.. మరీ స్కూల్ పిల్లల డ్యాన్స్ పెర్ఫర్మన్స్‌లా ఉందని ట్రోల్ చేస్తున్నారు.






సెకండ్ హీరోయిన్‌గా పాపులారిటీ..


రణబీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’లో మెయిన్ హీరోయిన్ రష్మిక మందనానే అయినా.. చివర్లో తృప్తి దిమ్రీ స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చింది. అంతే కాకుండా ‘పెహ్లె బీ మే’ పాటలో రణబీర్, తృప్తి కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు కూడా. ముఖ్యంగా మెయిన్ హీరోయిన్‌గా నటించినప్పుడు కూడా తృప్తికి దక్కని పాపులారిటీ ‘యానిమల్’లో సెకండ్ హీరోయిన్‌గా నటించినందుకు దక్కింది. దీంతో తనకు అవకాశాలు ఇవ్వడానికి బాలీవుడ్ మేకర్స్ క్యూ కడుతున్నారు. ఇక తాజాగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుల సందర్బంలో తృప్తి దిమ్రీ ఫ్యాన్ పేజీలు సైతం రణబీర్‌తో తన పెర్ఫార్మన్స్ ఫోటోలను షేర్ చేస్తున్నారు.


Also Read: అప్పుడు ‘అరుంధతి’, ఇప్పుడు ‘హనుమాన్’ - 15 ఏళ్ల తర్వాత మళ్లీ అదే మ్యాజిక్ రిపీట్!