Amy Jackson: ఇంగ్లాండ్‌లో పుట్టి పెరిగిన మోడల్ ఎమీ జాక్సన్. మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన తర్వాత ‘మద్రాసిపట్టణం’ అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత తెలుగు, తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ సౌత్ ఇండస్ట్రీలోనే సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా కొనసాగింది. ఇంతలోనే జార్జ్ పానాయోటో అనే బిజినెస్‌మ్యాన్‌తో డేటింగ్ చేసింది. అది తన పర్సనల్ లైఫ్‌పై చాలా ఎఫెక్ట్ చూపించింది. తనతో మగబిడ్డకు కూడా జన్మినిచ్చింది. ఆ తర్వాత తనతో బ్రేకప్ అయ్యింది. ఫైనల్‌గా మరోసారి ఎమీ ప్రేమలో పడినట్టు తెలుస్తోంది. తాజాగా ఒక ఇంగ్లీష్ యాక్టర్.. ఎమీకి ప్రపోజ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.


ఇంగ్లీష్ నటుడితో ప్రేమ..


రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ఎవడు’ అనే సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది ఎమీ జాక్సన్. కానీ ఆ తర్వాత తనకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. కోలీవుడ్ మేకర్స్ మాత్రమే ఈ బ్రిటిష్ బ్యూటీకి వరుసగా అవకాశాలు ఇచ్చారు. 2019లో బిడ్డకు జన్మినిచ్చే ముందు రజినీకాంత్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘రోబో 2.0’లో హీరోయిన్‌గా మెరిసింది. అప్పటినుండి ఇప్పటివరకు సినిమాకు దూరంగా ఉంది. ఇక 2024లో రెండు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో వెండితెరపైకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇంతలోనే తన పర్సనల్ లైఫ్‌లో మూవ్ ఆన్ అయిపోయినట్టు.. ఎడ్ వెస్ట్‌విక్ అనే ఇంగ్లీష్ నటుడితో ప్రేమలో పడినట్టు అధికారికంగా ప్రకటించింది ఎమీ జాక్సన్.


మూడేళ్ల నుండి డేటింగ్..


‘హెల్ ఎస్’ అనే క్యాప్షన్‌తో తన ప్రపోజన్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఎమీ జాక్సన్. 2019లో బిడ్డకు జన్మనిచ్చే ముందే జార్జ్ పానాయోటోతో తనకు బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత రెండేళ్లు తన బిడ్డతోనే బిజీ అయిపోయిన ఎమీ.. 2021 నుండి వెస్ట్‌విక్‌తో డేటింగ్‌లో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. 2022లో ఈ హీరో బర్త్‌డే రోజు ఎమీ ఒక స్పెషల్ పోస్ట్ కూడా షేర్ చేయడంతో వీరి డేటింగ్ రూమర్స్‌పై ఒక క్లారిటీ వచ్చింది. ‘నిన్ను ఇచ్చినందుకు నేను దేవుడికి రోజు ధన్యవాదాలు చెప్పుకుంటాను. నువ్వు నా హోమ్, నువ్వు నా అడ్వెంచర్.. నీతో అన్నీ ఒకే జీవితకాలంలో దొరికినట్టు అనిపిస్తుంది. నీలో నాకు నచ్చిన విషయాలు ఏంటో నీకు తెలుసు. హ్యాపీ బర్త్ డే మూన్ మ్యాన్ ఐ లవ్ యూ’ అంటూ పోస్ట్ షేర్ చేసింది ఎమీ జాక్సన్.






‘గాసిప్ గర్ల్’తో పాపులారిటీ..


స్విట్జర్‌ల్యాండ్‌లో జీస్టాడ్‌కు స్కై వెకేషన్ కోసం వెళ్లారు ఎమీ జాక్సన్, ఎడ్ వెస్ట్‌విక్. అక్కడే ఎమీకి సినిమాటిక్ ప్రపోజల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించాలని అనుకున్నాడు వెస్ట్‌విక్. అందుకే అక్కడే ఒక బ్రిడ్జ్‌పై తనకు మోకాళ్ల మీద కూర్చొని ప్రపోజ్ చేశాడు. ఈ హీరో ఇంగ్లీష్‌లో 15కు పైగా సినిమాల్లో నటించినా కూడా ‘గాసిప్ గర్ల్’ అనే వెబ్ సిరీస్.. తనకు విపరీతమైన పాపులారిటీని తెచ్చిపెట్టింది. ఇప్పటికీ చాలామంది ప్రేక్షకులు.. తనను ‘గాసిప్ గర్ల్’లోని చక్ బాస్స్ పాత్రతోనే గుర్తుపెట్టుకుంటారు. ఇప్పటివరకు ఈ హీరోకు.. ఇతర హీరోయిన్లతో ఎఫైర్లులాంటివి ఏమీ లేకపోయినా.. లైంగిక వేధింపుల కేసులు మాత్రం ఉన్నాయి.


Also Read: ఒక్క పోస్ట్‌తో విడాకులపై క్లారిటీ ఇచ్చిన నటి - వెకేషన్‌ మోడ్‌లో జ్యోతిక.. పోస్ట్‌ వైరల్‌