Jyothika Post Viral With Husband Surya: సౌత్‌ క్యూట్‌ కపుల్స్‌లో సూర్య-జ్యోతికల జంట ఒకటి. ఎలాంటి వేడుకైనా, మూవీ ఫంక్షన్స్‌ అయినా ఇద్దరు సతీసమేతంగా హాజరై కనువిందు చేస్తారు. ఎప్పుడూ ఒకరిపై ఒకరు ప్రేమ, రెస్పాక్ట్‌తో మెదులుతారు. 2d బ్యానర్‌ పేరుతో ప్రొడక్షన్‌ హౌజ్‌ స్టార్‌ చేసిన సూర్య దానికి భార్యనే అధినేతగా చేశాడు. జ్యోతికనే 2d బ్యానర్‌ వ్యవహరాలను స్వయంగా చూసుకుంటూ నిర్మాతగా వ్యవహరిస్తుంది. అంతేకాదు ఒకరి సినిమాపై మరోకరు పోస్ట్‌ చేస్తూ ప్రశంసలు కురిపించుకుంటారు. పర్సనల్‌, ప్రొఫెషనల్‌ లైఫ్‌లో ఇద్దరు సరిసమానంగా బాధ్యతలు పంచుకుంటూ అనోన్యంగా ముందుకు వెళుతున్నారు. అలాంటి ఈ జంటపై కొద్ది రోజులుగా రూమర్స్‌ వినిపిస్తున్నాయి.


సూర్య-జ్యోతికగా విడాకులు తీసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున్న ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారని, కుటుంబం నుంచి బయటకు వచ్చి పిల్లలతో కలిసి జ్యోతిక వేరుగా జీవిస్తుందటూ పుకార్లు పుట్టిస్తున్నారు. అయితే దీనికి కారణం కూడా ఉంది. ఎందుకంటే ఇటీవల జ్యోతిక తన పిల్లలతో కలిసి ముంబైకి షిఫ్ట్‌ అయ్యింది. దాంతో ఈ వార్తలు పుట్టుకొచ్చాయి. జ్యోతిక ముంబైకి షిఫ్ట్‌ అవ్వడంతో భర్తతో తనకు మనస్పర్థలు వచ్చాయని, ఆ గొడవలు కాస్తా విడాకులకు దారితీశాయంటూ కథనాలు సృష్టించారు. ఇప్పటికే ఈ వార్తలు ఇద్దరు కొట్టిపారేశారు కూడా. అయినా వారి విడాకుల రూమర్స్‌కు మాత్రం బ్రేక్‌ పడటం లేదు. తరచూ దీనిపై చర్చ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో జ్యోతిక ఓ ఆసక్తికర పోస్ట్‌ షేర్‌ చేసింది. భర్త సూర్యతో కలిసి ప్రస్తుతం వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తుంది. 


పోస్ట్ తో విడాకులపై క్లారిటీ..


వీరిద్దరు ఫిన్‌ల్లాండ్‌ వెళ్లగా అక్కడ మంచు కొండల్లో ఎంజాయ్‌ చేస్తున్న వీడియోను జ్యోతిక తన ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసింది. "2024 ఫుల్‌ ఆఫ్‌ ట్రావెల్‌.. జనవరిలో ఫిన్‌లాండ్‌ వెకేషన్‌" మంచులో భార్యభర్తలు కలిసి ఫుల్‌ వెకేషన్‌ మోడ్‌లో ఉన్నారు. ఫిన్‌లాండ్‌ను చూట్టేసిన వెకేషన్‌లో ఒక్క వీడియోను చూపించింది జ్యోతిక. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. దీంతో నెటజన్లు ఒక్క పోస్ట్‌తో విడాకుల రూమర్స్‌కు చెక్‌ పెట్టిందంటున్నారు. ఇకనైనా గాసిప్‌ రాయుళ్లు తమ తీరు మార్చుకుంటే బాగుంటుందని, ఇలాంటి తప్పుడు ప్రచారం ఆపి పనికొచ్చే పనులు చేయండంటూ ఈ కపుల్‌ ఫ్యాన్స్‌ కౌంటర్‌ ఇస్తున్నారు. 






అందుకే ముంబైకి షిఫ్ట్ అయ్యాను..


ఇదిలా ఉంటే రీసెంట్‌గా ఓ షోలో పాల్గొన్న జ్యోతిక ఫస్ట్‌టైం తమ విడాకుల వార్తలపై స్పందించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "నాకు సూర్యకు మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు. పిల్లల చదువు, నేను కమిట్‌ అయిన బాలీవుడ్‌ సినిమాలు, నా తల్లిదండ్రుల ఆరోగ్యం వంతి ఇతరత్ర కారణల వల్లే నేను పిల్లలతో కలిసి ముంబైకి షిఫ్ట్‌ అయ్యాను. సూర్య తను కమిట్‌ అయిన తమిళ్‌ సినిమాల వల్ల అక్కడే ఉండిపోయారు. కానీ అప్పుడప్పుడు మమ్మల్ని ఇక్కడికి వచ్చి కలుస్తున్నారు. ఆ ఫొటోలు, వీడియోలు కూడా చూశారు. అయినా ఇలాంటి వార్తలు ఎలా వచ్చాయో అర్ధం కావడం లేదు. సోషల్‌ మీడియా ప్రచారం అవుతున్నట్టు మా కుటుంబంలో ఎలాంటి కలహాలు లేవు. నా భర్త సూర్య చాలా మంచి వ్యక్తి. పిల్లల చదువు.. నా హిందీ చిత్రాలు పూర్తి కాగానే తిరిగి చెన్నై వెళ్లిపోతాం" అంటూ ఆమె వివరణ ఇచ్చింది.