Rare Feat By Guntur Kaaram At Mahesh’s Fav Theatre : సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంక్రాంతికి 'గుంటూరు కారం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మొదటి ఆట నుంచి ఈ సినిమాకి డివైడ్ వచ్చింది కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాతో ఫుల్ ఎంజాయ్ చేశారు. సినిమాలో మహేష్ బాబు మాస్ క్యారెక్టరైజేషన్, మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్, డాన్స్, డైలాగ్ డెలివరీ.. ఇలా అన్నీ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాంతో టాక్ తో సంబంధం లేకుండా సినిమాకి వసూళ్లు భారీగానే వస్తున్నాయి.


ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. డివైడ్ టాక్ తో అది కూడా ఓ రీజినల్ సినిమా వారం రోజుల్లో బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లు కొల్లగొట్టడం 'గుంటూరు కారం' సినిమాకు మాత్రమే సాధ్యమైంది. మరే స్టార్ హీరో సినిమా ఈ అరుదైన ఘనతను సాధించలేకపోయింది. ఫ్యామిలీ ఆడియన్స్ లో మహేష్ బాబు కి విపరీతమైన క్రేజ్ ఉండడం సినిమాకి బాగా ప్లస్  అయ్యింది. 


హైదరాబాద్ RTC క్రాస్ రోడ్స్ లో కోటి రూపాయల గ్రాస్..


ఇప్పటికీ థియేటర్స్ లో సక్సెస్ఫుల్​గా రన్ అవుతున్న ఈ మూవీ మరోసారి కొత్త రికార్డును సెట్ చేసింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సుదర్శన్ 35MM థియేటర్లో 'గుంటూరు కారం' మూవీ అతి తక్కువ సమయంలోనే కోటి రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసి సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. రిలీజ్ అయిన కేవలం 17 రోజుల్లోనే ఈ సినిమా సుదర్శన్ థియేటర్లో కోటి రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఇంత తక్కువ సమయంలో ఇప్పటివరకు మరే సినిమా అక్కడ కోటి రూపాయల గ్రాస్ కలెక్ట్ చేయలేదు. అది కేవలం మహేష్ బాబుకు మాత్రమే సాధ్యం అయ్యింది. అంతేకాదు సుదర్శన్35MM థియేటర్లో మహేష్ ఈ రికార్డును ఏడుసార్లు సాధించడం విశేషం.


నెల రోజులకు ముందే ఓటీటీలోకి గుంటూరు కారం..


మహేష్ బాబు కెరియర్ లోనే అత్యంత భారీ ధరకు 'గుంటూరు కారం' ఓటీటీ రైట్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం తెలుగులో సినిమా థియేటర్లలో విడుదలయిన నెలరోజుల వరకు ఓటీటీలో విడుదల చేయకూడదనే రూల్ నడుస్తోంది. ఆ రూల్ సినిమా రిజల్ట్‌పై ఆధారపడి మారుతూ కూడా ఉంటుంది. అయితే గుంటూరు కారం సినిమా విషయంలో మాత్రం థియేటర్లో రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత సినిమాని ఓటీటీలోకి తీసుకొస్తున్నారట. దాని ప్రకారం జనవరి 12న రిలీజ్ అయిన 'గుంటూరు కారం' ఫిబ్రవరి 10 న నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై నెట్ ఫ్లిక్స్ ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వాల్సి ఉంది.


Also Read : మరింత ఆలస్యంగా ఓటీటీలోకి 'హనుమాన్' - కారణం అదే!