Pushpa The Rule- Leaked Picture Of Allu Arjun In A Saree Goes Viral: ఇండియన్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'పుష్ప: ది రూల్'. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 (2024)న విడుదలకు రెడీ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుపుకుంటోంది. అనుకున్న సమయానికి ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.


‘పుష్ప 2’ నుంచి అల్లు అర్జున్ స్టిల్ లీక్


తాజాగా ‘పుష్ప 2’ సినిమాకు సంబంధించి ఓ స్టిల్ లీక్ అయ్యింది. ‘గంగమ్మ తల్లి’ గెటప్ లో ఉన్న అల్లు అర్జున్ షూటింగ్ సెట్ లో కూర్చొని ఉన్నట్లు ఈ ఫోటోలో కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో అల్లు అర్జున్ ‘గంగమ్మ జాతర’ గెటప్ లో కనిపించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు అదే గెటప్  స్టిల్ లొకేషన్ నుంచి లీక్ అయ్యింది. ఈ ఫోటోలో అల్లు అర్జున్ చీర కట్టుకొని కుర్చీలో కూర్చున్నారు. తిరుపతి గంగమ్మ జాతర సన్నివేశాలతో ‘పుష్ప 2’ కొన్ని సన్నివేశాలు ఉండనున్నాయి. ఈ సీన్లు షూట్ చేస్తుండగా ఈ ఫోటో లీక్ అయ్యింది.  ప్రస్తుతం ‘పుష్ప 2’ లీక్ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.


‘పుష్ప 2’ ఫోటో లీక్ పై మేకర్స్ ఆందోళన


‘పుష్ప 2’ షూటింగ్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, లీకుల బెడద తప్పకపోవడంతో చిత్రబృందం సీరియస్ అయినట్టు తెలుస్తోంది. గతంలోనూ ఎర్రచందనం తీసుకెళ్లే లారీలకు సంబంధించిన విజువల్ లీక్ అయ్యింది. అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఆ తర్వాత మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకోవడంతో ఎలాంటి ఫోటోలు, వీడియోలు బయటకు రాలేదు. మళ్లీ ఇప్పుడు ఓ స్టిల్ బయటకు రావడంతో మేకర్స్ మళ్లీ అలర్ట్ అయ్యారు.






‘పుష్ప’ దేశ వ్యాప్తంగా సంచలన విజయం


‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఈ సినిమాలోని పాటలు, డైలాగ్స్ ఓ రేంజిలో క్రేజ్ సంపాదించారు. ఈ సినిమాలో నటనకు గాను ఆయనకు ఏకంగా ఉత్తమ జాతీయ నటుడి అవార్డును కూడా దక్కించుకున్నాడు. ఈ సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కుతున్న ‘పుష్ప 2’పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అభిమానులు అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.  ‘పుష్ప’ సినిమా వచ్చి మూడేళ్లు అవుతుంది. ‘పుష్ప 2’ను ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ కూడా విడుదల చేశారు.  ప్రస్తుతం ‘పుష్ప 2’ షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో శరవేగంగా జరుగుతుంది.ఈ చిత్రంలో అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.  దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.


Read Also: ఫిబ్రవరిలో ఏకంగా 10 సినిమాలు విడుదల, ఆ రెండు వెరీ స్పెషల్!