Ooru Peru Bhairavakona Release Date: గత కొన్నిరోజులుగా టాలీవుడ్‌లో సినిమా రిలీజ్ డేట్స్‌పై కన్‌ఫ్యూజన్ ఎక్కువవుతోంది. అందుకే ఫిల్మ్ ఛాంబర్, అందులోని ప్రముఖ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు.. ఇలా అందరూ కలిసి సినిమాల రిలీజ్ డేట్స్‌పై చర్చలు జరపాల్సి వస్తుంది. అలా చర్చలు ముగిసిన తర్వాతే విడుదల తేదీలపై ఒక క్లారిటీ వస్తోంది. ఇక ‘ఊరు పేరు భైరవకోన’ విషయంలో కూడా అదే జరిగింది. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ డేట్ ఒకసారి పోస్ట్‌పోన్ అవ్వగా.. రెండోసారి కూడా ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం వల్ల సినిమాను పోస్ట్‌పోన్ చేశారు మేకర్స్. ఇక కొత్త విడుదల తేదీని తాజాగా అనౌన్స్ చేశారు. 


‘ఈగల్’ వల్ల ఇబ్బందులు..


వీఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ నటించిన చిత్రమే ‘ఊరు పేరు భైరవకోన’. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయినా కూడా ఇప్పటివరకు దీని విడుదలకు ముహూర్తం ఖరారు కాలేదు. పైగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌కు కూడా చాలా సమయం పట్టింది. ముందుగా ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో నిలబెట్టాలని అనుకున్నారు మేకర్స్. కానీ అప్పటికే సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాల సంఖ్య ఎక్కువయిపోయింది. అందుకే హడావిడి అంతా పూర్తయిన తర్వాత ఫిబ్రవరీలో ప్రేక్షకుల ముందుకు రావాలని ‘ఊరు పేరు భైరవకోన’ టీమ్ నిర్ణయించుకుంది. కానీ ఫిబ్రవరీలో కూడా రవితేజ నటించిన ‘ఈగల్’ వల్ల ఈ సినిమాకు ఇబ్బందులు తప్పలేదు.


మరోసారి డిస్కషన్ తప్పలేదు..


రవితేజ హీరోగా నటించిన ‘ఈగల్’ కూడా సంక్రాంతికే విడుదల కావాల్సి ఉంది. జనవరి 15న విడుదల ఉంటుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు కూడా. కానీ అప్పటికే పోటీలో ఉన్న సినిమాలను దృష్టిలో పెట్టుకొని సినిమాకు సోలో రిలీజ్ కల్పిస్తామని మాటిచ్చి ‘ఈగల్’ను ఫిబ్రవరి 9కు పోస్ట్‌పోన్ చేయించింది ఫిల్మ్ ఛాంబర్. ఓవైపు ఫిల్మ్ ఛాంబర్.. ‘ఈగల్’కు సోలో రిలీజ్ కల్పిస్తామని మాటిచ్చినా కూడా ‘ఊరు పేరు భైరవకోన’ కూడా అదే రోజు విడుదలను ప్రకటించింది. దీంతో మరోసారి ఫిల్మ్ ఛాంబర్‌లో డిస్కషన్ తప్పలేదు. ఫైనల్‌గా ఫిబ్రవరీ 16కు తమ రిలీజ్‌కు పోస్ట్‌పోన్ చేయడానికి ‘ఊరు పేరు భైరవకోన’ నిర్మాతలు ఒప్పుకున్నారని తాజాగా జరిగిన ప్రెస్ మీట్‌లో దిల్ రాజు బయటపెట్టారు.






తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం..


‘తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయాన్ని గౌరవిస్తూ.. తెలుగు సినిమా స్పిరిట్‌ను ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రస్తుతం వెనకడుగు వేస్తున్నాం’ అంటూ ప్రపంచవ్యాప్తంగా ‘ఊరు పేరు భైరవకోన’ మూవీ ఫిబ్రవరీ 16న విడుదలవుతుందని సందీప్ కిషన్.. తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వర్ష బొల్లామా, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ‘ఊరు పేరు భైరవకోన’లోని సిడ్ శ్రీరామ్ పాడిన ‘నిజమేనే చెబుతున్న జానే జాన’ అనే పాటను విడుదల చేసి సినిమా గురించి ప్రేక్షకులకు తెలిసేలా చేశారు మేకర్స్. తాజాగా విడుదలయిన ట్రైలర్ కూడా ఈ సినిమాపై ఆసక్తి పెరిగేలా చేసింది.


Also Read: మరోసారి త్రివిక్రమ్‌ను టార్గెట్ చేసిన పూనమ్? చిరుతో దిగిన ఫోటోలపై అలాంటి కామెంట్