Mahesh Babu in Germany: సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా ‘గుంటూరు కారం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేశ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ కావడంతో ‘గుంటూరు కారం’ భారీ అంచనాల మధ్య విడుదలయ్యింది. కానీ చాలామంది ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం సినిమాను అమితంగా ఇష్టపడ్డారు. ఇక ‘గుంటూరు కారం’ పని పూర్తయిపోవడంతో రాజమౌళి మూవీపై మహేశ్ ఫోకస్ పెట్టాడని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా జర్మనీకి ప్రయాణమయ్యారు ఈ హీరో. కానీ రాజమౌళి సినిమాకు ప్రిపరేషన్ కోసం మహేశ్.. ఈ ట్రిప్‌కు వెళ్లారని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.


ఫ్యామిలీ లేకుండా ట్రిప్..


మహేశ్ బాబుతో ప్రపంచాన్ని చుట్టేసే వ్యక్తి కథతో సినిమాను తెరకెక్కిస్తున్నానని దర్శక ధీరుడు రాజమౌళి ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమా చాలా అడ్వెంచర్‌లాగా ఉంటుందని కూడా రివీల్ చేశారు. అంటే అలాంటి కథ కోసం హీరో.. అడవుల్లో తిరగాల్సి ఉంటుంది. ప్రస్తుతం మహేశ్ చేస్తుంది అదే. మామూలుగా ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్స్‌కు వెళ్లడం, వెకేషన్స్‌కు వెళ్లడం మహేశ్ బాబుకు అలవాటే. కానీ తాజాగా తను వెళ్లిన జర్మనీ ట్రిప్ మాత్రం అలా అనిపించడం లేదు. ఈ ట్రిప్‌కు తన డాక్టర్ కమ్ ట్రైనర్ అయిన డాక్టర్ హ్యారీ కొనింగ్‌తో కలిసి వెళ్లారు మహేశ్. గడ్డకట్టే చలిలో మహేష్ ట్రెక్కింగ్ చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించి ఆయన షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






ఫిట్‌నెస్ మెయింటేయిన్ చేస్తున్న మహేశ్..


మహేశ్, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ కోసం వినూత్న టెక్నాలజీని ఉపయోగించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ కథ పూర్తిగా పూర్తయినట్టు రైటర్ విజయేంద్ర ప్రసాద్ బయటపెట్టారు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఎప్పటినుండో సాగుతూనే ఉన్నాయి. ఇక త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇంతలోనే మహేశ్ బాబు జర్మనీ అడవుల్లో తిరగడం చూసి ఇది కూడా మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో భాగమే అని నెటిజన్లు ఫిక్స్ అయిపోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం కసరత్తులు ప్రారంభించారు. ఇంతకు ముందు మహేశ్ నటించిన సినిమాలతో పోలిస్తే.. ఇందులో మరింత ఫిట్‌గా ఉండాలేమో అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.


సినీ సెలబ్రిటీల్లో ఫేమస్..


ఇప్పటికే తన డాక్టర్ కమ్ ట్రైనర్ అయిన డాక్టర్ డాక్టర్ హ్యారీ కొయింగ్‌తో తనకు సినిమాకు సంబంధించిన ట్రైనింగ్‌ను ప్రారంభించాడని తెలుస్తోంది. సినీ సర్కిల్లో డాక్టర్ హ్యారీ కొనింగ్‌కు మంచి పేరుంది. ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ఈయనకు క్లైంట్స్‌గా ఉన్నారు. ఇక ట్రిప్ నుండి డాక్టర్ హ్యారీ కొనింగ్‌తో కలిసి మహేశ్ బాబు షేర్ చేసిన ఫోటోల్లో సూపర్ స్టార్ చాలా స్టైలిష్‌గా ఉన్నాడని గర్ల్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ‘గుంటూరు కారం’ విషయానికొస్తే.. ఇప్పటికీ ఈ మూవీ చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తున్నారు. ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. 


Also Read: 'గుంటూరు కారం' రేర్ ఫీట్ - మహేష్ ఫేవరెట్ థియేటర్​లో కోటి రూపాయల గ్రాస్!