Prabhas Health: 'బాహుబలి-1', 'బాహుబలి - 2' తర్వాత 'సలార్‌'తో బంపర్‌ హిట్‌ కొట్టాడు ప్రభాస్‌. తన అభిమానులను ఉర్రూతలూగించాడు 'సలార్‌'తో ఇక ఆ తర్వాత వరుస ప్రాజెక్టులతో బిజీ అయిపోయాడు డార్లింగ్‌. వరుస సినిమాల షూటింగ్‌ జరుగుతుండగా.. ఇప్పుడు షూట్స్‌ నుంచి బ్రేక్‌ తీసుకున్నాడు ఆయన. నెల రోజుల పాటు షూటింగ్స్‌కి తాత్కాలికంగా బ్రేక్‌ ఇచ్చినట్లు ఆయన సన్నిహితులు చెప్పారు. 


హెల్త్‌పై దృష్టి పెట్టేందుకే.. 


బిజీ బిజీగా గడుపుతున్న ప్రభాస్‌ షూటింగ్స్‌ నుంచి నెల రోజుల పాటు గ్యాప్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. మార్చిలో వరుసగా 'కల్కీ 2898 ఏడీ', 'రాజాసాబ్‌' తదితర చిత్రాలు షూటింగ్స్‌ ఉండటంతో ఈ మేరకు ఆయన బ్రేక్‌ తీసుకున్నారట. ఆ తర్వాత మార్చిలో షూటింగ్స్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ గ్యాప్‌లో ఆయన రీ జనరేట్‌ అయ్యేందుకు చూస్తున్నారని, అంతేకాకుండా హెల్త్‌ మీద కూడా దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. గతంలో తగిలిన కొన్ని గాయాల నుంచి పూర్తిగా రికవరీ అవ్వాలంటే ఆయనకు కొన్ని సర్జరీలు అవసరమని, దానికోసం యూరప్‌ వెళ్తున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్త ఆయన అభిమానులను కలవరపెడుతోంది. ప్రభాస్ గాయాల నుంచి కోలుకుని మళ్లీ షూటింగ్స్‌లో పాల్గోవాలని అంటున్నారు.


ఏదేమైనా ఫుల్‌ బిజీ బిజీగా పనిలో నిమగ్నమైన డార్లింగ్‌ దాదాపు నెల రోజుల పాటు ఎవ్వరికీ దొరకుండా ప్రశాంతంగా గడపాలని చూస్తున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కెరీర్‌కి సంబంధించి కొన్ని విషయాలు ఆలోచించేందుకు, తర్వాత ఎలాంటి స్టెప్‌ తీసుకోవాలనేది నిర్ణయం తీసుకునేందుకు కూడా ఈ గ్యాప్‌ని ప్రభాస్‌ ఉపయోగించుకోనున్నారని అంటున్నారు. 


ఇక ప్రభాస్‌ మరో ఇంట్రెస్టింగ్‌ ప్రాజెక్ట్‌.. 'కల్కీ 2898 ఏడీ'. ప్రముఖ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటుగా దీపిక పదుకొనే , అమితాబ్‌బచ్చన్‌, దిశాపటాని తదితర సీనియర్‌ నటులు నటిస్తున్నారు. ఇది పాన్‌ ఇండియా సినిమాగా రిలీజ్‌ కాబోతోంది. ఆ తర్వాత యనిమల్‌ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లో 'స్పిరిట్‌', మారుతి డైరెక్షన్‌లో 'రాజాసాబ్‌' రాబోతోంది. మారుతి డైరెక్షన్‌లో వస్తున్న సినిమాకి సంబంధించి ఇప్పటికే దాదాపు షూటింగ్‌ పూర్తైనట్లుగా వార్తలు వచ్చాయి. ఈ సినిమాని శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు సమాచారం.   


'బాహుబలి' తర్వాత ప్రభాస్‌ తీసిన అన్ని సినమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో నిరాశలో ఉన్న ఫ్యాన్స్‌ ముఖాల్లో చిరునవ్వు నింపింది 'సలార్‌'. మొదట్లో మిక్సడ్‌ టాక్‌ వచ్చినప్పటికీ బాక్సాఫీస్‌ దగ్గర మాత్రం సత్తా చాటింది 'సలార్‌'. దాదాపు నెల రోజుల వ్యవధిలోనే బాక్సాఫీస్‌ వద్ద రూ.400 కోట్లు రాబట్టింది. కేజీఎఫ్‌ సినిమా డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్వకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్‌ సరికొత్తగా కనిపించాడనే చెప్పాలి. ఇక ఈ సినిమా ఓటీటీలో కూడా దుమ్ము లేపుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన 'సలార్‌' గ్లోబల్‌లో టాప్‌ 10 సినిమాల్లో ఒకటిగా నిలిచింది. దీంతో 'సలార్‌' ఇప్పుడు గ్లోబల్‌ సినిమా అంటూ సినిమా యూనిట్‌ ప్రకటించింది. ఈ సినిమాని ఇంగ్లీష్‌లో కూడా విడుదుల చేయనున్నారు.


Also Read: ఆ స్టార్‌ హీరోతో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ పెళ్లి - నిజమెంత?