Varalakshmi Sarathkumar Marriage: తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తన అద్భుతమైన నటనతో ఫ్యాన్‌బేస్ సంపాదించుకున్న నటి వరలక్ష్మీ శరత్‌కుమార్. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అద్భుతమైన పాత్రల్లో నటించారు. ఇక పాత్రకు తగ్గట్లుగా, వాటిల్లో ఒదిగిపోయి పాత్రకు న్యాయం చేస్తారు. సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ వరలక్ష్మీ శరత్‌కుమార్. అందుకే, ఈమె చేసే ప్రాజెక్ట్స్‌ల కంటే.. పెళ్లికి సంబంధించిన వార్తలే తెగ వైరల్ అవుతుంటాయి. గతంలో చాలాసార్లు వరలక్ష్మీ పెళ్లి వార్తలు బయటికి వచ్చినప్పటికీ అవేవి నిజం కాదని తేల్చిచెప్పారు ఆమె. ఇక ఇప్పుడు మరోసారి.. వరలక్ష్మీకి ఒక స్టార్ హీరోకి పెళ్లి అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఆ హీరోతో పెళ్లి..
వరలక్ష్మీ శరత్‌కుమార్.. ప్రముఖ హీరో శరత్‌కుమార్ కూతురు. తండ్రిలాగానే ఆమె కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదట్లో తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా అదృష్టం పరీక్షించుకున్నారు. అయితే, అది వర్కవుట్ కాలేదు. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెటిల్ అయ్యారు. కాగా.. ఈ బ్యూటీ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. ఇక వరలక్ష్మీ, హీరో విశాల్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. దీంతో విశాల్‌తో ఆమె పెళ్లి జరగబోతుందనే ప్రచారం జోరుగా సాగింది. అయితే, దాంట్లో ఎలాంటి నిజం లేదని, తాము మంచి ఫ్రెండ్స్ అని చెప్పారు వరలక్ష్మీ. ఆ తర్వాత ధనుష్‌తో పెళ్లి అంటూ వార్తలు వినిపించాయి.
క్లారిటీ ఇచ్చేశారు..
ఇక ఇప్పుడు హీరో శింబుతో వరలక్ష్మీ శరత్‌కుమార్ పెళ్లి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని, దానికి సంబంధించి మాటలు జరుగుతున్నాయనే పుకారు పుట్టింది. శింబు కూడా ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడం, ఆయన సింగిల్‌గా ఉండటంతో ఈ మేరకు వార్తలు బయటికి వస్తున్నాయి. అయితే, దాంట్లో ఎలాంటి నిజం లేదట. పెళ్లి లాంటిదేమీ లేదని ఇరువర్గాల సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. కానీ, ఆమె అభిమానులు మాత్రం.. నీ పెళ్లి చూడాలని ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
లేటెస్ట్ బ్లాక్‌బాస్టర్ 'హను మాన్'లో నటించారు వరలక్ష్మీ శరత్‌కుమార్. అందులో హీరో అక్క క్యారెక్టర్ వేశారు. తన నటనతో ఎంతోమందిని మెప్పించారు. అక్క సెంటిమెంట్‌తో కన్నీళ్లు తెప్పించారు వరలక్ష్మీ. ఇక తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన ఆమె.. రవితేజ నటించిన 'క్రాక్' సినిమాలో చేసిన పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సుదీప్ 'మ్యాక్స్' సినిమాలో నటిస్తున్నారు. 'ధనుష్ d50'లో చేస్తున్నారు వరలక్ష్మీ. వాటితో పాటుగా మరికొన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు ఆమె. ఇక ఆమె పవర్‌ఫుల్ పోలీస్‌ఆఫీసర్‌గా నటించిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. లాయర్‌గా, విలన్‌గా అన్ని రకాల పాత్రల్లో నటించి టాలెంటెడ్ నటి అని గుర్తింపు తెచ్చుకున్నారు వరలక్ష్మీ.
ప్రస్తుతం ఆమె నటించిన 'హను మాన్' సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. రికార్డుల మోత మోగిస్తోంది. ఇప్పటికే రూ.250 కోట్లు దాటిపోయాయి కలెక్షన్స్. ఆ సినిమాలో ప్రతి ఒక్కరు అద్భుతంగా నటించారు. ఇక వరలక్ష్మీ శరత్‌కుమార్ కూడా తన పాత్రకు ఎంతగానో న్యాయం చేశారు. ఎంతోమంది ప్రశంసలు అందుకున్నారు ఆమె. ఇక ఓటీటీలో రిలీజైన 'మ్యాన్షన్ 24' కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
Also Read: హనుమాన్ పాత్రలో చిరంజీవి, రాముడిగా ఆ హీరో - ప్రశాంత్ వర్మది పెద్ద ప్లానింగే!