జూలైలో ప్రేక్షకులను ఎంట‌ర్‌టైన్‌ చేయడానికి మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand), దర్శకుడు మారుతి (Director Maruthi) రెడీ అవుతున్నారు. వీళ్ళిద్దరి కలయికలో రూపొందుతున్న సినిమా 'పక్కా కమర్షియల్'. దీనికి 'బన్నీ' వాసు నిర్మాత. యూవీ క్రియేషన్స్, జీఏ (గీతా ఆర్ట్స్) 2 పిక్చర్స్ పతాకాలపై తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని జూలై 1న విడుదల (Pakka Commercial Movie Release Date) చేయనున్నట్టు దర్శక - నిర్మాతలు ఈ రోజు వెల్లడించారు 


దర్శకుడు మారుతి, జీఏ 2 పిక్చర్స్, యువి క్రియేషన్స్ కలయికలో 'భలే భలే మగాడివోయ్', 'ప్రతి రోజూ పండగే' వంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. ఈ సినిమా కూడా భారీ విజయం సాధిస్తుందని యూనిట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 


కామెడీ అండ్ యాక్షన్ మేళవించిన లాయర్ పాత్రలో గోపీచంద్ కనిపించనున్న చిత్రమిది. ఇందులో ఆయనకు జంటగా కనిపించనున్న రాశీ ఖన్నాది సైతం లాయర్ రోల్. ఆల్రెడీ విడుదలైన టీజర్‌లో 'ఎవరికి చూపిస్తున్నారు సార్ మీ విలనిజం? మీరు ఇప్పుడు చేస్తున్నారు. నేను ఎప్పుడో చేసి, చూసి వచ్చేశా' అంటూ గోపీచంద్ స్టయిలిష్ గా ఫైట్ చేశారు. 'నా హీరోయిజంకు ఒక ఆరా ఉంటుంది. కాన్సంట్రేట్ చేస్తే.. ఆరా నుంచి ఒక ఆర్ఆర్ వినిపిస్తుంది' అంటూ పంచ్ డైలాగ్ కొట్టారు. మారుతి శైలి వినోదం కూడా సినిమాలో ఫుల్ ఉందట.


ఈ సినిమా కోసం 'జన్మించినా... మరణించినా... ఖర్చే ఖర్చు... పక్కా కమర్షియల్' అంటూ దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన గీతాన్ని కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. జేక్స్ బిజాయ్ సంగీతం అందించిన ఈ సినిమాలో సత్యరాజ్ తదితరులు నటించారు.


నిజం చెప్పాలంటే... తొలుత మార్చి 18న 'పక్కా కమర్షియల్'ను విడుదల చేయాలని అనుకున్నారు. అయితే... మార్చి 11న 'రాధే శ్యామ్', 25న 'ఆర్ఆర్ఆర్' విడుదలకు సిద్ధమైన తర్వాత మే 20కు వాయిదా వేశారు. అదీ కరోనా కరుణిస్తే మే 20న... అని తెలిపారు. ఇప్పుడు జూలై 1 ఫిక్స్ చేశారు. కరోనా కారణంగా తెలుగులో దాదాపు ప్రతి సినిమా విడుదల తేదీ మారింది. ఈ సినిమా విడుదల తేదీ కూడా మారింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... జూలై 1న 'పక్కా కమర్షియల్' ఫిక్స్ (Pakka Commercial On July 1st).


Also Read: ప్రభాస్ 'రాధే శ్యామ్', తాప్సి 'మిషన్ ఇంపాజిబుల్', హిందీలో రకుల్ 'అట్టాక్' - ఈ వారం థియేటర్, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు


Also Read: సౌత్ జనాలకు తెల్లగా ఉంటే చాలు, టాలెంట్ అక్కర్లేదు - రాశి ఖన్నా ఘాటు వ్యాఖ్యలు