బిగ్ బాస్ ఓటీటీ తెలుగులో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ముమైత్ ఖాన్.. ఊహించని విధంగా మొదటివారమే ఎలిమినేట్ అయిపోయింది. దీంతో హౌస్ మేట్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు ముమైత్ ఖాన్ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎందుకు ఎలిమినేట్ అయిందా అని అందరూ లెక్కలు వేసుకున్నారు. ఆర్జే చైతుతో గొడవ పడడమే ఆమె ఎలిమినేషన్ కి కారణమనుకున్నారు. ఆ తరువాత మూడో వారమే ఆర్జే చైతు కూడా ఎలిమినేట్ అయ్యాడు. 


ఇప్పటివరకు హౌస్ నుంచి మొత్తం నలుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ ఎలిమినేట్ అయిన వారిలోనుంచి ముమైత్ ఖాన్ ని హౌస్ లోకి పంపిస్తున్నట్లు వార్తలొచ్చాయి. కానీ అందులో నిజం లేదనుకున్నారు. కానీ నిజంగా ముమైత్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈరోజు జరగబోయే ఓ టాస్క్ లో ముమైత్ ని జడ్జిగా హౌస్ లోకి పంపించారు. అయితే ఆమె ఒక్క ఎపిసోడ్ వరకే ఉంటుందా? లేక షోలో కంటిన్యూ అవుతుందో ఈరోజు ఎపిసోడ్ తో క్లారిటీ రానుంచి.  


సీజన్ 1లో కూడా ముమైత్ ఖాన్ ఇలానే రీఎంట్రీ ఇచ్చింది. అలానే సీక్రెట్ రూమ్ లో కూడా కొన్ని రోజులు ఉండి గేమ్ ని బాగా గమనించింది. ఇప్పుడు కూడా ముమైత్ ఖాన్ హౌస్ మేట్స్ గేమ్ ని బాగా పరిశీలించి మరోసారి రీఎంట్రీ ఇచ్చి ఉంటుందని అర్ధమవుతోంది. ముమైత్ గనుక హౌస్ లో కంటిన్యూ అయితే ఆమె స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారే అవకాశం కనిపిస్తుంది. 


ఇక ప్రస్తుతం హౌస్ లో నామినేషన్ కి సంబంధించి ఓ టాస్క్ నడుస్తోంది. నిజానికి సోమవారం నాడు జరిగిన నామినేషన్ ప్రక్రియలో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లోకి వచ్చారు. మంగళవారం నాడు ఈ నామినేషన్ లో ఉండేవారు సేవ్ అవ్వడానికి ఓ ఛాన్స్ ఇచ్చారు బిగ్ బాస్. అలానే వారికి బదులు మరొకరు నామినేట్ అవ్వాల్సి వస్తుంది. అలా ఈసారి తేజస్వి, స్రవంతి నామినేషన్స్ లోకి వచ్చారు. 


Also Read: బాలీవుడ్‌కు షాక్, రష్మిక ఆ సినిమా చేయడం లేదు!