Gangs Of Godavari Movie Review: అరెరే... మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా చెయ్యాల్సిన సినిమాను విశ్వక్ సేన్ (Vishwak Sen)తో తీశారా? 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' థియేటర్స్ నుంచి ఆడియన్స్ చేస్తున్న ట్వీట్స్ చూస్తే అలాగే అనుకోవాలి. ''జూనియర్ (Jr NTR)తో తీయాల్సిన మూవీ. ఇంకా బాగుండేది. విశ్వక్ సేన్ మాస్ ఫీట్'' అని ఒక నెటిజన్ సోషల్ నెట్వర్కింగ్ సైట్ 'ఎక్స్'లో పేర్కొన్నాడు. ఫస్టాఫ్ కంప్లీట్ అయ్యేసరికి 3.25 రేటింగ్ ఇచ్చాడు.






మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా... అంజలి, నేహా శెట్టి హీరోయిన్లుగా నటించిన సినిమా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. లిరిసిస్ట్ టర్న్డ్ డైరెక్టర్ కృష్ణచైతన్య దర్శకత్వం వహించాడు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించాడు. గోదావరి నేపథ్యంలో తెరకెక్కిన రూరల్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. మే 31న వరల్డ్ వైడ్ రిలీజ్ చేశారు. ఆల్రెడీ అమెరికాలో ప్రీమియర్ షోలు పడ్డాయి. అక్కడ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి? ఆడియన్స్ ఏం అంటున్నారు? అనేది చూద్దాం.


'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' థియేటర్లలోకి అడుగుపెట్టిన ప్రేక్షకుడు ఫస్ట్ 10 మినిట్స్ అయ్యాక హీరో విశ్వక్ సేన్ అనేది మరిచిపోయి లంకల రత్న క్యారెక్టర్ మాత్రమే చూస్తారని ప్రొడ్యూసర్ నాగవంశీ చెప్పాడు. అది నిజమేనని కొందరు ఆడియన్స్ అంటున్నారు. మూవీలో వచ్చే ఫస్ట్ యాక్షన్ బ్లాక్ సాలిడ్ గా వుందట. స్టోరీ సెటప్ అంతా బావుందని, డ్రామా ఎక్స్‌పెక్ట్ చేసిన రేంజిలో లేదని అంటున్నారు.


Also Read: క్యాజువల్‌గా తోశారంతే... మందు బాటిల్ - బాలకృష్ణ, అంజలి ఇష్యూపై నిర్మాత క్లారిటీ



డైలాగ్స్ మీద స్పెషల్ డిస్కషన్!
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాలో డైలాగ్స్ మీద నెటిజన్స్ కొందరు స్పెషల్ ట్వీట్స్ చేస్తున్నారు. ''ఆడు మొదటి మూడు పూటలు అమ్మోరుకు వదిలేశాడు అయ్యా'' అని ఇంటర్వెల్ ఫైట్ లో వచ్చే డైలాగ్ సూపర్బ్ అని ఒక నెటిజన్ చెప్పాడు. అసలు ఫస్ట్ హాఫ్ కథతో సినిమా తియ్యొచ్చని, క్రిస్పీ రన్ టైమ్ అని కూర్చున్నట్టు వున్నారని, బ్యాడ్ ఎడిటింగ్ అని పేర్కొన్నాడు. 'పుష్ప' ఫాస్ట్ ట్రాక్ చేస్తే ఎలా వుంటుందో అలా వుంటుందని ఆ నెటిజన్ చెప్పాడు. 'ఫుల్ సినిమాలో వుండే స్టోరీని ఫస్ట్ హాఫ్ లో చెప్పేశాడ''ని మరొక నెటిజన్ ట్వీట్ చేశాడు. ''జనాలు నిజంగా గొర్రెలు అండి. మిమ్మల్ని టైగర్ అనేస్తున్నారు'' అని విశ్వక్ సేన్ ఉద్దేశించి హైపర్ ఆది చెప్పే డైలాగ్ కూడా థియేటర్లలో పేలిందట. 


















సినిమాకు ఒకవైపు పాజిటివ్ టాక్ ఎంత వుందో, నెగెటివ్ టాక్ కూడా అదే స్థాయిలో వుంది. అవుట్ డేటెడ్ స్టోరీ, డైరెక్షన్ అని కొందరు కామెంట్ చేస్తున్నారు. విశ్వక్ సేన్ సిగ్నేచర్ స్టైల్ మిస్ అయ్యిందని చెబుతున్నారు. అయితే, ప్రతి ఒక్కరూ చెప్పే మాట... ఇంట్రడక్షన్, ఇంటర్వెల్ ఫైట్ అదిరిపోయాయని. శర్వానంద్ 'రణరంగం'లా ఉందని తన ఫ్రెండ్ చెప్పినట్టు ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు.


Also Readసుక్కుతో స్టెప్పులు వేయించిన డ్యాన్స్ మాస్టర్ - ఈ లిరికల్ వీడియో స్పెషాలిటీ ఏంటో తెలుసా?