Sooseki Lyrical Video Speciality: రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మరోసారి అందరి చేత 'వావ్' అనిపించారు. 'పుష్ప 2: ది రూల్' మొదటి పాట 'పుష్ప పుష్ప పుష్పరాజ్...'తో పాన్ ఇండియా ప్రేక్షకులు అందరితో క్లాప్స్ కొట్టించిన ఆయన... రెండో పాట 'సూసేకి' సైతం చార్ట్ బస్టర్ ట్యూన్ అందించారు. బుధవారం ఉదయం విడుదలైన లిరికల్ వీడియో స్పెషాలిటీ ఏమిటో తెలుసా? క్రియేటివ్ జీనియస్, దర్శకుడు సుకుమార్ (Sukumar) వేసిన స్టెప్పులు!


సుక్కుతో డ్యాన్స్ చేయించిన గణేష్ ఆచార్య
'సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి'... 'పుష్ప 2'లో ఈ పాటకు ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య (Ganesh Acharya) నృత్య దర్శకత్వం వహించారు. 'పుష్ప' సినిమాలో 'ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా' పాటకు కొరియోగ్రఫీ చేసింది ఆయనే. సాంగ్ షూటింగ్ చేసేటప్పుడు మధ్య గ్యాప్ దొరుకుంటుంది కదా! ఆ విరామంలో దర్శకుడు సుక్కుతో ఆయన స్టెప్పులు వేయించారు. ఆ స్టెప్స్ లిరికల్ వీడియోలో చూడొచ్చు.


సినిమాలో మీరు చూసే బన్నీ, రష్మిక డ్యాన్స్ ఉండదు!
'సూసేకి' లిరికల్ వీడియోలో మరో స్పెషాలిటీ ఏమిటంటే? అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) డ్యాన్స్ చేశారు కదా! ఆ విజువల్స్ ఏవీ మీకు సినిమాలో కనిపించవు. కేవలం ఈ లిరికల్ వీడియో కోసం షూట్ చేసిన స్పెషల్ విజువల్స్ అవి.


Also Read: హీరోగా నటించిన పుష్ప 2 యాక్టర్ అజయ్ ఘోష్... రెండు వారాలు వెనక్కి వెళ్లిన 'మ్యూజిక్ షాప్ మూర్తి' - విడుదల ఎప్పుడంటే?



సినిమాలో 'సూసేకి...' పాటకు బన్నీ, రష్మిక వేసిన స్టెప్పులు గానీ, కాస్ట్యూమ్స్ గానీ వేరు. థియేటర్లలో ప్రేక్షకులకు కనువిందుగా ఆ పాట ఉంటుందని, అందరూ ఆ సాంగ్ విజువల్స్ చూసి విజిల్స్ వేస్తారని యూనిట్ సన్నిహిత వర్గాలు చెప్పే మాట.


'పుష్ప 2' సినిమా విజయంలో దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన బాణీలు కీలక పాత్ర పోషించాయి. సీక్వెల్ (Pushpa 2 Songs)కు కూడా ఆయన చార్ట్ బస్టర్ సాంగ్స్ అందిస్తున్నారని ఆల్రెడీ విడుదలైన రెండు సాంగ్స్ వింటే అర్థం అవుతోంది. అయితే, ఈసారి స్పెషల్ సాంగ్ ఎలా ఉండబోతోంది? అని ఆడియన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.


Also Read: ఇక 'ఎక్స్ట్రా'ల్లేవ్... జస్ట్ 'జబర్దస్త్'... స్టేజి మీద కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ



జాన్వీ కపూర్ లేదా తృప్తి దిమ్రి... ఇద్దరిలో ఎవరు?
'పుష్ప' సినిమాలోని ప్రత్యేక గీతం 'ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ'లో స్టార్ హీరోయిన్ సమంత స్టెప్పులు వేశారు. అయితే, 'పుష్ప 2' కోసం కొత్త హీరోయిన్ వైపు యూనిట్ చూస్తోందని సమాచారం. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ లేదా 'యానిమల్' ఫేమ్ తృప్తి దిమ్రి... ఇద్దరిలో ఎవరో ఒకరు బన్నీతో పాటు స్టెప్పులు వేసే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ ఖబర్. సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నారు.