Ajay Ghosh and Chandini Chowdary's Movie Music Shop Murthy: క్యారెక్టర్ ఆర్టిస్టుగా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకున్న నటుడు అజయ్ ఘోష్. 'పుష్ప', 'మంగళవారం', 'గుంటూరు కారం' సినిమాల్లో ఆయన నటన అందర్నీ మెప్పించింది. నటుడిగా పలు సినిమాలు చేసిన ఆయన ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆ సినిమా విడుదల తేదీ రెండు వారాలు వెనక్కి వెళ్ళింది. 


జూన్ 14న 'మ్యూజిక్ షాప్ మూర్తి' విడుదల
అజయ్ ఘోష్ టైటిల్ పాత్ర పోషించిన సినిమా 'మ్యూజిక్ షాప్ మూర్తి'. ఇందులో యంగ్ హీరోయిన్ చాందిని చౌదరి మరో కీలక పాత్ర చేశారు. ఫ్లై హై సినిమాస్‌ పతాకంపై హర్ష గారపాటి, రంగారావు గారపాటి ప్రొడ్యూస్ చేశారు. ఈ చిత్రానికి శివ పాలడుగు దర్శకుడు. కథ, స్క్రీన్ ప్లే కూడా ఆయనవే. తొలుత ఈ సినిమాను మే 31న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే... ఇప్పుడు రెండు వారాలు వెనక్కి వెళ్ళింది. జూన్ 14న సినిమాను థియేటర్లలోకి తీసుకు రానున్నట్టు తెలిపారు. 






డీజే క్యారెక్టర్ చేసిన అజయ్ ఘోష్
Ajay Ghosh Role In Music Shop Murthy Movie: 'మ్యూజిక్ షాప్ మూర్తి' సినిమాలో అజయ్ ఘోష్ డీజే రోల్ చేశారు. ఊరిలో ఆయన మ్యూజిక్ షాప్ ఉంటుంది. కానీ, ఆయనకు డీజే కావాలనేది కోరిక. కానీ, కుటుంబ బాధ్యతలు & పరిస్థితుల వల్ల కుదరదు. తర్వాత కుటుంబాన్ని వదిలి సిటీకి వస్తాడు. ఆ తర్వాత ఏమైందనేది థియేటర్లలో చూడాలి. ఆయనకు సాయం చేసే అమ్మాయి పాత్రలో చాందినీ చౌదరి, భార్యగా ఆమని, ఇంకా కీలక పాత్రల్లో అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి కనిపించనున్నారు. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించిన చిత్రమిది. ఆల్రెడీ రిలీజ్ చేసిన టీజర్, పాటలకు ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చిందని దర్శక నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు.


Also Read'త్రినయని' తిలోత్తమ బ్యూటీ సీక్రెట్ - 50 ఏళ్ల వయసులో ఆ గ్లామర్ వెనుక కష్టం ఈ ఫోటోల్లో చూడండి


కుటుంబ సమేతంగా చూడదగ్గ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మ్యూజిక్ షాప్ మూర్తి' అని దర్శక నిర్మాతలు తెలిపారు. 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు', 'బేబీ', 'డీజే టిల్లు' వంటి విజయవంతమైన సినిమాలను పంపిణీ చేసిన యువ నిర్మాత ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా ఈ సినిమా విడుదల కానుంది.


Also Readవిశాఖలో విజయ్ దేవరకొండ - ఫ్యాన్స్ మీట్‌లో రౌడీ బాయ్ రగ్గడ్ లుక్ చూశారా?


అజయ్ ఘోష్, చాందిని చౌదరి, ఆమని, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి తదితరులు నటించిన ఈ సినిమాకు రచన - దర్శకత్వం: శివ పాలడుగు, నిర్మాతలు: హర్ష గారపాటి - రంగారావు గారపాటి, సహ నిర్మాతలు: సత్య కిషోర్ బచ్చు - వంశీ ప్రసాద్ రాజా వాసిరెడ్డి - సత్యనారాయణ పాలడుగు, సంగీతం: పవన్, సాహిత్యం: మహేష్ పోలోజు - పవన్, ఛాయాగ్రహణం: శ్రీనివాస్ బెజుగం.