Balakrishna Controversy: క్యాజువల్‌గా తోశారంతే... మందు బాటిల్ - బాలకృష్ణ, అంజలి ఇష్యూపై నిర్మాత క్లారిటీ

Gangs Of Godavari Event Controversy: 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ప్రీ రిలీజ్‌లో స్టేజిపై  అంజలిని బాలకృష్ణ పక్కన తోసిన ఘటన వివాదాస్పదమైంది. మందు బాటిల్ ఉందని రచ్చ జరుగుతోంది. వాటిపై నిర్మాత స్పందించారు.

Continues below advertisement

Balakrishna really pushes Gangs Of Godavari actress Anjali?: గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యువ హీరో విశ్వక్ సేన్ తాజా సినిమా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ప్రీ రిలీజ్ వేడుకకు ఆయన అతిథిగా వచ్చిన విషయం అందరికీ తెలుసు. స్టేజి మీద అంజలిని పక్కకు తోయడంపై నెటిజనులు భగ్గుమన్నారు. అగ్ర హీరో ఆ విధంగా చేయడం తగదని పోస్టులు పెడుతున్నారు. దీనిపై విశ్వక్ సేన్, 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' నిర్మాతలలో ఒకరైన సూర్యదేవర నాగవంశీ స్పందించారు.

Continues below advertisement

ఆ వీడియో వెనుక ముందు చూస్తే క్లారిటీ వస్తుంది
అంజలిని బాలకృష్ణ తోసిన వీడియో వైరల్ అవుతుందని, అసలు స్టేజి మీద ఏం జరిగిందని ప్రశ్నించగా... ''దానికి వెనుక ముందు చూస్తే సరిపోతుంది'' అని విశ్వక్ సేన్ చెప్పారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ... ''స్టేజి మీద ముగ్గురు నలుగురం మాట్లాడుకుంటున్నాం. ఉదాహరణకు... విశ్వక్, మీరు మాట్లాడుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని జరగమని చెబితే వినపడలేదు. విశ్వక్, మీకు మధ్య మంచి రిలేషన్షిప్ ఉన్నప్పుడు పక్కకు జరగమని క్యాజువల్‌గా వెనక్కి అన్నారు. అది అక్కడ జరిగింది. ముగ్గురు స్నేహితులు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఒకరికి వెనపడకపోతే జరగమని వెనక్కి తోశారంతే'' అని చెప్పారు. కాంట్రవర్సీ చేయాలని కొందరు ప్లాన్ చేసి మరీ కాంట్రవర్సీ చేసిన దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఎందుకని నాగవంశీ ప్రశ్నించారు. 

హైఫై కొట్టుకున్న వీడియోలు బయటకు రాలేదుగా!
అంజలిని బాలకృష్ణ గారు తోసిన వీడియో ఒక్కటే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారని, అయితే ఆ తర్వాత వాళ్లిద్దరూ చక్కగా హైఫై కొట్టుకున్నారని, ఆ వీడియోలు మాత్రం ప్లే చేయడం లేదని నాగవంశీ వివరించారు. బాలకృష్ణ సీట్ పక్కన, ఆ కింద ఏమీ లేదని... ఈవెంట్ చేసిన తనకు బాగా తెలుసనీ, బాటిల్ (మందు) సీజీలో పెట్టారని కూడా ఆయన తెలిపారు. విమర్శలకు ఆయన ఆన్సర్స్ చెక్ పెడతాయని ఆశించవచ్చు.

Also Read: ప్రశాంత్ వర్మతో రణవీర్ సినిమా లేదు - వాళ్లిద్దరూ అఫీషియల్‌గా చెప్పేశారు

'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'లో అంజలి ఓ కథానాయిక కాగా... నేహా శెట్టి మరో నాయిక. ఈ సినిమాకు ముందు, కొన్నాళ్ల క్రితం 'డిక్టేటర్'లో బాలకృష్ణ సరసన అంజలి నటించారు. ఇద్దరి మధ్య పరిచయం ఉంది. ఆ చనువుతో బాలకృష్ణ ఆమెను పక్కకు జరగమని తోశారని, అందులో రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏముందని నందమూరి అభిమానులతో పాటు చిత్రసీమలో కొందరు ప్రముఖులు చెబుతున్నారు.

Also Readసుక్కుతో స్టెప్పులు వేయించిన డ్యాన్స్ మాస్టర్ - ఈ లిరికల్ వీడియో స్పెషాలిటీ ఏంటో తెలుసా?


'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య నిర్మించారు. ఈ నిర్మాణ సంస్థల్లో బాలకృష్ణ తన తదుపరి సినిమా చేస్తున్నారు. బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా రెండో గ్లింప్స్ బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా జూన్ 10న విడుదల చేయనున్నారు.

Continues below advertisement