వెంకటేష్, వరుణ్ సందేశ్‌ల ‘F2’ సీక్వెల్ ‘F3’ విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ‘F3’ నుంచి ఒక్కో అప్‌డేట్ ప్రేక్షకుల్లోకి వదులుతున్నారు. తాజాగా పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘‘అధ్యక్షా.. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాల’’ అంటూ సాగే ఈ పాటలో పూజాతో కలిసి వెంకీ, వరుణ్‌లు చిందులేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ సైతం వీరితో కలిసి స్టెప్పులు కలిపారు. 
 
‘‘హాత్ మే పైసా... 
మూతి మే సీసా...
పోరితో సల్సా... 
రాతిరంతా జల్సా..   
అధ్యక్షా... లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా!’’ అంటూ సాగిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రాశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో రాహుల్ సిప్లిగంజ్, గీతా మాధురి ఆలపించారు. పార్టీ సాంగ్స్‌లో ఇకపై ఈ పాట మారుమోగే అవకాశం ఉంది. 


Also Watch: నయన తార ‘O2’ టీజర్, ఊపిరి బిగపెట్టుకుని చూడాల్సిందే!



వెంకటేష్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ జోడీగా మెహరీన్ కౌర్, మరో కథానాయికగా సోనాల్ చౌహన్... ఇతర ప్రధాన పాత్రల్లో రాజేంద్ర ప్రసాద్, సునీల్ నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప‌తాకంపై 'దిల్' రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. మే 27న సినిమా విడుదల కానుంది. ‘ఎఫ్2’ సినిమా తరహాలోనే ఈ చిత్రం కూడా మంచి హిట్ కొడుతుందని దగ్గుబాటి, మెగా ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. మరి, దర్శకుడు అనిల్ రావిపూడి ఏం మ్యాజిక్ చేస్తారో చూడాలి. 


Also Read: వరుణ్ తేజ్ సినిమాలో విలన్‌గా - తెలుగు తెరకు తమిళ్ హీరో రీఎంట్రీ